Wednesday, January 30, 2013

Telangaana x Congress

కలిపె, కాల్చె, కాష్టం చేసె

KCR అప్పుడప్పుడు అంటుంటారు, "తెలంగాణ గురించి రాయాలంటె రామాయణమంత
చెప్పుకుంటె భారతమంత", అని.  భారతాన్ని మూడు ముక్కల్లొ ఎట్ల చెప్పాలొ తెలియదు.
కాని రామాయణాన్ని మూడు ముక్కల్లొ చెప్పొచ్చు.  "కట్టె, కొట్టె, తెచ్చె".  అట్లాగె తెలంగాణ
గురించి KCR మూడు ముక్కల్ల్లొ చెప్పాడు.  అతను చాల సరళంగ తెలంగాణ చరిత్ర చెప్పాడు.
హైదరాబాదు (తెలంగాణ) స్టేటను నెహ్రునె కద ఆంధ్ర రాష్ట్ర్రంతొ కలిపాడు.  69 లొ మిలిటిరిని పంపి
తెలంగాణ వాదులను కాల్చింది ఇందిర గాంధి కాదా?  మాట ఇస్తు వెనిక్కి తీసుకుంటు వందలాది
యువకుల ఆత్మాహుతికి కారణం సొనియ గాంధినె కద.  ఇప్పుడు దీన్ని మూడు ముక్కల్లొ
చెప్పాలంటే ‘కలిపె, కాల్చె, (రావణ)కాష్టంచేసె’.
KCR సమరభేరిలో మాట్లాడినప్పుడు ఎంతో సంయమనము పాటించాడని తెలంగాణ వారి భావం, బాధ.
నమ్మించి మోసం చేసిన కాంగ్రెసును, తె.కాలను తిట్టిన తిట్టు తిట్టకుండ తిట్టాలని అందరు ఆశించారు.  కాని
KCR వాస్తవలు తప్ప ఏమి మాట్లాడలేదు.  కాపల కుక్క వెనుక వున్న గొర్రెల మాదిరిగ తెకాలు CM
వెనుక సి.శ. లేకుండ కూర్చొవటం చూస్తె "*" అని ఉ*** ఆ ఉ*ను అపవిత్రం చేయటం అనిపిస్తుంది.
తెకాలకు ఒట్లకు వచ్చిన్నాడు అధిష్టానమ్ ఎవరొ తెలుస్తుంది. 
 

Tuesday, January 29, 2013

A P Conmen

జోహారు

‘ఛీ’ అన్నా చిరునవ్వు నవ్వుతరు
‘థూ’ అన్నా తుడుచుకొని పోతరు
కుక్కలకు మించిన విశ్వాసం
తెకాల సొంతం.
 *******
జోహారు, జోహారు
కోకాలకు జోహారు
ఒడ్డున యిసుకను పిండి
నూనెను చూపగలరు
సైనైడుతో స్వర్గసుఖాలని
ముదిమితో మింగించగలరు
నీలి రంగు నక్కైన
మీ దగ్గర శిక్షణ పొందక తప్పదు.
    **********
తెకా = తెలంగాణ కాంగ్రెస్ నాయకులు
కోకా = కోస్తా కాంగ్రెస్ నాయకులు

Sunday, January 27, 2013

T-language

భాషా - యాస
అప్పుడెప్పుడో, చాలా రోజుల కింద, ఓ సందర్భంలో KCR అన్నారు, ఎవరినో ‘బజారుకీడుస్తామని’.
దాన్ని literalగ తీసుకుని చాలానె గొడవ జరిగింది.  తెలంగాణలో ఏదైన సమస్య వచ్చినప్పుడు
అవతలి వ్యక్తి అన్యాయం చేస్తున్నా, సమస్య నానుస్తు సతాయిస్తున్నా, కొపముతో ఆ వ్యక్తిని బజారుకీడుస్తామని
అంటరు.  పరువు మర్యాదలున్నొడు అట్లన్న వాడు దారిలొకి వస్తాడని.
 ఇది ఆంధ్రోళ్ళకు అప్పుడు అర్థం కాకపోతే ఇప్పుడు అర్థం కావాలె.  ఇప్పుడు తెలంగాణ ఛానెలులో మాటి మాటికి సోనియ గాంధి మాటలు,
"హమె తెలంగాణ స్టేట్ కే కొయి అపత్తి నహ్ఁ హై", వస్తున్నాయి.  ఇది ఈ ఛానెల్లొ తెలంగాణ వచ్చెవరుకు
ప్రసారమౌతుంది.  సోనియ గాంధి ఈ మాటలు, దానికి ఉండవల్లి తెలుగు అనువాదం తెలంగాణ అంతటే కాదు
దేశమంత, ప్రపంచం అంత కూడ ప్రతిధ్వనిస్తుంది.

