నిద్ర - ఒక ముఖ్య జీవితావసరము
నిద్ర సుఖమెరగదని అంటరు. నిజమే. ఒళ్ళు, మెదడు అలసిపోయినప్పుడు ఎక్కడబడితె అక్కడ కాళ్ళు చాపుకొనో, ముడుచుకొనో, లేదా నిలబడి కూడ నిద్రపోవచ్చు. ఆహార మైథునాలకంటే మనిషికి నిద్రే చాలా ముఖ్యము. వరసగా వారం రోజులు ఒకింతైనా నిద్రపోని మనిషి చనిపోవచ్చని శాస్త్రజ్ఞుల అభిప్రాయమ్.
నిద్ర మనిషికి ఒక వరం. ఎన్ని కష్టాలు వున్న కాస్త నిద్రపోయి లేస్తే మనిషికి ప్రశాంతత వస్తుంది. నూతనోత్సాహముతో, ఆలోచనతో ముందడుగు వేసె శక్తి వస్తుంది.
ప్రతి మనిషికి రోజుకి 6 - 8 గంటల నిద్ర అవసరము. పసిపిల్లలు పుట్టిన మొదటి వారములో 20 - 22 గంటలు నిద్రపోతారు. చక్కటి నిద్ర వారి ఎదుగుదలకు ఎంతో అవసరం. వయస్సు పెరిగె కొద్ది నిద్ర తగ్గుతుంది. సాధారణంగా 6 - 8 గంటలు నిద్ర సరిపోతుంది. ముసలితనంలో కూడ 6 - 8గంటలు నిద్ర అవసరమే. రాత్రి తొందరగా నిద్ర పోతె తెల్లారి తొందరగా లేస్తరు, ఆలస్యంగా నిద్రపోతె ఆలస్యంగా లేవడము జరుగుతుంది. మనిషి సరిపడె నిద్రపోతె ఏమాత్రం మబ్బులేకుండా హుషారుగా లేస్తరు. సరిపడె నిద్రపోనప్పుడు లేచినా కూడ మబ్బువుంటుంది, మళ్ళి వెంటనే పడుకోవాలనిపిస్తుంది లేద దినమంతా కునికిపాట్లు పడాల్సి వస్తుంది, కుదరకపోతె ఆ రాత్రి తొందరగా పడక ఎక్కాలనిపిస్తుంది. సరిఅయిన నిద్ర లేనప్పుడు పనిలోకూడా ఏకాగ్రత తగ్గుతుంది. విద్యార్థులు పరీక్షలప్పుడు నైట్ ఔట్ చేయటం పేద్ద తప్పు. కావాలంటె ముందురోజు తొందరగా నిద్రపోయి ఉదయం తొందరగా లేవటం మంచిది. నన్నడిగితె రాత్రి 11 నుండి పొద్దుట కనీసము 4 గంటలవరకు నిద్రపోతే మంచిది. పరీక్ష రాసేటప్పుడు తలలో గందరగోళం వుండదు. చదివినవి చక్కగా గుర్తుకు వస్తాయి.
నిద్ర పైకి అచేతనావస్థ అనిపించిన ఆ సమయములో శరీరములో జరిగే వివిధ ప్రక్రియలు, ముఖ్యంగా మెదుడులో జరిగె చర్యలు మనిషి శరీరక మానసిక క్లేషాలు తొలగించి లేదా తగ్గించి మరుసటి రోజును ఉత్సాహంగా నూతనోత్తెజముతో గడపేటట్టు తయారు చేస్తుంది.
నిద్రలేమి అన్నది మానసిక వ్యాధికి తొలి సూచన. ఒక వ్యక్తి ప్రతి రోజు సరిగ నిద్రపోలేక పోవటము, లేదా రెండు మూడు రోజులు అసలే నిద్రపోకుండా వున్నారంటె అప్పుడు తప్పనిసరిగా వైద్యుడిని, అవసరమనుకుంటే మానసిక వైద్యుడిని సంప్రదించాల్సిందే. శారీరక బాధాలు - నొప్పుల వలన నిద్రలేక పోయినా, పైకి ఏ ప్రత్యేక కారణము కనిపించనప్పుడు తప్పనిసరిగా డాక్టరును సంప్రదించాలి.
మొన్నీమధ్య గూగుల్ లో చూసిన -
Good Night, Sleep Tight
Don't let Bugs Bite.
No comments:
Post a Comment