పతంగుల పండుగ
నా చిన్నప్పుడు సంక్రాంతి పండగంటె పతంగుల పండగె. దీపావళి
అయిపోయినంక కొద్ది రోజులనుండె పతంగులు ఎగురేసుడు మొదలు
పెట్టేవాళ్ళు. అది క్రిస్మస్ సెలవుల నుండి కొద్దికొద్దిగా ఎక్కువై సంక్రాంతి
నాటికి జోరెక్కువైయ్యెది. సంక్రాంతి తరువాత స్కూల్లు తెరిచినంక ఆగి
పోయేది. అదే సమయంలో ఆడపిల్లలు ఇంటి ముందు రకరకాల కొత్త
ముగ్గులు నేర్చుకొని వెయ్యటము, కనుము రోజు రథము ముగ్గుతో ఈ
ముగ్గుల పోటి ఆగిపోయేది. రథము ముగ్గుల గురించి పత్రికల్లో ఎన్ని
జోకులో!
సంక్రాంతి నాడు ఆవుపేడ పట్టుకొచ్చి గొబ్బెమ్మ్ల చేయటము
అందులో పెట్టడానికి వెతికి వెతికి గర్బపోసలు పట్టుకొచ్చి గుచ్చిపెట్టడము
పిల్లల పని. గొబ్బెమ్మకు బొట్లు పెట్టి, కడపకు రెండు చివర్ల పెట్టటము,
వాకిట్లో పెట్టడము, వాటి పక్కన నవధాన్యాలు పోసి, రేగుపళ్ళు, చెరుకు
ముక్కలు పెట్టటము ఓ చక్కటి ఙ్ఞాపకం. అందుకోసం తెచ్చిన రేగుపళ్లు
అమ్మచూడకుండ గుట్టుకు మనటము, చెరుకు ముక్కలు చప్పరించటము
చిన్న అల్లరి పని. నవధాన్యాలను కోడి పిల్లలు, పిట్టలు తింటుంటె చూడటము
సరదాగా వుండేది. ఆ నాటి హైద్రాబాదు - సికింద్రాబాదులొ మామూలు మధ్య
తరగతి బస్తీలో ఇది చాలా సాధారణము.
పండగ నాడు ఇంట్లో పెద్దవాళ్ళు స్పెషల్ వంటల ప్రిపరేషన్లొ వుంటె పిల్లలు,
ముఖ్యంగా మగపిల్లలు, పతంగులు ఎగరేయటములో, 'కాట్' అయి కింద
పడుతున్న పతంగులు పట్టుకోవడంలో బిజిగా వుంటరు. చిన్న చెల్లెల్లు
తమ్ముళ్ళకు చక్రి పట్టుకునే పని వుండెది. రకరకాల పతంగులు, రకరకాల
పేర్లు - నామందార్, డొప్పన్, గిల్లార్, లంగోట్, గుడ్డిదార్, గుడ్డిలంగోట్, నామ
డొప్ప, బాచ్‍కోర్ మొ. ఆ పతంగులకు కన్నాలు కట్టడము ఓ పెద్ద టెక్నికల్
పని. ఆ కన్నాల సరిగ్గ కడితేనె పతంగి మంచిగ ఎగురుతుందని నమ్మకము.
గాల్లో గిర్కిలు కొడ్తుంది తప్ప ఏ మాత్రము పైకి ఎగురదని భయము.
పిల్లలు చాలసార్లు పెద్దవాళ్లతో, అనుభవమున్నవాళ్లతో పతంగి 'కన్నాలు'
కట్టించుకుంటారు. తరువాత దానికిమాంజ కట్టాలె. మాంజాల్లో కూడ రకాలు,
రంగులు. ఈ మాంజలు పండగకు నెలరోజుల ముందునుండె తయారు చేసి పెట్టుకుంటరు.
సీసముక్కలు చాలా మెత్తటిపొడి చేసి, మెత్తగ ఉడికిన అన్నము, కావలసిన రంగు కలిపి,
దాన్ని పిడికిట్లో పట్టుకొని, గోడకు కొట్టిన రెండు మొలల మధ్య కట్టిన దారం వరసలకు
రుద్దుతారు. ఈ మాంజదారం తట్టుకొని, చుట్టుకొని పక్షులకి, మనుషులకు
కోసుకపోవటము, కొన్ని సార్లు ప్రాణాలు పోవడము జరిగేది! అట్లా వార్తలు
వచ్చేవి.
పతంగికి ముందు కొంత మాంజదారం, దాని తరువాత సాదా ట్వైన్ దారముండేది.
మగపిల్లలు, దోస్తులతోనో, బంధువులతోనో గుంపులు, గుంపులుగా ఇండ్లముందు,
లేదా మిద్దె మీద, లేదా దగ్గరలో వున్న మైదానములో కాని పతంగులు ఎగురేసేది.
