అందమైన గులాబీలంటె అందరికి ఇష్టమె. వాటిని సొంతం చేసుకోవాలంటె ముళ్ళు గుచ్చుకోకుండా జాగ్రత్త తీసుకోవాలి. జీవితంలో కూడా ఏదైన కావలనుకుంటె కొన్ని కష్టాలు ఓర్చుకోక తప్పదు.
Tuesday, December 31, 2019
Saturday, December 7, 2019
ఆటవిక న్యాయం
జనారణ్యంలో
మృగాలకు
ఆటవిక న్యాయం
సరి! సరి!
బలవంతుల
చేతిలో
బలహీనులు
బలి! బలి!
*******
అడిగిందె అయింది
అనుకున్నట్లే అయింది
అయినా
అంతరాంతరాలలో
భయం, భయం
న్యాయం వికటాట్టహాసం!
ధర్మం ఆక్రోశం!
*********
మండే గుండెలపై
చిటికెడు
నీళ్ళు చిల్కరించారు
ఆ జ్వాలలు చల్లారేనా?
వేరు పురుగుకు
వైద్యం చేయక
వాడిన కొమ్మను నరికితె
చెట్టు చిగురించేనా?
*********
హృదయం
చిధ్రమైంది
దానిని అతికించె
మలామేది?
మానవత్వమే మందైతె
అది
అందని పండైంది!
********
కళ్ళెం లేని
కోరికలు
జీవితాలు
దహిస్తుంటే
ఆలోచన లేని
ఆవేశాలకు
రాజ్యం
లొంగిపోయింది!
*********
నిరంతర
నిఘాలో
ఆడ బతుకు!
మగవాడి
కౄరత్వానికి
లేదా అదుపు?
**********
ప్రజాస్వామ్యంలో
రాజకీయ మృగాలకు
కోర్టులో
జీవితాంతం వాయిదాలు?
సామాన్యుని
నేరానికి
ప్రజాకోర్టులో
ఇన్స్టంట్ శిక్షలు!
**********
మాటల తుటాలతో
జీవితాలు
అంతం చేసిన
నాయకులకేది శిక్ష?
ప్రజాస్వామ్యంలో
ప్రభుత్వాన్ని
నిలదీసే సామాన్యునికి
కావాలి
ఎన్కౌంటర్ నుండి రక్ష!
Subscribe to:
Comments (Atom)

