విశ్వనగరానికి ఒక్క అడుగు
స్నేక్ గాంగ్ కేసు రెండేళ్లలో తేలటము దోషులకు శిక్ష పడటము తెలంగాణలో ప్రజలకు పోలీసు, న్యాయ వ్యవస్థ పట్ల కొంత నమ్మకాన్ని పెంచింది. సామాన్యంగా ఈ రొజుల్లో ఎట్లాంటి ఘోరమైన కేసు స్టేషన్లో రిజిస్టర్ అయిన అది తేలే వరకు దశాబ్దాలు పడుతుంది. ప్రజలు, మీడియా వెంట బడ్డ కేసులు మాత్రము రెండు మూడేళ్ళలో తేల్చే ప్రయత్నం జరుగుతుంది. ఈ కేసు విషయంలో పోలిసుల శ్రద్ధ అభినందించాల్సిందే. హైదరాబాదు విశ్వనగరము కావాలంటే అక్కడ ప్రజలకు చక్కటి రక్షణ వుండాలె. వచ్చి వుండె వాళ్ళకైన, పెట్టుబడులు పెట్టే వారికైనా ఈ ప్రదేశము క్షేమకరమనిపించాలె. రక్షణ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ బాగా పని చేయటమే కాదు, చేస్తున్న నిదర్శనము కనబడాలి. ఈ కేసు ఆ నమ్మకాన్ని కలిగించేట్టు వుంది. ఈ విషయములో తెలంగాణ ప్రభుత్వాన్ని,పోలీసులను ఎంతైనా అభినందించాలె.
దోషులకు శిక్ష పడ్డా వారి లైంగిక దాడులు నిరూపణ కాకపోవడము మన వ్యవస్థ దౌర్భాగ్యము. లైంగిక దాడుల్లో ఎప్పుడు సమాజము, వ్యవస్థలన్నీ కూడా స్త్రీనే తప్పు పట్టడము, వాళ్ళు నూటికో వెయ్యికో ఒకరు తప్ప ఎవరు న్యాయపోరాటానికి సిద్ధ పడరు. అంతే కాకుండ పది మంది దోషులను వదిలినా ఒక్క నిర్దోషికి శిక్ష పడొద్దనె మన న్యాయ వ్యవస్థ ఒక్క నిర్దోషి కోసం పదిమంది దోషులను వదిలేస్తే నేరాలు పెరగక ఏమైతయి? తెలివి, ధనము, పలుకుబడి వున్నవాడు నేరము చేస్తె శిక్ష పడె అవకాశము 10% కంటే తక్కువె.
ఏ నేరము జరిగినా పోలీసులు, నిష్పక్షపాతంగా, శ్రద్ధగా పనిచేస్తే నేరాలు బాగానే తగ్గిపోతయి. హైదరాబాదులోనే కాదు తెలంగాణ అంతట కూడ రక్షణ, న్యాయ వ్యవస్థ పటిష్టంగా పనిచేస్తే తెలంగాణా దేశంలోనే కాదు ప్రపంచములోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా నిలుస్తుంది
No comments:
Post a Comment