Monday, January 18, 2016

Ganapur Temples


గణపురం గుళ్ళు

గణపురం గుళ్ళు, లేదా కోటగుళ్ళ గురించి ఇదివరకు రాసినా మళ్ళి ఒకసారి తెలుగులో రాయలనుకున్న. ఇవి వరంగల్లు జిల్లలో ములుగు మండలం ఘనపుర్లో వున్నవి.  ఈ మధ్య కాలంలోనీ ఇవి బాగా వెలుగులోకి వచ్చనయి, ముఖ్యంగా కాకతీయా ఉత్సవాలపుడు ఇక్కడ కూడ కొన్ని కార్యక్రమాలు జరిగినయి. 
15-16 శతాబ్దంలో అప్పటి తురక రాజు  గణపేశ్వరాలయము, అక్కడి శిల్పసంపదను ధ్వంసము చేసిండు.

కాకతీయులు కళాపోషనకు, వైభవానికి గుర్తుగా వేయి స్తంభాల గుడి, రామప్ప గుడి తో పాటు కోట గుడులు కూడా విలసిల్లుతాయి.  కోటగుడులు - 22 గుడుల సముదాయము ఓ మట్టికోట ఆవరణలో వుంటాయి.  చాలా వరకు శిథిలాలె, మట్టికోట గోడ.

ముఖ్య ఆలయము ఒక్కటే ఓ తీరుగ వున్నది.  దానికి కూడ గర్భ గుడి పైన సరైన కప్పు/గోపురము లేదు.  ఓకే ఒక బక్క పూజారి మాత్రము అక్కడ వున్న లింగ స్వరూప శివునికి దీప ధూప నైవేద్యాలు అర్పిస్తున్నడు. పండగలనాడు, ముఖ్యంగ శివరాత్రి నాడు మాత్రం పూజలు బాగా జరుగుతాయట. 
సామాన్యంగా అన్ని ఆలయాల్లో నాగదేవత విగ్రహాలు చూస్తం. ఇక్కడ ఈ విగ్రహాలకు పూజలు జరుగుతున్నయి.  నూనె దీపంత ఆ డబ్బాలో వుంది.


ప్రభుత్వము ఈ ప్రదేశాన్ని పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయాటానికి నిధులు ఇచ్చినా పనులు నత్త నడకన సాగుతున్నాయనిపిస్తుంది.

 తురక రాజు కింద  షితబ్ ఖాన్ అని పిలవబడిన సీతాపతి రాజు అనే కాకతీయ రాజ్యపాలకుడు శిల్పాలు ధ్వంసం కాకుండ భూమిలో పాతి పెట్టించాడంట  
ఎన్నో శిల్పాలు మట్టిలో కూరుకఫొయి వున్నయి.
తవ్వి తీసిపెట్టిన శిల్పాలు అక్కడక్కడ చూడొచ్చు
 

కొన్ని చిన్న గుడులలో,అక్కడక్కడ సున్నపు సంచులు వున్నయి.

చుట్టు పక్కల నేను వెళ్ళినప్పుడు గడ్డి పిచ్చి మొక్కలు చాల ఏపుగా పెరిగివువున్నయి.

అందమైన చెక్కడాలతో శిథిలమైన స్తంభం

పరిసరాలు మండపాలు అన్ని శుభ్రం చేస్తే, దగ్గరలో వున్నా పర్యాటక శాఖా వారి హోటలు బాగా నడిస్తే, ఈ గుడులు చక్కని దర్శనీయ స్థలము కావటము, పర్యాటకులు ఒక పూట అక్కడ ప్రకృతి అందాలు ఆస్వాదిస్తూ ఆనందంగా  సంతోషంగా గడపవచ్చు


కాలిలో ముళ్ళు తీసుకునే యువతి శిల్పాన్ని కొద్ది తేడాతో రామప్పలో కూడ చూస్తం

కుడ్యలఫై అందంగా చెక్కబడ్డ స్త్రీ, పురుషుల శిల్పాలు  
ఇక్కడ కనిపించే శిల్ప విన్యాసాలు పేరిణి నృత్యాన్ని గుర్తు తెస్తాయి
అందమైన చెక్కడాలతో కుడ్యం
శిథిలమైన అందాలను మరో తురక రాజు నిజాం రాజు కాలంలో పురావస్తు శాఖ వారు ఈ గుడులను వెలుగులోకి తెచ్చారు







No comments:

Post a Comment