Saturday, April 20, 2013

Bangles

గాజులు
గాజులండి గాజులు
రంగు రంగుల గాజులు
అతివలకు అందానిచ్చే
అందమైన గాజులు
మహిళలను మురిపించె
మెరుపు, మెరుపుల గాజులు
గృహిణీలకు కావాలంటె
గల గలాడె గాజులు
జీను పాంట్ అమ్మయిలకు
గడియారల్లె గాజులు
డాబుసరి దొరసానులకు
డైమండ్ గాజులు
పైసున్న పడతులకు
పసిడి గాజులు
పేదింటి ముదితలకు
ముచ్చటైన మట్టి గాజులు
అందమైన గాజులు
ఆడవారందరిని ఆకర్షించె
మంచి మంచి గాజులు.
   
ఈ గాజులు ధరించె చేతులె తల్లుల చేతులు.  పిల్లలను కని
పెంచె చేతులు.  చిన్ననాడు లాలించి తినిపించిన చేతులు.
చేయి పట్టి నడిపించి, భయమేస్తె దగ్గ్రరకు తీసుకొని ధైర్యమిచ్చి
ముందుకు నడిపిన చేతులు.  వయస్సులో ‘ధర్మార్థకామమోక్షార్థం’
చేయి పట్టుకొని తోడు నిలిచె చేతులు.  వంశాన్నిముందుకు నడిపే చేతులు.
 అనురాగాల జల్లులు కురుపించి రక్షాబంధం కట్టె చేతులు. 
ముసలితనంలో మమతలు పంచె చేతులు.
అతివ లేక అవనిలో మానవ మనుగడె లేదు. 
దైవం శక్తి స్వరూపం.  శక్తి స్త్రీ స్వరూపం.
                   *****************************************************************
పితృస్వామ్య భావజాలము మనలో ఎంత పాతుకపోయిందో.
ప్రజా జీవితంలో ఒక స్థాయికి ఎదిగిన స్త్రీలు కూడా వారి స్వీయ వేషధారణ
గురించి కించ పరుస్తు మాట్లాడటము చాలా బాధకరము.  ప్రజల
నాయకులుగా వుంటు, ప్రభుత్వములో మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తు,
చీర కట్టుకోవటము, గాజులు తొడుక్కొవటము చేతగానితనమంటే ఎట్లా?
ఆ మంత్రి చేతకానిదనుకోవాలా? ఆ తిట్టె వాళ్ళను మెచ్చుకుంటుందను
కోవాలా? 
కొన్ని కొన్ని సందర్భాలలో ఉద్యమాలు చేస్తున్న స్త్రీలు కూడ చేతకాని
నాయకులకు చీరలు, గాజులిస్తామని టివిల ముందు చూపించటము
చూసాను.  ఇది వారిని వారు కించపరుచుకోవటము కాదా? పురుష
వస్త్రధారణే శక్తి సామర్థ్యాలకు గుర్తా? ఏ దుస్తులు వేసుకున్న, అలంకరణలు
చేసుకున్న మనుషులన్నసంగతి మర్చిపోకుండ గౌరవము ఇచ్చిపుచ్చు
కోవటము మానవజాతి మహనీయ జాతి కావడానికి ఎంతో అవసరము.

