మొబైల్ ఫోన్లు వచ్చినంక ఫొటోలు తీసుడు చాల కామన్ అయిపోయింది. ఏ చిన్న సందర్భము వున్నా ఎవరో ఒకరి దగ్గర ఫోన్ వుండటము దానితో ఫోటో తీయటము అనుకోకుండా చాలా సహజంగా, అలవాటుగా జరిగిపోతున్నది. ఎమ్మెమ్మెస్లు, ఆ తరువాత వాట్సాప్లలో అవి ప్రపంచములో ఏదో మూలలో వున్న బంధు మిత్రులతో షేర్ చేసుకోవటము క్షణాల్లో జరిగిపోతుంది.
సెల్ఫిలు వచ్చనంక అయితే కొంతమంది కూచున్నా, పడుకున్నా, నిలబడ్డ, తింటున్నా, కొత్త ప్రదేశాలు చూస్తున్నా, ఏం చేస్తున్నా, చేయకున్న ఫోటోలు తీసుకొని సన్నిహితులకు పంపించుకోవడము, ఫేస్ బుక్ లో పెట్టుకోవడమైతుంది. సందర్భాసందర్భాల గురించి ఆలోచించకుండ శవాల పక్కన, చెరువులు, కొండల పక్కన, అడవి జంతువుల పక్కన, కొన్ని సార్లు ప్రమాదకర పరిస్థితుల్లో వుండి కూడ సోషల్ మిడియాలో ప్రచారము కోసం, అధిక లైకులు షేర్ల కోసం అత్యుత్సాహముతో సెల్ఫీలు తీసుకుంటున్నరు. అనాలోచితంగా ప్రమాదకర పరిస్థితుల్లో సెల్ఫీ తీసుకున్నందువల్ల కొన్నిసార్లు ప్రాణాలు కూడ కోల్పోతున్నరు. ఏ ఏడాది ఇప్పటి వరకు సొరచేపలు - శార్క్ ల వల్ల ఎనిమిది మంది చనిపోతె సెల్ఫీల వల్ల పన్నెండు మంది చనిపోయారని ఓ పత్రికలో వచ్చింది. మరి మన దేశములో ఎంతమంది అలా చనిపోయారో?
ఆ మధ్య ఒకామె ఓ మడుగు పక్కన సెల్ఫీ తీసుకుంటుంటె ఓ మొసలి ఠక్కున వచ్చి ఆమెను నోట కర్చుకొని నీట్లోకి వెళ్లిపోయిన వీడియో వాట్సాప్ లో హల్ చల్ చేసింది. ఇలాంటివి చూసినంకైనా సెల్ఫీ పిచ్చివాళ్ళు కాస్తా జగ్రత్తగా, సమయసందర్భాలేకాక, పరిసరాల గురించి జరుగ గల ప్రమాదాలు గురించి తెల్సికొని, తగు జాగ్రత్తలు తీసుకున్న్ తర్వాతే సెల్ఫీ తీసుకోవడమ్ మంచిది. లేకపొతె అదే అఖరి సెల్ఫీ అయితుందేమో!
రష్యాలో ఈ ఏడు కొన్ని వందలమందు సెల్ఫీల వల్ల గాయపడ్డము, పదుల సంఖ్యలో మరణించటము జరిగింది. ఒక 21 సం. స్త్రీ తుపాకి పట్టుకొని సెల్ఫీ తీసుకుంటుంటె అది కాస్త పేలి చనిపోయింది. మరో ఇద్దరు యువకులు చేతిలో గ్రెనెడ్ పట్టుకొని సెల్ఫీ తీసుకుంటే దానికి సాక్ష్యంగ ఆ సెల్ఫీతో ఫోన్ ఈ లోకంలో వుంది, వాళ్లు మాత్రం పరలోకానికి చేరుకున్నరు. ఇలాంటివన్ని చూసినంక రష్యా ప్రభుత్వము సురక్షిత సెల్ఫి ప్రచారము మొదలు పెట్టింది. అది ఇప్పుడు ప్రపంచమంతా ప్రచారానికి పనికి వస్తుంది.
సెల్ఫీ ప్రియులు తస్మాత్ జాగ్రత్త. ముందువెనకలు చూసుకొని అందమైన సెల్ఫీలు తీసుకుంటు, అందరితో షేర్ చేసుకుంటు ఆనందంగా వుండండి.
సురక్షిత సేల్ఫీ - రష్యా ప్రచారానికి వాడుతున్నది, గూగుల్ ఇమేజస్ నుండి తీసుకున్నది

