Thursday, September 28, 2017

సద్దుల బతుకమ్మ చిత్రాలు


హన్మకొండ పద్మాక్షి గుట్ట వద్ద ఇవాళ జరిగిన బతుకమ్మ పండుగ ఫోటోలు

బతుకమ్మతో వస్తున్నా తల్లి కూతుళ్లు 
బతుకమ్మతో వస్తున్నా స్త్రీలు    

 దేవితో అలంకరించిన బతుకమ్మ 
దేవితో మరో బతుకమ్మ 

జై తెలంగాణ 

సంప్రదాయబద్ధంగా నెత్తి మీద బతుకమ్మను మోస్తున్న యువతీ 

రక్షణకు పోలీసు జాగిలం, పనిలేక నిద్రిస్తుంది 



పురుషులను లోనికి రానివ్వనందున బైట కూర్చొని పిల్లలను చూసుకుంటున్న
తండ్రి  

ముద్దుగుమ్మలు ముచ్చటైన బతుకమ్మలు 

Friday, July 14, 2017

పుట్టుక




పిల్లలు కొన్నిసార్లు వాళ్ళకు కష్టాలు వచ్చినప్పుడు, తల్లిదండ్రులు వాళ్లు అనుకున్నవి ఇవ్వనప్పుడు, తల్లిదండ్రులు వాళ్ళని ఎందుకన్నారని మనసులో అనుకోవచ్చు, గడుసు పిల్లలైతె డైరెక్టుగా తల్లిదండ్రులనే అడుగొచ్చు.  ఒక దంపతులు పిల్లలు కావలనుకుంటరు, ఎలాంటి సంతానం కావాలో, వారి గుణగణాలు ఎలా వుండాలో కూడ కోరుకుంటరు.  పిల్లలు పుడితె వారు కోరుకున్న గుణాలు వుండొచ్చు, లేక పోవచ్చు.  మరీ చెడ్డవారైతె, కొరకరాని కొయ్యలైతె ‘కడుపున చెడబుట్టా’రని తిట్టొచ్చు, ’పుట్టకపోయినా బాగుండే’దని బాధపడొచ్చు, ’అసలు నువ్వు నా కడుపునే ఎందుకు పుట్టా’వని పిల్లలను ఏ తల్లిదండ్రులు అడగరనుకుంటా.  పిల్లలు మాత్రం ’నన్ను ఎందుకు కన్నావని’ తల్లిదండ్రులను నిలదీసినంత పని చేయొచ్చు.
నాకైతె అన్పిస్తుంది.  తల్లిదండ్రులు పిల్లలను ఎంచుకోరు.  పిల్లలె తల్లిదండ్రులను ఎంచుకుంటరు.  పురాణాల్లో మనం చదువుతం, భగవంతుడు తను జన్మించాలనుకున్నప్పుడు తల్లిదండ్రులను ఎంచుకుంటాడు.  ఒక జీవి జన్మించాలనుకుంటే ఒక అత్మ ఉండాలి.  ఆత్మకు తనకు కావల్సిన జీవితాన్ని, దానిని ఇవ్వగల తల్లిదండ్రులను ఎంచుకునే జ్ఞానం వుంటుందనే నేను భావిస్తున్నాను. దంపతులు సంతానం కావలని కోరుకుంటరు.  పిల్లలే తల్లిదండ్రులను, లేదా తల్లిని ఎంచుకుంటరు.  గిఫ్ట్ పాక్ లో ఏముందో విప్పి చూస్తె కాని తెల్వదు.

వికసించిన పుష్పము పరిమళిస్తుంది.  దానిపై వాలె భ్రమరాన్ని ఎంచుకోగలదా?  వాలిన భ్రమరాన్ని తుష్టి చేసి సృష్టి కార్యక్రమాన్ని సాగిస్తు ప్రకృతిలో వడలి పోతుంది పుష్పం.






ఎందుకు పుట్టించావని 
అడగకు
ఎందుకు జన్మెత్తావొ
తెల్సుకో
నిన్నె, నిన్నె కావలని
కోరుకోలేదు
మరి నన్నె తల్లిగా/తండ్రిగా 
ఎందుకెంచుకున్నావొ
నీకే తెలియాలి.

అజ్ఞానంలో వుండి 
వచ్చావో
ఆనందంలో ఎంచుకొనే
వచ్చావో
జీవ రహస్యం
ప్రకృతికే తెల్వాలి







జీవి నీది, జీవితం నీది
జీవనమెలాగో
శోధించు గమ్యం
సాగించు పయనం

కాలి బాటలే కాదు
రహదారులున్నయ్
అడవిలో మల్లెలున్నయ్
ముళ్ళూ వున్నయ్
లోయలో సెలయేళ్ళున్నయ్
కొండ గుహల్లొ 
కోటి రహస్యాలున్నయ్
నీ దారినెంచుకో
రారాజు వలె సాగిపోతవో
గాయలతో ఆగిపోతవో
పరిమళాలాస్వాదిస్తు 
కాంతి పుంజమై
విశ్వాన్నె చుట్టెస్తవో
ఇసుక రేణువై 
సముద్ర గర్భంలో
ఒదిగి పోతవో

జీవి నీది, జీవితం నీది
జీవనమెలాగో 
ఎంచుకునే భారమూ నీదే.