TRS Akarsha

ఆకర్షా - ప్రజా వికర్ష

KCRకు operation 'ఆకర్ష’ అంత అవసరముందా? 
అంటె ఆయనకు తెలంగాణ వాదంపై నమ్మకం పోయిందా?
తెలంగాణ ప్రజలెప్పుడు తెలంగాణ వాదాన్ని గెలిపిస్తునే వున్నరు.
నాలుగు దశాబ్దాల క్రితము గెలిపించారు.  ఇప్పుడు కూడ బోలెడంత
మెజార్టితో మెచ్చిన నాయకులను, తక్కువ మెజార్టితో నచ్చని
వాళ్ళని కూడా గెలిపిస్తున్నరు.  ఎలాగు గెలిపిస్తున్నారు కదా అని
ప్రజ వ్యతిరేకులను నిలిపిస్తె ఓడించక తప్పట్లేదు.  తెలంగాణ నాయకులు
డబ్బుకు అమ్ముడుపోతారేమో కాని, ప్రజలు మాత్రము కాదు.  ఈ
విషయాన్ని TRS/KCR గుర్తుంచుకోవాలి. 
తెలంగాణ కాంగ్రెస్ నాయకులు రాజినామాలు చేస్తె, తెలంగాణ ఎప్పుడో
వచ్చేదని అందరికి తెలుసు.  అట్లాంటి తె.కా లు ఎలక్షనుల ముందు,
లేదా ఎలక్షనులు వచ్చాక TRSలో చేరితే వాళ్లను నమ్మేంత దదమ్మ్లలు
తెలంగాణ ప్రజలు కారు.  తెలంగాణ పేరు చెప్పుకొని ఎలక్షనులో గెలిచే
కొసమే కారు ఎక్కితే ప్రజలు ఆ కారు టైర్లు ఊడబీకి మూల పడేయటం
ఖాయం.  తెలంగాణ ఉద్యమము వల్ల ఎంతో మంది నాయకులు సామాన్య
ప్రజల నుండి పుట్టుకొచ్చారు.  ఎంతో మంది JAC నాయకులు, విద్యార్థి
నాయకలు వున్నారు.  వీళ్ళ్లలో కొందరిని, ‘అమరవీరుల’ కుటుంబాల
నుండి ఒకరిద్దరిని నిలబెడితె గెలిచె అవకాశముంటుంది.  అంతే కాక KCR
తాను ఎప్పుడు చెపుతున్నట్టు బడుగు బలహీన వర్గాలకు  అనుకూలమని
ప్రజలు మరింత అతనిని నమ్మి ఆ నాయకత్వానికి లోబడి పనిచేస్తరు. 
గెలుపు గుర్రాల పేరుతో ధనిక, ఉన్నత వర్గాలకు, కేవలం గెల్చె కోసమే
పార్టి మారిన నాయకులకు టికెట్లు ఇస్తె, కారు షెడ్డుకు తరలించబడితె
ఆశ్చర్య పడక్కర్లెదు.  అది తెలంగాణ వాదము ఓడిపోవటము కాదు. 
అది తెలంగాణ ప్రజల చైతన్యము.  అవకాశ వాద రాజకీయనాయకులకు
బుద్ధి చెప్పటమే.
    ఇలాంటి పరిస్థితిలో తెలంగాణ కోసం పనిచేసె తెలంగాణ ఫ్రంట్ నుండి
కొంత మంది నిలబడితె గెలెచె అవకాశము తప్పకుండ వుంటుంది.  ఈ
దిశలో తెలంగాణ ఫ్రంట్ ఆలోచిస్తుందనే అనుకుంటాను.
తెలంగాణ సమస్య కేవలము ఓట్లు, సీట్ల వ్యవహారంగా కాక, పరిష్కారము దిశగా
రాజకీయ పార్టీలు ఎప్పుడు చిత్తశుద్దితో పనిచేస్తారో కదా!
 

Thursday, April 11, 2013

Politishuns

వీళ్ళు మనుషులేనా?
ఎండలు ఒక్కసారిగ బాగ ఎక్కువయ్యయి.  అప్పుడె వడ
దెబ్బకు మరణాలు రోజు రోజుకు పెరుగుతునె వున్నాయి. ప్రతికూల
వాతవరణము వల్ల మరణాలు,  infectious diseases
వల్ల వచ్చె మరణాలు చాల వరకు నివారించ గలిగినవే. ప్రజల ప్ర్రాథమిక
అవసరాలు, కూడు (సమతులాహారము, స్వచ్చమైన తాగు నీరు),
గూడు, గుడ్డ, ప్ర్రాథమిక విద్య, వైద్యము - వీటిని తీర్చటానికి ప్రభుత్వము
శ్రద్ధ తీసుకుంటె ఈ అనవసర మరణాలు చాల తగ్గి పోతాయి.  కాని,
ప్రస్తుతం వున్న నాయకులకు ప్రజలు ఎంత పేదరికములో వుంటు
అజ్ఞానములో అనారోగ్య సమస్యలతో బాధపడితె అంత మంచిదని
భావిస్తున్నారని అనిపిస్తుంది.  ప్రజలు ఆ రకంగా బాధపడుతుంటె
రకరకాల సంక్షేమ పథకాల పేరు చెప్పి ఓట్లు అడుగొచ్చని ఎత్తుగడ.
అసలు రాజకీయనాయకులకు దేశస్థితిని తెలిపె ప్రమాణాల
గురించి ఏమైనా తెలుసా?  ఆరోగ్య శాఖలో పనిచేసిన వాళ్లకు కూడ
ఏమి తెలియదు.  ఒకప్పుడు ఆరోగ్యశాఖలో పనిచే్సిన రేణుక చౌదిరి
"who sleeps with whom I don't bother as
long as they are using condoms" అని అన్నది.
తెలంగాణాలో యువత తెలంగాణా రాదేమో, బతుకు ఏమౌతుందో అని
నిరాశ నిస్ప్ర్రుహలకు లోనై ఆత్మహత్యలు చేసుకుంటె, వారు రోగాలు వచ్చి
చచ్చారని, అదీ పోలియొ, టిబి, కాన్సరు వచ్చి చనిపోయారని అన్నది.
ఓక దేశ ఆరోగ్య ప్రమాణాలు ఆ దేశ ఉన్నతిని తెలయజెస్తాయి.  ప్రపంచ
పటమునుండి పోలియొను తుడిచివేయడానికి WHO ప్రయత్నాలు
చేస్తుంది.  దాదాపు 18 సం. నుండి మన దేశములో pulse polio
కార్యక్రమము జరుగుతుంది.  ఎక్కడో  ఒకటి, రెండు కేసులు
తప్ప, మన దేశములో పోలియొ రెండేళ్ళుగ రిపొర్ట్  కాలేదు.  టిబితో
చనిపోవడం కూడ దేశ ప్రజలకు ఆరోగ్యము పట్ల వున్న అవగాహన,
ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ స్థాయిని తెలియజేస్తుంది.  అధికారములో
వుంటు, నోటికి ఏది వస్తె అది మాట్లాడటము మన రాజకీయనాయకులకే
చెల్లుతుంది.

