Saturday, April 20, 2013

TRS Akarsha

ఆకర్షా - ప్రజా వికర్ష

KCRకు operation 'ఆకర్ష’ అంత అవసరముందా? 
అంటె ఆయనకు తెలంగాణ వాదంపై నమ్మకం పోయిందా?
తెలంగాణ ప్రజలెప్పుడు తెలంగాణ వాదాన్ని గెలిపిస్తునే వున్నరు.
నాలుగు దశాబ్దాల క్రితము గెలిపించారు.  ఇప్పుడు కూడ బోలెడంత
మెజార్టితో మెచ్చిన నాయకులను, తక్కువ మెజార్టితో నచ్చని
వాళ్ళని కూడా గెలిపిస్తున్నరు.  ఎలాగు గెలిపిస్తున్నారు కదా అని
ప్రజ వ్యతిరేకులను నిలిపిస్తె ఓడించక తప్పట్లేదు.  తెలంగాణ నాయకులు
డబ్బుకు అమ్ముడుపోతారేమో కాని, ప్రజలు మాత్రము కాదు.  ఈ
విషయాన్ని TRS/KCR గుర్తుంచుకోవాలి. 
తెలంగాణ కాంగ్రెస్ నాయకులు రాజినామాలు చేస్తె, తెలంగాణ ఎప్పుడో
వచ్చేదని అందరికి తెలుసు.  అట్లాంటి తె.కా లు ఎలక్షనుల ముందు,
లేదా ఎలక్షనులు వచ్చాక TRSలో చేరితే వాళ్లను నమ్మేంత దదమ్మ్లలు
తెలంగాణ ప్రజలు కారు.  తెలంగాణ పేరు చెప్పుకొని ఎలక్షనులో గెలిచే
కొసమే కారు ఎక్కితే ప్రజలు ఆ కారు టైర్లు ఊడబీకి మూల పడేయటం
ఖాయం.  తెలంగాణ ఉద్యమము వల్ల ఎంతో మంది నాయకులు సామాన్య
ప్రజల నుండి పుట్టుకొచ్చారు.  ఎంతో మంది JAC నాయకులు, విద్యార్థి
నాయకలు వున్నారు.  వీళ్ళ్లలో కొందరిని, ‘అమరవీరుల’ కుటుంబాల
నుండి ఒకరిద్దరిని నిలబెడితె గెలిచె అవకాశముంటుంది.  అంతే కాక KCR
తాను ఎప్పుడు చెపుతున్నట్టు బడుగు బలహీన వర్గాలకు  అనుకూలమని
ప్రజలు మరింత అతనిని నమ్మి ఆ నాయకత్వానికి లోబడి పనిచేస్తరు. 
గెలుపు గుర్రాల పేరుతో ధనిక, ఉన్నత వర్గాలకు, కేవలం గెల్చె కోసమే
పార్టి మారిన నాయకులకు టికెట్లు ఇస్తె, కారు షెడ్డుకు తరలించబడితె
ఆశ్చర్య పడక్కర్లెదు.  అది తెలంగాణ వాదము ఓడిపోవటము కాదు. 
అది తెలంగాణ ప్రజల చైతన్యము.  అవకాశ వాద రాజకీయనాయకులకు
బుద్ధి చెప్పటమే.
    ఇలాంటి పరిస్థితిలో తెలంగాణ కోసం పనిచేసె తెలంగాణ ఫ్రంట్ నుండి
కొంత మంది నిలబడితె గెలెచె అవకాశము తప్పకుండ వుంటుంది.  ఈ
దిశలో తెలంగాణ ఫ్రంట్ ఆలోచిస్తుందనే అనుకుంటాను.
తెలంగాణ సమస్య కేవలము ఓట్లు, సీట్ల వ్యవహారంగా కాక, పరిష్కారము దిశగా
రాజకీయ పార్టీలు ఎప్పుడు చిత్తశుద్దితో పనిచేస్తారో కదా!
 

No comments:

Post a Comment