Saturday, August 3, 2019

స్పందన



ఈ మధ్య కాలంలో నా చుట్టు చాలా చాలా మార్పులు వచ్చాయి.  నేనెమి రాయలేక పోయాను. 
ఇవాల నా భావాలు బైట పెట్టాలనిపించింది.

*******

అడవులు కొట్టేసి ఇండ్లు కట్టిండ్రు
కోతులు ఇంట్లకు వస్తుంటె గొడవ పెడుతున్రు

*******

ప్రజాస్వామ్యంలో కుటుంబ వారసత్వం
వాడవాడల గుండా రాజకీయం

*******

ప్రజాపన్నుల ఆదాయం
సంక్షేమ పథకాలలో మాయం
అభివృద్ధి ఆమడ దూరం
******

సంక్షేమంలో సోమరులకు
చద్దన్నమే మహాప్రసాదం
ఓట్లతో గెలిచిన నాయకులకు
కలకాలం రాజవైభోగం

*****

ఒక్క నిర్దోషిని గుర్తించక
తొమ్మిది దోషుల విడుదల
అచ్చోసిన ఆంబోతులు
జర జాగ్రత్త

******

హంతకులను ఆదరిస్తె
రాజ్యాలేలుతారు
దోపిడి దొంగలు
దేశమునుండి పరార్

******

కాపికొట్టి పాసు
పైసలతో సీటు ఖరార్
దోపిడికి తయార్

*******

ఆ మె రి కా లో
ఆధునిక వైద్యం నాకు
అన్ని  వేళలా
RMP వైద్యం నీకు

xxxxxxxx




No comments:

Post a Comment