Saturday, January 26, 2013

Decision

నిర్ణయం 

తె.కా. :
 తెలంగాణ కొసం ఎంతటి త్యాగానికైనా సిద్ధం.
 ప్ర :
 JACతో కలసి ఉద్యమాలు చెస్తరా సార్?
తె.కా:
 JAC స్థాపించింది మేమె కద. 
ప్ర :
కల్సి ఉద్యమాలు పోరాటాలు చేయ్యాలె సార్.
తె.కా:
 తెలంగాణ కోసం పోరాటంలో మేమెప్పుడు
ముందె వున్నాం.
ప్ర :
 వచ్చిన తెలంగాణను ఆంధ్రోళ్ళు రాజినామాల డ్రామాలడి
 రాకుండ చేశిండ్రు కద. 
తె.కా:
 మేము అధిష్టానాన్ని ఒప్పించి తెలంగాణ తెస్తాం.
ప్ర :
 రాజినామాలు చేయుండ్రి సార్,  తెలంగాణ తెండి.
  మిమ్మల్ని మేము గెలిపిస్తం.
తె.కా :
  పార్టిలో వుండి కొట్లాడుతం.
ఇక్కడ, అక్కడ మేమె. 
ఇచ్చెది, తెచ్చెది మేమె.
ప్ర :
 అరె, మళ్ళి ప్రభుత్వాన్ని పడగొడతమని
 తెలంగాణ పై వచ్చె నిర్ణయాన్ని అపిండ్రు
 అరాజకీయ నాయకుళ్లు.
.తె.కా.: 
మావి బ్లాక్ మెయిల్ రాజకీయాలు కాదు.
 ప్రభుత్వాన్ని కాపాడుకుంటం.
 వత్తిడి తెస్తం.  ఆధిష్టానాన్ని ఒప్పిస్తం.
ప్ర. :
 ఏండ్ల బట్టి గోస.  పిల్లలు సావబట్టిరి.
 ఆళ్ళు అబధ్ధాలతోటి, డబ్బు సంచులతోటి,
 రాజినామాల డ్రామాలతోటి,
ప్రభుత్వాన్ని పడగొడతం అని
బెదిరింపులతోటి తెలంగాణాను అడ్డుకొవట్టిరి.
      కే సి అర్., పిల్లలు పట్టుకొచ్చింది
 ఎనుకకు పోయినా మీరు పదవులు పట్టుకొనె వుంటిరి.
తె. కా:
 మేము పార్టిలో వుండి ఎంతో పోరాటం చేస్తున్నం. 
ఎన్నో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నం. అన్ని పైకి చెప్పలేం.
ప్ర:
 (లోలొన).  ప్రజలు ఇంత అవస్థ పడుతున్నా,
 అవమానింప బడుతున్న మీకు పదువులు, పార్టినె కావాలె.
మీరు ఉద్యమంలోకి రారు.
 రాజినామాలు చేతకావు. లాబియింగు చేయలేరు.               
 దద్దమ్మలు.  ఇక మీ రాజకీయ జీవితాన్ని,
 మీ పార్టి భవిష్యత్తును మేము భూస్ఠాపితం చేస్తాం.

Friday, January 25, 2013

Azaadi

ఆజాది

ఉలుకు పలుకు లేని బొమ్మ
రాజ్యమేలుతుందమ్మ
ప్రజలు చనిపోతున్నా
పవరు మాత్రం పోవద్దమ్మ.
   **************
వ్యతిరేకం కాదంటే
అనుకూలం కూడ కాదులే
సమైక్యం అంటే
మాది మాదే, మీది మాదేనులె.
   *************
రేపన్నా, నెలన్న
రోజులెన్నని కాదులె
ఆ‘జాదు’ మాటలకు
అర్థాలే వేరులె.
     ************
తెలిసి తెలియక, ప్రయోగాత్మకంగ,
కుంతి కని పడెసింది కర్ణుడిని
కురుక్షెత్రంలో పాండవులను చంపొద్దొని కోరింది
పాండవులకు మాత్రం ఆన్న సంగతే చెప్పదు
కన్నతల్లి ప్రేమలో స్వర్థ మెంతో
రాజకీయాల్లొ స్వర్థమంతె.
     *************
కొడుక్కు కష్టాలొస్తాయన్న
      ఆలోచనకే కన్నీళ్ళు వస్తె
ఉద్యమ జ్వాలల్లో కొడుకులను పొగొట్టుకున్న
           తల్లుల వేదన కాస్తైన అర్థం అయ్యెనా?
ఆ గోస
 మీకు శాపమై తగలకుండునా?

