రాజకీయాలు చాలా విచిత్రంగా వుంటాయి. రాజకీయనాయకులు ఎప్పుడు ఏమి మాట్లాడుతారో వారికే తెలియాలి. ప్రజలు వట్టి గొర్రెలమంద వాళ్ళు చెప్పేటివన్నీ నమ్ముతారని
భావిస్తారనుకుంట. కానీ, మన ప్రజాస్వామ్య భారతములో ప్రజలు ప్రతిసారి ఎన్నిక్కల్లో వారి నిర్ణయాన్ని చాలా
చక్కగా తెలియచేస్తున్నారు. అందుకే చాలా సార్లు
ఫలితాలు ఊహించని రీతిలో వస్తున్నాయి.
రాజకీయ నాయకులను ప్రజలు ఎన్నిక అయిన మొదటిరోజునుండే గమనిస్తువుంటారు.
చాలాసార్లు వార్తా పత్రికలు ప్రభుత్వం వున్నన్నాళ్లు, ప్రభుత్వముతో తగాదా పెట్టుకోవడము ఇష్టములేక ఎన్నకలైన నాలుగు సంవత్సరాల వరకు
చాలా తక్కువగా విమర్శిస్తారు. ప్రభుత్వముతో తగాదా పెట్టుకొని ఎందుకు చిక్కుల్లో పడాలి
అని. కొన్ని పత్రికలు చిక్కుల్లో పడుతున్న విమర్శిస్తుంటాయి. నాలుగో సంవత్సరము పూర్తి అయిందంటే విమర్శల జోరును
పెంచుతూ ఎన్నికలు దగ్గరపడ్డాయంటే ప్రభుత్వము చేసిన అవకతవక పనులనింటిని అన్నీ పత్రికలు
ఖుల్లామ్ ఖుల్లా బయట పెట్టేస్తాయి. ప్రతిపక్షపార్టీలన్నీ
కూడా మరింతగా విజృంభిస్తాయి. గత నాలుగేళ్ల బట్టి ప్రభుత్వాన్ని అంచనావేస్తున్న ప్రజలు
ఎన్నికలనాటికి ఒక నిర్ణాయనికి వస్తారు. ఎన్ని
తాయిలాలు పెట్టిన వారి నిర్ణయాన్ని వోటు ద్వారా తెలియ చేస్తారు. అందుకే కదా ఎన్నికల ముందు సర్వేలు చేసినప్పుడు సాధారణ
ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుకుంటారు నాయకులు. అప్పుడు అర్జంటుగా రకరకాల పథకాలతో మభ్యపెట్ట చూస్తారు.
వ్యవస్థే తన అవసరానికి వ్యక్తికి నాయకత్వం ఇస్తుంది. గౌరవిస్తుంది.
ఆరాధిస్తుంది. అది చూసి ఆ నాయకడు వ్యవస్థను
కాదని, తను లేకపోతే వ్యవస్థ లేదని అహంకారము ప్రదర్శిస్తూ వ్యవస్థనే
తెలివితక్కువదిగా చూపిస్తూ, తాను అవతారాపురుషుడిని, తను లేకపోతే వ్యవస్థే నాశనమయిపోతుందని భయపెట్టితే, ప్రజల
ఆ వ్యక్తిని నిర్ద్వంద్వంగా పక్కన పెట్టేస్తారు. వ్యవస్థను గౌరవించని నాయకుడు ప్రజలకు అవసరములేదు.
ప్రతిసారి ఎన్నికలు రాజకీయనాయకులకు పాఠాలు నేర్పుతున్నాయి. కేవలం డబ్బులు పంచినంత మాత్రాన గెలుస్తారని నమ్మడానికి
వీలులేదు. వక్రభాష్యాలు, బెదిరింపులు - ఇప్పటికే పార్టీల గురించి ఒక
అంచనకు వచ్చిన ప్రజల నిర్ణయాన్ని మార్చలేవు.
