దొరికితే దొంగ
దొరికితే దొంగ, లేకపోతె అంతా దొరలే అని అందరికి తెలిసిన సామెత. నేను చదువుకునే రోజుల్లో ఓ స్నేహితురాలు నాకు ఓ ఘటన గురించి చెప్పింది. ఇది రాస్తుంటే అనాలోచితంగానే గుర్తుకు వచ్చింది.
ఒకసారి ఓ ఐదారుగురు స్నేహితులు కలిసి రైలు ప్రయాణము చేసి స్టేషన్లో దిగనరు. అవతలకు పోయే గేటు దగ్గర టికెటు కలెక్టరుకు టికెటు ఇచ్చి బైటకు పొవాలె . స్నేహితులంతా ఒకరివెనుక ఒకరు బైటకు వెళ్తూ టికెట్ కలెక్టరు టికెట్టు అడిగితె మోచేయి మడిచి బొటన వేలితో వేనుకోడిని చూపించుకుంట బైటకు వచ్చారు. ఆఖరున వున్నవాడు కాస్త మా స్నేహితురాలి తింగరి చుట్టం. తన వాళ్ళంతా ముందుకెళ్లిన పధ్ధతి చూసిండు. తన వెనుక ఎవరు లేరు. వెనక్కు చూసి తటపటాయిస్తుంటే అనుమానమొచ్చిన టికెట్టు కలెక్టరు వాడిని పట్టుకో బోయినడంట. అలర్ట్ అయిన మన వాడు 'ముందు వాళ్ళందరిని వదిలేసినరు, నన్ను కూడ వదిలేయండి, ప్లీజ్', అంటు పరగందుకోబోయిండట. కాని అదృష్టం అడ్డం తిరిగింది. టికెట్ కలెక్టర్కు దొరికి పోయిండు. తర్వాత law had taken its own course.
అసలు నేను తెలుగు రాష్ట్రాలో జరుగుతున్నా ఘటనల గురించి రాద్దామనుకున్న. నిజంగ జరిగిన ఈ ఘటన గురించి రాసినంక ప్రస్తుతము ఇంక ఏమి రాయాల్సిన అవసరము లేదనిపిస్తుంది.
ఒక్కట మాత్రం నమ్మాల్సి వస్తుంది. ఘోర పాపాలకు తగ్గ శిక్ష పడాల్సిన్దె. తెలంగాణలో అంటారు ఎవరినైనా క్షోభ పెడితె వాళ్ళ 'ఉసురు' తగులుతుందని. మామ ఉసురే కాదు పన్నెండు వందల తెలంగాణ పిల్లల ఉసురు తగలక మానదు.
'A person who lives by the sword dies by it.'

No comments:
Post a Comment