Tuesday, February 26, 2013

Telangaana wins

జై తెలంగాణ
ఇప్పుడు వచ్చిన MLC ఫలితాలు ఖచ్చితంగా
తెలంగాణా వాదము గెలుపె.  వరంగల్లులో TRS అభ్యర్థి
ఓడిపోవటము బాధపడాల్సిన విషయము కాదు.  ప్రభుత్వ
ఉపాధ్యాయుల్లో కార్పొరేట్ ఆధిపత్యాల పట్ల వ్యతిరేక భావం
అర్థం చేసుకొదగిందే.  ఉపాధ్యాయులు ఎన్నుకున్నది
తెలంగాణ ఉద్యమంలో చురుగ్గ పాల్గొని, సకల జనుల సమ్మెను
విజయవంతం చేయడానికి కృషి చేసిన నాయకుడిని.  కరీంనగర్లో
PRTUకు మద్దతు ఇచ్చిన TRS వరంగల్లో మద్ద్తతు ఇవ్వక
పోవటము ఎందుకో వాళ్ళకే తెలియాలి. డబ్బె కారణమని బహిరంగ
రహస్యం. 
తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు.  KCR, TRS పై ఎంత
అభిమానమున్నా తెలంగాణ పేరు చెప్పి ఎవరిని పడితె వాళ్ళని
అభ్యర్థిగ నిలబెడితె ప్రజలు ఎన్నుకోరు.  కేవలము కోట్లలో డబ్బు
తీసుకొని టికెట్టు ఇస్తె రాబోయె శాసన సభ, పార్లమెంట్ ఎన్నికల్లో
ఇలాంటి ఫలితాలె వస్తయి.  
జై తెలంగాణ !  జయహో తెలంగాణ !!

Monday, February 25, 2013

Where we r going

ఎటు పోతున్నాము?
రాష్త్రములో పరిస్థితులు దిగజారుతున్నట్లు అనిపించినా,
 లేదా ప్రభుత్వములో ఉన్న నాయకులు ప్రజా సమస్యలకు
సరిగ స్పందిస్తలేరనుకున్నా,‘ఎటు పొతున్నాం మనము’,
అంటు అవేదన ప్రదర్శిస్తారు ఆ నాయకుడు.  ఆ నాయకుడికి
చక్కని పరిపాలన దక్షుడనె పేరు కూడా వుంది.  2014 ఎన్నికల్లో
గెలిచె అవకాశము మెండుగ వుందని భావిస్తున్నావాళ్ళు ఎక్కువె.
అందుకోసం అ నాయకుడు కూడ చాలా రోజుల నుండి పాద
యాత్ర చేస్తు చాలా చాలా చాలా.....కష్టపడుతున్నాడు కూడ.
ఆతని వయస్సులో అది ఎంత కష్టమో నేను బాగానె అర్థం
చేసుకోగలను.  కాని, మహానాయకుడు, ప్రజాస్వామ్యవాది
ఎట్టి పరిస్థితిలో హింసను ప్రేరెపించ గూడదని, అట్ల చేయటము
నేరమని నా విశ్వాసము.  శారీరక మానసిక వత్తిడిలొ వున్న్ద
నాయకుడు ఎట్లా పడితె అట్ల మాట్లాడటము ఎంత మాత్రము
తగదు.  ప్రజలకు తప్పుడు సూచనలు చేయటము ఎంత
మాత్రము మంచిది కాదు.  ఇతరుల గురించి వారు చేసిన
సూచనలు రేపు తమ పట్ల కూడ అనుసరించ వచ్చని
మరిచి పొవొద్దు.  అతను చేసినవ్యాఖ్య మరే పార్టి
(కాంగ్రెసెతర), నాయకులు చేసిన ఈ పాటికి టివిల్లో చర్చొపచర్చలు
జరిగేవి.  సంచలన వ్యాఖ్యలు, లేద బ్రెకింగ్ న్యూస్ పేరిట
జనాలను అదరగొట్టె వాళ్ళు.  ఏదొ సందర్భంలో ఓ తెలంగాణ
సభలో "తెలంగాణ వాలె జాగొ, ఆంధ్ర వాలె భాగో", అని ఓ
నాయకుడు అంటె అప్పుడె ఆంధ్రావాళ్ళను భగాయించినట్టు
ఎందరో నానా యాగి చేసారు.  ఇప్పుడు కూడ
 తెలంగాణా ఇస్తె మమ్మల్ని ఎట్లా చూస్తారో అని
ఆ వ్యాఖ్యను బూతద్దంలో చూపిస్తారు.
మరి ఇప్పుడు "మిమ్మల్ని ఈ స్థితి తీసుకొచ్చిన కాంగ్రెసును చంపాలి.
రైతులు కత్తులు కొడవళ్లతో...గీత కార్మికులు మోకుతో రోడెక్కి
తిరగబడాలి".  ఈ పిలుపుతో నాయకుడు ఎలాంటి ప్రబోధమిస్తున్నాడు? 
ఓట్లతో కాకుండ కత్తులు కొడవల్లతో తిరగబడమని చెప్పటము
సీమ సంస్కృతి అనుకుంటా. 
చంద్రబాబు నాయుడుగారు, కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుంటె నొప్పులన్ని
తగ్గి, శారీరకంగ, మానసికంగ పూర్తిగ కోలుకున్న తరువాత మళ్ళీ పట్టు
వదలని విక్రమార్కుడిలా యాత్ర కొనసాగిస్తె యిలాంటి తప్పులు జరగవనుకుంట.

