ఐదారేళ్ళ క్రితమే నా కనిపించింది, భగవద్గీత ఇంట్లో ప్రశాంతంగ వినే రోజులు లేవని. నాకు బాగ తెలిసిన ఒకావిడ అంది, "ఈ మధ్య నాకు భగవద్గీత వినబడితె భయం వేస్తుంది".
"ఎందుకలా" అనబోయిన. కాని వెంటనే గుర్తోచింది. నాకు కూడ దూరం నుండి ఎప్పుడైన ఘంటసాల గొంతు ’అర్జునా అత్మ ఎండకు ఎండదు, వానకు తడవదు’ అని వినిపించినప్పుడు, దగ్గరలో ఎవరో చనిపోయారనో, లేదా టెంపోలోనో, మరేదో వాహనంలో శవయాత్ర సాగుతుందని.
"అట్లా అలోచించకండి. భవద్గీత అసలు ప్రతిరోజు చదవల్సినది. కొంతమంది ఇంట్లో ఎవరో చనిపోయినప్పుడో, లేదా శవయత్ర అప్పుడు పట్టి మనలాంటి వాళ్ళను పరేశాన్ చేస్తున్నరు. పట్టిచ్చుకోవద్దు" అని ఏదో మాట్లాడి పంపించాను.
నాకు చదావలనిపించినప్పుడు భగవద్గీత చదువుతాను. కాని నా దగ్గర వున్న భక్తిగీతాలలో ఘంటసాల భగవద్గిత పెట్టాలంటె మాత్రం భయం. పక్కవాళ్ళు ఇంట్లో ఎవరైనా చనిపోయరనుకుంటరేమో అని.
ఓసారి మా వారితో అన్నాను, "భగవద్గీత అంత చక్కటి ఆధ్యాత్మిక గ్రంధాన్ని చనిపోయినప్పుడు మాత్రం వినిపించి అది ఎవరు చదవకుండా, వినకుండా చేస్తున్నరు. చనిపోయిన ఇంట్లో, శవయాత్ర అప్పుడు అది పెట్టకుండ నియంత్రిస్తె మంచిది. స్కూళ్ళల్లో కూడ భగవద్గీత చదివించాలి. అది మనిషి ఎలా బతకాలో నేర్పిస్తుంది. భగవద్గీతలో వున్న జ్ఞానం చిన్నప్పుడె కొంతైనా నేర్పిస్తె మనుషులు కాస్తైన నీతి నియమాలు పాటిస్తరేమో!"
"చిన్న జీయరస్వామి వారికి నీ అభిప్రాయం చెప్తు ఓ ఉత్తరం రాయి", అన్నారు మా వారు.
"నేనెంటి, జీయరస్వామి వారికి ఉత్తరం రాయటమేంటి? అంత గొప్ప మనిషికి ఈ విషయం ఇంత వరకు తెల్యదా? నా ఉత్తరం ఏ చెత్త బుట్టలో పడుతుందో లే" అని అనుకున్న.
ఒకటి రెండుసార్లు నిజంగానే ఉత్తరం రాయలనిపించినా రాయలేదు. ఎప్పుడో ఒకసారి ఈ విషయం గురించి బ్లాగ్ రాద్దామని అనుకున్నా. ఇప్పటికి కుదిరింది. నాలాగే అలోచిస్తున్న వాళ్ళున్నారని నాకు తెలిసింది. నిన్నె ఓ వాట్సాప్ పోస్ట్ చూసాను. భగవద్గీతను శవయాత్ర అప్పుడు పెట్టడము మానాలని.
మతాచార్యులు ఈ విషయం గురించి కాస్తా అలోచించాలి. ముందుగా గుళ్ళలో ప్రతిరోజు ఏదో ఒక సమయంలో భగద్గీతలో కొన్నిశ్లోకాలు చదివి దాని తాత్పర్యము చెప్పేటట్టు చూస్తె, పండగలప్పుడు కూడా ఆ సందర్భానికి తగ్గ శ్లోకాలు, వాటి తాత్పర్యాలు చెపుతుంటె ప్రజలు కూడ ప్రతిరోజు కాకపోయిన అప్పుడప్పుడు భగవద్గీత వినడము, చదవడము చేస్తరు. భగవద్గీత సారాన్ని కాస్తైనా వంటపట్టించుకుంటరు.
మనిషి దుఖఃము నుండి కోలుకోవడానికే కాదు, కష్టాలను అధిగమించడానికి, అన్ని సందర్భాలలో సమన్వయంతో మెలగడానికి, ప్రకృతి చైతన్యంలో భాగమై సకల జీవులతో సామరస్యంగా జీవించటానికి భగవద్గీత దిశానిర్దేశము చేస్తుంది
Image Source: Google images of Krishna-Arjuna