అందులొ కొందరు డోలు కూడ దగ్గ్రర పెట్టుకునేటోళ్ళు. పతంగులు ఎగిరేసేటప్పుడు
పక్కన ఎగురుతున్న పతంగితో 'పేంచ్' ఎయ్యటము, లేదా పేంచ్లో చిక్కుకోవటము
తప్పదు. 'పెంచ్' పడటమంటె పతంగుల యుద్ధమన్నట్టే. పక్కవాడి వదులుతున్నడా,
లాగుతున్నాడా అన్నదాన్ని బట్టి ఇవతలి వాడి రెస్పాన్స్ వుండేది. అప్పుడు చక్రి
పట్టుకోవడము, దాని దారము వదలటము ఓ పెద్ద ఇష్యు. దారం గుంజుతుంటే,
దస్తికొట్టాలా మెల్లగ చుట్టాలా ఓ ఆర్డర్. పేంచ్ అవతలి వాడు మాంజతో మాములు
ట్వైన్తొ పెంచ్ పెడ్తె అది ఎవరిదొ తెలిస్తె వాడిమీద అరవడమే. మాంజ, మాంజలో
వున్న పతంగిలే పేంచ్ వేయాలి. అది 'కీంచ్ కాట్' కావచ్చు, 'డీల్' కావచ్చు.
పతంగి కాట్ చేయ్యగానే చేసినోడి గ్రూప్ పెద్దగా 'అఫా' అని అర్సుడు, డోలు ఉన్నోడు
అది 'ఢం ఢం' అని బజాయించుడు. పతంగి కాట్ అయినోడు గబగబా దారం
చక్రికి చుట్టేసికుంటడు. లేకపోతే అది కిందికి అందితె దారిలో ఎవడన్నా మంచి
మాంజ అయితె కొట్టేస్క పోతడని భయం. కొంత మంది బీద పిల్లలు, వాళ్ల
పతంగులన్ని అయిపోగొట్టుకున్నోళ్లు ఓ కట్టెకు పై చివరకు ఓ కంప కట్టినది
పట్టుకొని మెడలన్ని నొప్పి పుట్టేవరకు ఆకాశకెల్లె చూసుకుంట నిలబడ్తరు.
ఎక్కడైన పతంగి కాట్ కాంగనే అది ఎటు పడ్తుందనుకుంటె ఆ దిక్కు చూసుకుంట
ఉరుకుడె, ఆ పతంగిని ఆ కట్టేతో పట్టుకుందామని. ఆ ఉరుకుట్ల పిల్లలకు దెబ్బలు
తగలటమే కాదు, మోర్లనో, మోటరు కిందనో పడటము, అట్లాగే మిద్దలమీద
ఎగిరేసోటోళ్ళు ఎగురేసుకుంటనో, కింద పడబోయెదాన్ని పట్టుకోబోయి జారి
పడటము అప్పుడప్పు జరిగేవి. అందుకని పెద్దవాళ్ళు ఆప్పుడప్పుడు
వచ్చి జాగ్రత్తలు చెప్పడము జరిగేది. అట్ల్లాగె వచ్చి తినిపొమ్మని చెప్పటము
జరిగేది. బాగా ఆకలేస్తె గాని తిండికి పోవుడు కష్టమే. లేదా కొన్న
పతంగులన్ని అఫా అన్న కావాలె.
సంక్రాంతి నాడు సాయంత్రము ఒకరో, ఇద్దరో దీపం పతంగు లెగిరేసెటోల్లు.
అవి ఆకాశంలో చుక్కల్ల కాసెపు అటు, ఇటు కదిలేవి. తర్వాత దించేటోళ్ళు.
వాటికి పేంచ్‍లు వుండవు. ఎక్కడో ఎవరో ఒకరు మూడునాల్గు పతంగులను
కలిపి సీర్యలు పతంగులు ఎగిరేస్తు అట్ల కాసేపు ఆశ్చర్యంగ చూట్టమే.
చిన్నపిల్లలు, ఆడ పిల్లలకు పతంగి బాగా పైకి ఎగిరినంక వాళ్ళ అన్నదమ్ములు
కాసేపు దారం పట్టుకునే అవకాశమిచ్చేటోళ్ళు. మొత్తానికి సంక్రాంతి పండుగ
మగపిల్లల పండగనిపించేది.
సికింద్రాబాదు, హైద్రాబాదులో జరిగినంత బాగా పతంగుల పండుగ తెలంగాణలో
వేరే ఎక్కడైనా జరుగుతుందా? ఆంద్రాలో అయితె అసలే జరగదు. వరంగల్లులో
అయితె సంక్రాంతి అంటె సకినాలు, అరిసెలు, ఇంక కొన్ని పిండి వంటలే.
పతంగులు ఎగిరేసుడు తక్కువే.
ఏది ఏమైనా సంక్రాంతి పండగ రాష్ట్రములో వాళ్ల వాళ్ల ఆచారలను బట్టి అందరు
గొప్పగానే జరుపుకుంటరు.

No comments:
Post a Comment