Wednesday, November 18, 2020

రైతు బతుకు

 


 రైతన్నకు ఎప్పుడు కష్టాలే.  కాలమైన కాకున్నా బతుకులో సుఖం లేదు

 

ప్రకృతి అనుకూలించి పంట చేతికొచ్చినా  

 

దండిగా పండినా

మద్దతు ధర లేకపోయే

కూలీకూడా  గిట్టుబాటు కాదాయే

***********

అకాల వర్షాలొస్తే

 

పంట మునిగింది

కన్నీటి వరదలో

ప్రాణం కొట్టుకపోయే

**********

అనావృష్టి అయితే

 

పంట ఎండింది

కడుపు మండింది

చితాభస్మమే మిగిలింది