ముగిసిన రభస
"హమ్మయ్య ఒక ఘట్టం ముగుసింది."
"అవునవును. దీనితో అందరి గుణాలు బైటపడ్డయ్."
"ఇంతకు రూల్ 77 అని తీర్మానము బెట్టి కిరణ్ ఏం
సాధించిండంటవ్? దానికి చంద్రబాబు కూడ సపోర్ట్. జేపీ
వత్తాసు. దీనివల్ల ఎవరికేం లాభమైంది?"
"ఎవ్వరికి లాభం లేదు. మళ్ళి మాట్లాడితె వాళ్ళ తెలివి
తక్కువతనము, టక్కరితనం బైటపడ్డది."
"ఆ తీర్మానము పెట్టి తెలంగాణ వాళ్ళు సభకు అడ్డుపడెటట్టు
చేసింన్రు. వాళ్ళు అడ్డుపడకుండా వుంటె ఇంక కొంతమంది
సభ్యులు మాట్లాడేవాళ్లు కదా. "సోమవారము వరకు ఆగండి.
నేను బ్రహ్మాండంగా మాట్లాడుతను. చాలా బాగ మాట్లాడతను",
అని చంద్రబాబు గొప్పగా సభలో అన్నడు. ఇప్పటి వరకు రెండు కళ్ళు,
ఇద్దరు కొడుకులు, కొబ్బరి చిప్పలు, ఆపరేషను కోతలు అన్న చంద్రబాబు
మళ్ళేం కొత్త థీయరి ముందు పడ్తడో వినాలని నాకేంతో వుండే."
"అసలు చంద్రబాబును మాట్లాడకుండా చేయలనేమో ఈ నాటకము."
"ఏమో. కిరణ్ కుమారైతె డైలీ సీరియల్‍లాగ మూడు రోజులు మాట్లా
డిండు. తరువాత వేరె వాళ్లకు అవకాశ మివ్వాల్సింది కదా. చంద్ర
బాబు మాట్లాడె అవకాశము కోల్పోవటం ప్లాన్ ప్రకారమైనా, అనుకో
కుండా అయినా అది ఆయన దురదృష్టము."
"ఆయన దురదృష్టమో, అదృష్టమో! రాష్ట్ర విభజన అడ్డుకొని 1200
మందికి చావుకు కారణమైనోడికి రోగము కుదిరిందనుకుంట."
"కాని చంద్రబాబు రేపటి రోజు "ఈ కేంద్రము ఏ హక్కుతో రాష్ట్రాన్ని
విడదీసింది. ప్రతిపక్షనాయకుడినైన నా అభిప్రాయాన్ని తెలిపే
అవకాశమీయలేదు. ఏక పక్షంగా రాష్ట్రాన్ని విభజించింది. తెలుగు
జాతిని చీల్చింది", అంటు సీమాంధ్రలో ప్రచారము చేస్తడు కదా!"
"కాని ప్ర్జజలు తెలివితక్కువోళ్లేం కాదు. ఈ రాష్ట్రము విడిపోక తప్ప
దన్నప్పుడు మనకు కావల్సిన వాటి గురించి అడగాలని అనుకున్నరు.
ఒక్కరంటె ఒక్కరు ఆ మాటే అడగలేదు. ఎంతసేపు ఈ విభజన అడ్డు
కుంటమని పేలటమే. ఇప్పుడున్న ఈ నాయకులు మళ్ళి ఎలక్షన్లో
ఎంత మంది గెలుస్తరో చూడాలే."
"ఈ కిరణ్ కుమార్ రెడ్ది చేసిందంతా సొంత తెలివేనంటవా?"
"రేపటి రోజు అతను కొత్త పార్టీ పెట్టుకుంటడో, లేకపోతే కాంగ్రెసు అతనికే
నామినేటెడ్ పోస్ట్ ఇస్తుందో చూస్తె తెలిసి పోతుంది."
"ఎవరు చేసిండ్రో, చేయించిన్రోగని వీళ్లు తెలంగాణ ప్రజలను పెట్టుకున్న
గోస అంతింత కాదు. ఆ దేవుడె వాళ్లకు శిక్షవేయాలి."

No comments:
Post a Comment