ఆంధ్ర ప్రజల సహనం
తెలంగాణ రాష్ట్రము ఏర్పడి నెల పది రోజులైంది. తెలంగాణ సీఎం చకచక తన పనులు తాను చేసుకుంటు ముందుకెళ్తున్నడు. ఇతర మంత్రులు కూడ తామేమి తక్కువ కాదన్నట్టు వారి వారి శాఖ పనులను ఉత్సాహంగ చేస్తున్నరు. తెలంగాణ వచ్చిన నెలలోనే బొనాలు, రంజాను పండుగ రావటముతొ రాష్ట్రములో ప్రజలు నీటి కరువు కూడ మర్చిపోయి సంబురాలు చేసుకుంటున్నారు.
పక్కవాళ్ళు సంతోషంగా ఉంటె ఓర్వలేని వాళ్లు వుంటరు. అర్జంటుగా ఎలాంటి చర్చ లేకుండా, స్థానికుల విన్నపాలకి విలువ ఇవ్వకుండా ఇద్దరి నాయుల్ల కోరిక మేరకు ఖమ్మంలోని ఏడు మండలాలను ఏట్లో ముంచె నిర్ణయం తీసుకుంది పార్లమెంటు. స్థానికులకు ఇష్టములేకుండ ఆ ప్రాంతాన్ని బలవంతంగా మరో ప్రాంతంలో కల్పటము రాజ్యాంగ విరుద్ధము కదా. ఈ ప్రాంత ప్రజలకు కొత్త కేంద్ర ప్రభుత్వము 'అచ్ఛే దిన్ ' ఏమో కాని 'చచ్చే దినా'లను ముందుకు తెచ్చింది. తెలంగాణ ప్రజలంతా సంతోషంగా పండగ చేసుకోకుండ అయితుంది.
కేంద్రము ఆంధ్రలోని ఇద్దరు నాయుళ్ళ చేతుల్లో వుందాని అందరికి అనిపిస్తుంది. అయినా ఇంకా ఆంధ్ర రాజధాని ఎక్కడో తేలకపోవడం అనుమానాలకు తావిస్తుంది. చంద్రబాబు ఉమ్మడి రాజధానిగా హైదరాబాదును పదిహేనేళ్ళు కావాలని అడగటము, ఆం. ప్ర . తెలంగాణ ఉమ్మడి గవర్నరుకు అత్యధిక పవర్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరడంలో చాలానే స్వార్థముంది. కేవలము రాజకీయనాయకులు, ధనికస్వామ్య బడాబాబులకోసం హైదరాబాదులో పర్మినెంటుగ మకాం పెడదామని అనుకుంటునట్టుంది. అందుకే ఆంధ్రలో రాజాధాని గురించి అలోచించకుండ హైదరాబాదులో కూర్చోని రోజుకో శ్వేత పత్రము విడుదల చేస్తు కాలం గడుపుతున్నడు. సామాన్య ఆంధ్ర ప్రజల సహనాన్ని మెచ్చుకోవాలి. వారి రాష్ట్రము వారికి వున్నా వారి రాజకీయనాయకులు, సిఎం సహా మంత్రులందరు హైదరాబాదులోనే తిష్ట వేసి అక్కడి నుండే పాలన చేస్తున్నా భరిస్తున్నరు. ఎన్నాళ్ళు ఓపిక పడుతారో చూడాలి. ఆంధ్ర నాయకులు ఆంధ్ర - తెలంగాణ మధ్య up & down పాలన ఉద్యోగము చేస్తున్నట్టుంది. ఎంతకాలం ఇలా సాగదీస్తరో చూడాలె.
చంద్రబాబు నాయుడు ఎంతసేపు నేను హైదరాబాదు develop చేసానని చెప్పుకుంటున్నడె తప్ప ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర రాజధాని development గురించి కలలు కల్పించటము తప్ప్పిస్తే ప్లాన్లేవి ముందు పెడుతలేడు. వర్తమానము, భవిష్యత్తులో ఏమి చేయలేనివాడే గతంలో చేసినపనుల గురించి మాత్రమె మాటిమాటికి గొప్పగా చెప్పుకుంటు బతుకుతాడంట!

.jpg)