చెండాట
"ఈ కిరణ్ కుమార్ రెడ్డి మళ్ళెమో కిరికిరి పెడుతుండు, ఏందిది?"
"ఏం కిరికిరి పెట్టినా తెలంగాణ వచ్చుడు ఖాయమంటున్నగద."
"బిల్లు వెనిక్కి పంపిస్తరట. చంద్రబాబే ఐడియా ఇచ్చిండంట!"
"చంద్రబాబు కిరణ్ణు ఫూల్ చేద్దామని చూస్తుండు. లేకపోతె
వారం కిందనే గడువడిగే బదులు బిల్లు వెనిక్కి పంపమని
చెప్పాల్సిండె. కిరణ్ తెలివితక్కువోడని ఆంధ్రలో తన పవరు
పెంచుకుంటుండు."
"ఆయన పవరు పెంచుకునుడేందోగని తెలంగాణ ప్రజలను మాత్రం
పరేషాన్ చేస్తుండ్రు. ఈ రూల్ 77 రాష్ట్రపతి ఆర్టికల్ 3 కింద పంపిన
తెలంగాణ్ బిల్లుకు వర్తిస్తుందంటావా?"
"బిల్లు చర్చింకుంట, ఇంకా సమయము కావలని ఒకటికి రెండుసార్లు
అడుగుతున్నరు. అట్లాంటప్పుడు వెనిక్కి ఎట్ల పంపుతరు? అల్రడి
అందరు రాతపూర్వకంగా వాళ్ళ అభిప్రాయలను స్పీకర్‍కు ఇచ్చిండ్రు
కూడ. సీమాంధ్రలో ఓట్లకోసం ఆడె నాటకమంతా."
"ఆ మహానుభావుడు, దార్శనీకుడైనా బాబా సాహేబ్ అంబెద్కరను
మొక్కాలి. మంద బలముతో ఈ ఆంధ్రోల్లు ఎప్ఫటికైనా తెలంగాణ
రానిచ్చె వాళ్లా? వీళ్ళ బాధ మనం ఇంకెన్ని రోజులు భరించాలో?"
"ఒక్క నెల. అంతకంటె ఎక్కువ కాదులే."
"ఏమో? రోజులు లెక్కబెడుతున్న. వీళ్ల దిగజారుడు మాటలు, దిగ
జారుడు రాజకీయాలు చూస్తె అసలు 'where we are going'
అర్థం కావట్లేదు. కేంద్రము బిల్లు పెట్టి, అందరి అభిప్రాయాలు పంపమంటే
అన్ని ప్రాంతాల వాళ్ళని కూచోబెట్టి మాట్లాడలేదంటరు. విభజన తప్పదు,
మీ అవసరాలు చెప్పండనె కదా అసెంబ్లిలో బిల్లు గురించి చర్చించి చెప్పమన్నది.
అవసరాలు చెప్పకుండ కేంద్రాన్ని, రాష్ట్రపతిని తిడుతున్నరు. ఇంక వేరె
కూచోబెట్టి అడిగేదేంది?"
"వాళ్ళకు తెలుసు విభజన తప్పదని. అయినా డ్రామాలాడుతున్నరు. ప్రజలు
తెలివి తక్కువ వాళ్లనుకుంటున్నరు. కాని ఎలక్షన్లప్పుడు ఈ నాటకాల రాయుల్ల
సంగతి చూసుకుంటరు."
"అవును. సామన్యుడు రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పడానికి ఉన్న ఏకైక ఆయుధం
ఓటు. ఓటు హక్కున్న ప్రతి ఒక్కరు దాన్ని తప్పకుండ సద్వినియోగం చేసుకోవాలె."
No comments:
Post a Comment