Thursday, August 29, 2019

ధనిక రాష్ట్రం


నా రాష్ట్రం
ధనిక రాష్ట్రం!

నాలుగు కోట్ల జనాభా
కోటి కుటుంబాలు
సగుటున నలుగురు
కుటుంబానికి

నా రాష్ట్రం
ధనిక రాష్ట్రం!

కోటి కుటుంబాలు
కోటి తెల్ల కార్డులు!

సంక్షేమానికి 
మారు పేరు
నా రాష్ట్రం!

నా రాష్ట్రం
రైతన్నకు నేస్తం
ధనిక పేద
తేడా లేదు

ఎకరం వున్న రైతుకైనా
వందల ఎకరాలున్న
భూస్వామికైనా
అందరికి
రైతు బంధు పథకం!

ప్రపంచానికే
ఆదర్శం
నా రాష్ట్రం
సంక్షేమ రాష్ట్రం!

No comments:

Post a Comment