Friday, January 11, 2013

Bharath - India

భారతములో  
 
"రేపులు ఇండియాలో జరుగుతై.  భారత్ లో జరగవు".
భారతం భరత భూమిలో జరిగినది కద.  ఐదుగురు భర్తలున్నా నిండు సభలో వివస్త్రను చేస్తుంటే, ఓక్క మొగడుగాని, మగవాడుగాని అడ్డు కున్నాడా?
 
"భార్య ఇంట్లో వుండాలి.  భర్త భార్య అవసరాలన్ని తీర్చాలి".
బాకి చెల్లింపుగ భార్యని అంగట్లొ అమ్మిందెక్కడో?
అహల్య పై ఇంద్రుడు అఘాయిత్యం యెక్కడ జరిగింది?
 
"అర్థరాత్రి ఆడది నిర్భయంగా తిరుగగలిగిన నాడే నిజమైన స్వతంత్రం వచ్చినట్టు."
"అర్థ రాత్రి స్వతంత్రం వచ్చిందని అర్థరాత్రి బైట తిరుగుతామా."
ఇంతకు మనకు స్వతంత్రం వచ్చినట్టా, రానట్టా?
 
"ఆమె ఆ రాత్రి బైటకు వెళ్ళకుంటె అలా రేపు జరిగేది కాదు". 
ఆమె ఈ దేశములో పుట్టకున్నా అలా జరిగేది కాదు.
 
రేపిస్టులను ‘అన్నా’ అని పిల్చి, కాళ్ళ మీద పడి బతిమాలుకుంటే బాగుండేది.
పశువులకు వావి వరసలుంటాయా?
 
రాలీలొ పాల్గొనెది "పేంటెడ్ అండ్ డెంటెడ్ వుమెన్" .
అన్ని వయస్సుల వారు, అన్నివర్గాల వారు ఉద్యమంలొ పాల్గొంటే తప్పేంటి?
 
"పాశ్చాత్య సంస్కృతి, వస్త్రధారణే రేపులకు కారణము".
అక్కడ బికినిలు వేసుకొని బీచ్ లలొ పడుకున్నా రేపులు జరగవు కదా.
 
ప్రతి ఒక్కరు ఆడపిల్ల ఎలా వుండలో చెపుతున్నారు కాని, మగపిల్లలు ఎలా ప్రవర్తించాలొ మాత్రం చెప్పట్లేదు.
ఆడవాళ్ళు ఎలా వున్న మగవాడికి వాడికి హద్దులు తెలిస్తే, మనిషిగా ప్రవర్తిస్తే రేపులు ఎందుకు జరుగుతాయి?

 
 
 
 

