జనారణ్యంలో
మృగాలకు
ఆటవిక న్యాయం
సరి! సరి!
బలవంతుల
చేతిలో
బలహీనులు
బలి! బలి!
*******
అడిగిందె అయింది
అనుకున్నట్లే అయింది
అయినా
అంతరాంతరాలలో
భయం, భయం
న్యాయం వికటాట్టహాసం!
ధర్మం ఆక్రోశం!
*********
మండే గుండెలపై
చిటికెడు
నీళ్ళు చిల్కరించారు
ఆ జ్వాలలు చల్లారేనా?
వేరు పురుగుకు
వైద్యం చేయక
వాడిన కొమ్మను నరికితె
చెట్టు చిగురించేనా?
*********
హృదయం
చిధ్రమైంది
దానిని అతికించె
మలామేది?
మానవత్వమే మందైతె
అది
అందని పండైంది!
********
కళ్ళెం లేని
కోరికలు
జీవితాలు
దహిస్తుంటే
ఆలోచన లేని
ఆవేశాలకు
రాజ్యం
లొంగిపోయింది!
*********
నిరంతర
నిఘాలో
ఆడ బతుకు!
మగవాడి
కౄరత్వానికి
లేదా అదుపు?
**********
ప్రజాస్వామ్యంలో
రాజకీయ మృగాలకు
కోర్టులో
జీవితాంతం వాయిదాలు?
సామాన్యుని
నేరానికి
ప్రజాకోర్టులో
ఇన్స్టంట్ శిక్షలు!
**********
మాటల తుటాలతో
జీవితాలు
అంతం చేసిన
నాయకులకేది శిక్ష?
ప్రజాస్వామ్యంలో
ప్రభుత్వాన్ని
నిలదీసే సామాన్యునికి
కావాలి
ఎన్కౌంటర్ నుండి రక్ష!

Very well penned down Rani Chinma. Has justice been served in the recent case? No. Vengeance was.
ReplyDeleteSharing it
ReplyDelete