ఎయిడ్స్
ఎయిడ్స్, ఎయిడ్స్, ఎయిడ్స్
ఎయిడ్స్ అంటె ఏమిటి?
దడ పుట్టించే
ఎయిడ్స్ అంటె ఏమిటి?
AIDS - ఎయిడ్స్ అంటె
Acquired Immuno Deficiency Syndrome
పేరు పెద్దది, అంటుకుందంటె
అవుతుంది బతుకు చిన్నది.
వస్తుంది చిన్న వైరస్ తో
శరీర కణాలతో ఐక్యమై
స్వాహా చేస్తుంది
స్వరక్షణ శక్తిని.
వివాహేతర బంధం
వినాశనాల బంధనం
కనీసం కండోమ్స్ తో
కష్టాన్ని కాస్త తగ్గించుకో.
పదిక్షణాల సౌఖ్యంకోసం
పరులతో సంభోగిస్తె
పదేళ్ళలో పంపుతుంది పరలోకానికి
స్వర్గ సౌఖ్యాలు పొందటానికి.
నూరేళ్ళ జీవతం నిండుగా
గడపాలంటే
నీ సంసారంలోనే సంతృప్తి వుంది
తెలుసుకో
కట్టుకున్న దానితో జీవితం
కమనీయ కలగా చేసికో.
ఎయిడ్స్ వ్యాధి నివారించాలంటే వివాహేతర సంభోగాలకి దూరంగా వుండాలి. జబ్బు సోకితే తగిన చికిత్స శ్రద్ధగా క్రమము తప్పక వాడాలి. గర్భవతి అయితే వెంటనే మందులు వాడితే శిశువుకు రాకుండా ఆపవచ్చు. తప్పనిసరి పరిస్థితిలో రక్తము ఎక్కించుకోవల్సి వస్తే తగిన పరీక్షలు చేసిన తరువాతే రక్తము ఎక్కించుకోవాలి.
No comments:
Post a Comment