Saturday, January 5, 2013

Live - Let Live

 బతుకు బతుకనివ్వు

 మన సమాజం ఎటు వెళుతుందో అర్థం కావట్లేదు.  నాగరికులమని, ఆధ్యాత్మికతకు పుట్టినిల్లని గొప్పగా చెప్పుకుంటాము.  ఆచరణలోకి వస్తే మనుషుల ప్రవర్తన మృగాల కంటే హీనంగా వుంటుంది.  వాటితో పోల్చటము  ఆ జంతువులను అవమానించటమే.  క్రూర జంతువులైన ఆకలేసినప్పుడే వేటాడి తింటాయి.  తర్వాత ప్రశాంతంగా ప్రకృతిని ఆస్వాదిస్తాయి .   జంటను కోరుకుంటే దానిని రకరకాలుగా ఆకర్షించి, గూడు ఏర్పాటు చేసుకొన్నాకే కలసి పిల్లలను కంటాయి.  ఆ పిల్లలు పెద్దై స్వయం పోషక శక్తి వచ్చే వరకు పోషించి, రక్షిస్తాయి.  జంతువులాగా వాటికి అంతే తెలుసు. 
  జీవాజతులన్నిటిలో మానవుడే ఘనుడు.  తెలివితేటలే కాదు,విజ్ఞయత, విచక్షణ మానవజాతి సొంతము.  ప్రకృతి వనరులు ఉపయోగించుకోవటము, ప్రకృతి రహస్యాలుచేధించటం, దానిని తన సౌఖ్యానికి వినియోగించుకోవటం మానవులకే సాధ్యం.  స్త్రీ పురుషులు ఇద్దరు వుంటనే మానవ మనుగడ. జాతి మనుగడ సాగింపులో, కొన్ని ప్రత్యేక పరిస్థితులలో స్త్రీకి కావలసిన సంరక్షణ సాకుగా పురుషుడు ఆమెను నియంత్రిస్తున్నాడు.  ఆమెను ఒక పిల్లలు కనే యంత్రంగా, తనకు సేవలు చేయాల్సిన దాసిగా, చివరకు లైంగిక సుఖాన్ని ఇవ్వాల్సిన సజీవ మాంసము ముద్దగా చూస్తున్నాడు.  స్త్రీ తన తోటి మానవి అని తనలానే తెలివితేటలు విజ్ఞయత, విచక్షణ వున్న వ్యక్తి అని మర్చిరకరకాల ఆంక్షలు విధించి ఆమెను నాలుగు గోడల మధ్య బందీని చేసాడు.  ఎల్లప్పుడూ పురుషుని ఆధీనములో వుండాలని నియమలెన్నో చేసాడు. నాగరికత అభివృద్ధి చెందిన కొద్ది సమాజములో మార్పులు, స్త్రీల స్థితిలో మార్పులు మొదలయ్యాయి.  వీటికి విజ్ఞయత, నైతికత, మానవత్వం వున్నా పురుషులు ముందు నిలిచారు.
  వ్యవసాయ,పారిశ్రామిక విప్లవము, ప్రపంచ యుద్ధాల నేపధ్యములో సమాజము సక్రమంగా ఉంచడానికి, వ్యక్తిగత -మానవ హక్కులకై స్త్రీల పోరాట ఫలితంగా ప్రపంచములో కొత్త చట్టాలు, నియమాలు వచ్చాయి.  కాని ఈ చట్టాలన్నీ  పురుషులచేతనే చేయబడుతున్నాయి.  మన చట్ట సభల్లో ఎంతమంది స్త్రీలు వున్నారు?  అలాగే చట్టాలు చేసే ఎన్ని కమిటీల్లో స్త్రీలు వుంటారు?  ఒకవేళ ఒకరో ఇద్దరో వున్నా వారి మాటలకు ఇచ్చే విలువ ఎంత?  పురుషులు వారి దృష్టితొ  సమస్యను చూసి, విశ్లేషించి పరిష్కారాలు సూచిస్తారు.  స్త్రీలు కూడా అనాది నుండి ఎక్కువగా గృహనికే, నాలుగు గోడల మధ్య జీవించటము వలన వారికి బైటి ప్రపంచము గురించి తెలిసేది చాల తక్కువ.  అది కూడా పురుషుని కన్నులతో చూడటము, అదే అభిప్రాయాన్ని ఏర్పర్చుకోవటము జరుగుతుంది.  ఈ కాలములో కూడా పురుష భావదాస్యము నుండి, పురుషాధిఖ్య భావజాలము నుండి బైట పడినది చాల కొద్ది శాతము స్త్రీలు మాత్రమే. ఈ కొద్ది శాతము స్త్రీలను అణచివేయటము, వారి స్త్రీ హక్కులు, మరియు స్వతంత్ర జీవన  భావవ్యాప్తికి అడ్డుపడటము స్త్రీల ద్వారానే పురుష సమాజం చాల నేర్పుగా చేయగలదు, చేస్తుంది కూడా.
