Saturday, August 10, 2019

అర్థం కానిది



స్వచ్ఛ మైన నీళ్ళివలేం
కుంట నీళ్ళలో ఓ తులసి దళం
అయితుందా పవిత్ర జలం
పోయే ప్రాణానికి ఆధారం

*************

స్వచ్ఛ భారత్ లో
వైద్యం కలగాపులగం
హద్దులు తెలియని వైనం

********************

ఆకలి మంటకు
కారం మెతుకులు ఆసరా
కలిగె కష్టం నష్టం
పట్టించుకునేదెవరురా?

**************

ఆ కాలంలోనె వారు
కత్తులు పట్టారు, కాన్ఫులు చేసారు
చేద్దాం వాళ్ళని
సర్జన్లు, అబ్స్టెట్రిషన్లు!

************

కోట్లు పెట్టి సీట్లు కొంటె
కన్సుమర్ కోర్టు వుంది
డిగ్రీ గ్యారెంటి
ప్రాణాలకే లేదు వారంటి!

******************

మూగజీవులకు వైద్యం చేసె మహానుభావులు
తోటి మానవులకు ఎందుకు వైద్యం చేయకూడదు?



No comments:

Post a Comment