Saturday, February 3, 2018

సమ్మక్క జాతర



ఇదేమి వింత! ఇదేమి వింత!
పల్లె పట్నమాయె, అడవే జనసంద్రమాయే
ఇదేమి వింతా? ఇదేమి వింతా?
వింతా కాదులే
ఇది తల్లుల మహిమలే!
సమ్మక్క జాతరంటె అంతెలె.

అమ్మల జాతర
సమ్మక్క సారక్క జాతర
ఆదివాసుల జాతర
అయింది సర్వజనుల జాతర
అందరి జాతర
మేడారం జాతర! మేడారం జాతర!
మహిమల జాతర ! మహా జాతర!

అడవిలో అమ్మలు 
గద్దెలపై వెలిశారు
కోర్కెలు తీర్చను వారు కొలువైనారు
కొంగు బంగారమౌనులె
పసుపుకుంకుమలు 
కలకాలం నిలుచునులే
మొక్కులు చెల్లించుకోను
మళ్ళిమళ్ళి రావాలె, మేడారం రావాలే
అమ్మలనె కొల్వాలె.

No comments:

Post a Comment