 నాలుగు గోడలు దాటి బైటకు వచ్చిన స్త్రీని మన సమాజము, ముఖ్యంగా పురుషులు చులుకనగా చూస్తున్నారు.  పురుషాధిపత్య శృంకలాలు తెంచుకు బైటకు వచ్చిన స్త్రీని ఒక విప్లవకారినిగా, సమాజ కట్టుబాట్లకు వ్యతిరకిగా ముద్ర వేసి ఆమె బ్రతుకును ఛిద్రము చేస్తారు.  స్త్రీలు రాణులై రాజ్యాలు ఏలిన , రాజకీయాలలో నిలదొక్కుకొని మంత్రులు, ప్రధాన మంత్రులుగా వున్నా,అంతరీక్ష యానాలు చేస్తున్నా, ఆర్థికస్వతంత్రురాలై ఇంటా బైట అన్ని కార్యాలు సమర్థవంతంగా  నిర్వహిస్తున్నా, పురుషులలో, ముఖ్యంగా భారత పురుషులలో స్త్రీల పట్ల సాటి మనిషిగా గౌరవము లేదనే చెప్పాలి.  స్త్రీని తమకు లోబడి వుండి, లైంగిక వాంఛలు తీర్చే సజీవ మాంసము ముద్దగానే చూస్తున్నారు.  స్వతంత్ర భావాలతో వ్యవహరించే స్త్రీని బరితెగించినదిగ, స్త్రీ లక్షణాలు లేనిదిగా, మగరాయుడని పలురకాలుగా నిందించటము, వేధించటం, ఆమె స్థైర్యాన్ని దెబ్బ తీసే విధంగా లైంగికంగా వేటాడి మానసిక హత్య చేస్తున్నారు.  అది తట్టుకొని నిలబడ్డ వారిని శారీరకంగా చిత్రవధ చేసి చంపుతున్నారు.  ఏ శరీరము వారికి లైంగిక ఆనందాన్ని ఇస్తుందో, ఆ శరీరాన్ని జుగుప్సాకరంగా చూడటమే కాదు, పాశవికంగా హింసించి రాక్షసానందాన్ని పొందుతున్నారు.  ఇంతటి నీచ నికృష్ట గుణము విశ్వములో ఏ  జీవజాతిలో వుండదు.
 స్త్రీల పట్ల నేరాలు తగ్గడానికి సత్వర ఖచ్చితమైన కఠిన శిక్షలు కొంత వరకు పనిచేస్తాయి.  కాని సమాజములో, ముఖ్యంగా పురుషుల మానసిక వైఖరిలో మార్పు రావాలి.    అంటే కుటుంబములో -తల్లిదండ్రుల ప్రవర్తనలో మార్పు రావాలి.  పిల్లలకు వ్యక్తుల పట్ల - ఆడైనా మగైనా గౌరవించటము నేర్పాలి.
     ఒక తండ్రి తన పిల్లల తల్లి ఇంటికే  పరిమితమై సేవలందిస్తున్నా,ఆర్థిక స్వావలంబన కలిగి ఇంట బైట వ్యవహారాలు చక్కద్దిద్దుకుంటున్నా ఒకే విధమైన గౌరవము ఇవ్వాలి.  కుటుంబ బాధ్యతల్లో తన వంతు కర్తవ్యాన్ని నెరవేరుస్తున్న ఆమెను అన్నింటిలోను భాగస్వామిని చేయాలి. సంఘము కూడా వారిద్దరిని కుటుంబ పెద్దలు గుర్తించాలి.  ఇంట్లో అందరు అవసరాన్ని బట్టి అన్ని పనులు, ఆడ పని, మగపని అనే విభజన లేకుండా కలసి చేసుకోవాలి.  ఆడపిల్ల అణిగి మణిగి వుండాలని, మగవాడు ఏమి చేసిన చెల్లుతుందనే భావన తుడిచి వేయాలి. ఇంట బైట అందరు అట్లా వ్యవహరిస్తే, స్త్రీలను వ్యక్తిగా గుర్తించటము జరుగుతుంది.  అప్పుడు వారి పట్ల నేరాలు కూడా తగ్గే అవకాశుము వుంటుంది. లైంగిక సుఖము తాత్కాలికమే నని, సహజీవనములో వున్నా మాధుర్యము దానికి మించినదని తెలుసుకోవాలి. సహజీవనానికి కావలసినది ఆత్మీయత, అభిమానము. అవి రెండు వున్నా చోట ప్రేమ వుంటుంది.  అసలైన ప్రేమ వున్నచోట కరుణే గాని క్రౌర్యము వుండదు.
  స్త్రీ పురుషులిద్దరిది మానవ జన్మ అని, ప్రకృతి ప్రసాదించిన శారీరక విభేదాలు అర్థము చేసుకొని, ఒకరు లేక మరొకరి  జీవితమే కాదు, మానవ జాతి మనుగడే సాగదని తెలుసుకొని సామరస్యముగా బ్రతికినప్పుడే మానవ జన్మ సార్థకమౌతుంది.