Tuesday, June 13, 2017

భగవద్గీత బతుకు బాట


ఐదారేళ్ళ క్రితమే నా కనిపించింది, భగవద్గీత ఇంట్లో ప్రశాంతంగ వినే రోజులు లేవని.  నాకు బాగ తెలిసిన ఒకావిడ అంది, "ఈ మధ్య నాకు భగవద్గీత వినబడితె భయం వేస్తుంది".
"ఎందుకలా" అనబోయిన.  కాని వెంటనే గుర్తోచింది. నాకు కూడ దూరం నుండి ఎప్పుడైన ఘంటసాల గొంతు ’అర్జునా అత్మ ఎండకు ఎండదు, వానకు తడవదు’ అని వినిపించినప్పుడు, దగ్గరలో ఎవరో చనిపోయారనో, లేదా టెంపోలోనో, మరేదో వాహనంలో శవయాత్ర సాగుతుందని.

"అట్లా అలోచించకండి. భవద్గీత అసలు ప్రతిరోజు చదవల్సినది.  కొంతమంది ఇంట్లో ఎవరో చనిపోయినప్పుడో, లేదా శవయత్ర అప్పుడు పట్టి మనలాంటి వాళ్ళను పరేశాన్ చేస్తున్నరు.  పట్టిచ్చుకోవద్దు" అని ఏదో మాట్లాడి పంపించాను.

నాకు చదావలనిపించినప్పుడు భగవద్గీత చదువుతాను.  కాని నా దగ్గర వున్న భక్తిగీతాలలో ఘంటసాల భగవద్గిత పెట్టాలంటె మాత్రం భయం.  పక్కవాళ్ళు ఇంట్లో ఎవరైనా చనిపోయరనుకుంటరేమో అని.
 ఓసారి మా వారితో అన్నాను, "భగవద్గీత అంత చక్కటి ఆధ్యాత్మిక గ్రంధాన్ని చనిపోయినప్పుడు మాత్రం వినిపించి అది ఎవరు చదవకుండా, వినకుండా చేస్తున్నరు. చనిపోయిన ఇంట్లో, శవయాత్ర అప్పుడు అది పెట్టకుండ నియంత్రిస్తె  మంచిది.  స్కూళ్ళల్లో కూడ భగవద్గీత చదివించాలి.  అది మనిషి ఎలా బతకాలో నేర్పిస్తుంది.  భగవద్గీతలో వున్న జ్ఞానం చిన్నప్పుడె కొంతైనా నేర్పిస్తె మనుషులు కాస్తైన నీతి నియమాలు పాటిస్తరేమో!"

"చిన్న జీయరస్వామి వారికి నీ అభిప్రాయం చెప్తు ఓ ఉత్తరం రాయి", అన్నారు మా వారు.
"నేనెంటి, జీయరస్వామి వారికి ఉత్తరం రాయటమేంటి? అంత గొప్ప మనిషికి ఈ విషయం ఇంత వరకు తెల్యదా? నా ఉత్తరం ఏ చెత్త బుట్టలో పడుతుందో లే" అని అనుకున్న.

 ఒకటి రెండుసార్లు నిజంగానే ఉత్తరం రాయలనిపించినా రాయలేదు.  ఎప్పుడో ఒకసారి ఈ విషయం గురించి బ్లాగ్ రాద్దామని అనుకున్నా.  ఇప్పటికి కుదిరింది.  నాలాగే అలోచిస్తున్న వాళ్ళున్నారని నాకు తెలిసింది. నిన్నె ఓ వాట్సాప్ పోస్ట్ చూసాను.  భగవద్గీతను శవయాత్ర అప్పుడు పెట్టడము మానాలని.

మతాచార్యులు ఈ విషయం గురించి కాస్తా అలోచించాలి.  ముందుగా గుళ్ళలో  ప్రతిరోజు ఏదో ఒక సమయంలో భగద్గీతలో కొన్నిశ్లోకాలు చదివి దాని తాత్పర్యము చెప్పేటట్టు చూస్తె, పండగలప్పుడు కూడా ఆ సందర్భానికి తగ్గ శ్లోకాలు, వాటి తాత్పర్యాలు చెపుతుంటె ప్రజలు కూడ ప్రతిరోజు కాకపోయిన అప్పుడప్పుడు భగవద్గీత వినడము, చదవడము చేస్తరు.  భగవద్గీత సారాన్ని కాస్తైనా వంటపట్టించుకుంటరు.

మనిషి దుఖఃము నుండి కోలుకోవడానికే కాదు, కష్టాలను అధిగమించడానికి, అన్ని సందర్భాలలో సమన్వయంతో మెలగడానికి, ప్రకృతి చైతన్యంలో భాగమై సకల జీవులతో సామరస్యంగా జీవించటానికి భగవద్గీత దిశానిర్దేశము చేస్తుంది

Image Source: Google images of Krishna-Arjuna

Friday, April 7, 2017

వోటర్

వోట్లేసెనాడు
వోటర్ దేవుడు
గెలిచినంక
ఎవడాడు?

Thursday, April 6, 2017

న్యాయం గెలిచింది?!


హత్యాచారం జరిగింది
పేర్లెన్నో బైటకొచ్చినయ్
పెద్దోళ్ళవి కూడ

పేదోన్నిపట్టుకొని
పడేశారు జైళ్ళొ
తేల్చారు ఎనిమిదేళ్లకు 
నిర్దోషని

చేయని నేరానికి
శిక్ష అనుభవించినా
న్యాయం గెలిచింది!?
అసలు హంతకుడిని
అందకుండా తప్పించింది!

న్యాయం గుడ్డిదైతె
చట్టం ఎడ్డిదైందా? 

Friday, February 24, 2017

శివోహం


శివం, శివం, శివోహం 
నోహం, శివోహం, శివోహాం
సుందరం, సుందరం
సత్యం, శివం, శివోహం
సుందరం శివం సత్యం
సత్యం, శివం, శివోహం
నోహం, శివం, శివోహం
శివం, శివం, శివోహం