సన్నబియ్యం
తెలంగాణ ప్రభుత్వము హాస్టల్లకు సన్న బియ్యం సరఫర చేస్తుంది. సంతోషమే. తెల్లగా మల్లెపువులా అన్నంవుంటె ఎంతైనా తినబుద్ధేస్తుంది. కాని ఈ తెల్లబియ్యం, సన్నబియ్యం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. బియ్యాన్ని అతిగా పాలిష్ చేస్తెనే ఈ తెల్ల బియ్యం, సన్న బియ్యం వస్తవి. బియ్యంలో వుండె ’బి’ విటమిన్, కొంత పిప్పి కూడ పాలిష్ చేయడంతో పూర్తిగ తౌడులో పోతుంది. పాలిష్ చేయని బియ్యముతో వండిన అన్నము నిదానంగా జీర్ణమవుతుంది. అందువల్ల ఆకలి కూడ తొందరగా కాదు. తక్కువ తినడము, త్వరగా ఆకలి కాకపోవడమువల్ల స్థూలకాయము - లావు కావడము తక్కువగా వుంటుంది. మధుమేహ వ్యాధి వున్న వారు గోధుమ లేదా జొన్న రొట్టె, గట్క తినలేకపోతె బ్రౌన్ రైస్ లేదా అన్ పాలిష్డ్ రైస్ తినవచ్చు. లావుతగ్గాలనుకున్నవారు అన్నం మానేసి రొట్టే తినలేకపోతె కనీసం దంపుడు బియ్యం - బ్రౌన్ రైస్ తింటు వ్యాయామము చేస్తె ఒళ్లు తగ్గొచ్చు. తిమ్మిర్లులాంటి అవస్థలు కూడా చాల తగ్గిపోతై.
మల్లెల్లాంటి తెల్లన్నం అతి త్వరగా జీర్ణమౌతుంది, అందుకే మళ్లి తొందరగా ఆకలేస్తుంది. త్వరగా జీర్ణమవడము వల్ల తొందరగా రక్తంలో చక్కెర శాతం ఎక్కువగ పెరిగి, ఆరోగ్యంగా వున్నవాళ్ళలోనైతె అంతె త్వరగ తగ్గుతుంది. హాస్టల్లో పిల్లలకు సామాన్యంగ రెండేసార్లు భోజనం పెడ్తరు. వాళ్లకు తిన్నాక రెండు-మూడు గంటల్లోనె మళ్ళి ఆకలేస్తుంది. తినకపోతె చక్కరొస్తుంది. ఆ పూట కాస్త తక్కువ తినివుంటే కళ్ళు తిరిగి కిందపడటం జరగొచ్చు కూడ. ఆరోగ్యము పై అవగాహన కలిగి అందరు ప్రతి రోజు పాలిష్ లేని బియ్యాన్ని వండుకుంటు, బుద్ధికి ఎప్పుడైనా తెల్లబియ్యాన్ని వండుకుంటె మంచిది.
మన దేశంలో మధుమేహ వ్యాధి (షుగర్) వున్న వారి సంఖ్య రానురాను పెరిగిపోతుంది. గోధుమ లేదా పాలిష్ లేని బియ్యం వాడకము, తప్పనిసరిగ ప్రతి రోజు వ్యాయామము చేయటము అలవాటైతె ఈ వ్యాధి కొంతైనా తగ్గుతుంది.

No comments:
Post a Comment