మన రాజకీయనాయకులకు ప్రజలు మనుషుల్ల్లా కనబడరా, లేక వాళ్ళలో
మానవత్వము వుండదా?  ఓట్లకు వచ్చినప్పుడు వరసలు కల్పి, ‘అన్న’,
‘తమ్మి’, ‘అక్క’, ‘చేల్లే’, అంటు ముచ్చట పెడుతారు.  గెల్చినంక అంగ
బలము, అర్థబలము ఎక్కువై వాళ్ల రూట్స్ ఏమాత్రము గుర్తుండట్లేదు. 
"పోలాలు ఎండి పోతున్నాయి, నీళ్ళు ఇవ్వండి", అని అడిగితె,
"నీళ్ళు లేవు. మరి ‘ఉ*’ పోయమంటావా?", అన్న రాజకీయనాయకుడు,
"నీళ్లు లేకపోతె ‘అదె’ తాగుతాడా", అని ప్రజలు అడిగితె ఎట్లావుంటుంది?
చలాకి రాజకీయనాయకులు ప్రజలు పోరాటం చేసె సమస్యలను హైజాక్
చేసి రాజకీయంగా స్థిరపడుతారు.  చేవ వున్న వాళ్ళు పార్టి కూడ పెట్టి
ప్రభుత్వాన్ని శాసించె స్థాయికి ఎదుగుతారు.  ఇక అప్పుడు మొదలౌ
తుంది అసలు కథ.  సమస్య ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడ’న్నట్టు
వుంటుంది.  రాజకీయపార్టి, దాని నాయకుడు నయా రాజకీయ వంశాన్ని
నిలబెట్టుకుంటు, నోట్లు, వోట్లు, సీట్లుగా చక్రం తిప్పుతుంటారు.
తెలంగాణ ప్రజల్లొ వున్న ప్రత్యేక రాష్ట్ర  ఆకాంక్షను గుర్తించిన KCR
TRS పార్టి స్థాపించారు.  అది తెలంగాణ పార్టిగా ప్రజలు డిసైడ్ అయ్యారు
కూడ.  అందుకని చాలా సార్లు ఇష్టం లేని వాళ్ళను నిలబెట్టినా ఎన్నికల్లో
గెలిపించారు.  ప్రస్తుతము ఆ పరిస్థితి వుందనిపించదు.  అందుకు మొన్న
జరిగిన MLC ఎలక్షన్లె సాక్ష్యం. కేవలము డబ్బు వున్నవాళ్లని ఎన్నికల్లో
నిలబెడితె గెలిచె పరిస్థితి వుండదు.  తెలంగాణ సాధన పట్ల నిజాయితి
వున్నవాళ్ళైతె డబ్బు తక్కువున్న గెలవచ్చు.
 
మన దెశములో దాదాపు అన్ని రాష్ష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు వున్నాయి. 
వాటి వాటి అవసరాన్నిబట్టి కేంద్రంలో అధికారంలో వున్న జాతీయ పార్టికి
మద్దతు ఇస్తాయి.  తెలంగాణ ఏర్పడ్డాక (ఆశ!), TRS రాష్ట్రపార్టీగా
వుండి, రాష్టా నిర్మాణానికి పాటుపడొచ్చు కద.  Congress
పార్టీని తిడుతు మళ్ళీ అందులో విలీనం చేయడం ఎందుకు.  ఒక సమస్యను
ఏండ్లకొద్ది సాగతీసి, ప్రజల జీవితలతో ఆటలాడుకుంటు, వారు చస్తున్నా మళ్ళి
మళ్ళీ ఆశపెడుతు ఓట్ల ఆటలో ప్రజలను మోసగించటములో రాజకీయ
పార్టీలన్ని సిద్ధహస్తులు. 

ప్రతి ఒక్కరు వ్యక్తిగాకాక వ్యవస్థలో తాను ఒక భాగమని, వ్యవస్థ ఉన్నతే
వ్యక్తి సమగ్ర ఉన్నతని తెలుసుకొని, వ్యవస్థ ఉన్నతికై పాటుపడితే మన
దేశం అత్యున్నత దేశంగా ప్రపంచ పటములో నిలువదా?