Fanatism

మతం-మానవత్వం
ఏమిటి దారుణం?  ఎందుకీ మారణ హోమం?
ఏ మతం చెప్పుతుంది అమాయకులని చంపమని?
ఏ ధర్మం చెపుతుంది మనుషులని ముక్కలు చేయమని?
ఏ యుధ్ద నీతది పసిపిల్లల ప్రాణాలు తీస్తుంది?
సర్వాంతర్యమి ప్రేమస్వరూపుడని, కారుణ్యధాముడని
ప్రవక్తల ప్రబొధము రక్తపుటేరులలో కొట్టుకపొయె!
మనుషులంత మమతతో మెలగాలనె
మతాల ఘోష కాలిన మాంసము ముద్దల్లొ
బూడిదై మట్టిలొ కలిసిపోయె.
ఏమి సాధించాలని ఈ దాష్టికం?
ఎవరిని భయపెట్టాలని ఈ మానవ హననం?
ముష్కరులకు రాజ్యలు భయపడితె
మిగిలేది శ్మశానాలె.
సూత్రధారులు ఎప్పుడైనా సెఫేలె,
పాత్రధారులకు చేటు తప్పదులే.
కాని,
అమాయకుల జీవితాలు చిధ్రమైతె
ఆ పాపము పాలకులదె.
చచ్చాక స్వర్గం వస్తుందని జీవితాలు నరకం చెస్తె
ఆ అమాయకుల ఆక్రందనల ప్రకంపనలతొ
స్వర్గమె పెకిలించుకుపోదా?
మనీషిగా ఎదగమని మేధనిస్తె
మృగముకన్నా హీనమై రక్తపుటేరులె పారిస్తె
అక్కున చేర్చుకునె ప్రేమస్వరూపుడు కారుణ్యధాముడెవరు?
‘పేర్లు ఎన్ని వున్నాసర్వాంతర్యామి ఒక్కడే,
రంగులెవైనా మానవజాతి ఒక్కటే’, అని
నమ్మిపాటించిననాడు
మానవ జాతి మాననీయ జాతి కాదా,
ఈ భువి పైకే స్వర్గము దిగి రాదా!

Thursday, February 14, 2013

Speed Post

తప్పాల శాఖ

అంతర్జాలము, సెల్ ఫోను వచ్చాక తపాల శాఖ వారి పని, ఉత్తరాల బట్వాడ,
చాలానె తగ్గిందనుకుంట.వాళ్ళు కూడ మరింత పని తగ్గించుకోడానికి
చూస్తున్నారనిపిస్తుంది. ముఖ్యమైన ఉత్తరాలు వారికి
రావని అనుకుంటారెమో.  ఢిల్లీ నుండి హోమ్ శాఖ వారి నుండి
రిజిస్ట్రర్డ్ స్పీడ్ పోస్ట్ పంపితె అది కశ్మిరు వెళ్ళడానికి నాల్గు రోజుల
టైము పట్టింది.  తప్పు ఎవరిదైన అఫ్జల్ గురు అఖరి చూపుకు
నొచుకోని ఆ కుటుంబ సభ్యుల బాధను ఈ జన్మలో
ఎవరూ తీర్చలేనిది. 
మా ఊళ్ళో, కార్పొరెషనే, పోస్టాఫీసుంది.  ఒకప్పుడు పట్టణ శివారు,
ఇప్పుడు పట్టణము మధ్యలో వున్నది. పక్కనె వున్న ఊరికి ఓ పాతికెళ్ల
క్రితం ఇదే పొస్టాఫీసు.  ఇప్పుడా ఊరు కూడ పట్టణములొ
 కలిసి పోయింది.  ఓ ఇరవై యేళ్ల నుండి ఈ పోస్టాఫీసు
పరిధిలో వుంటున్నము.  వీళ్లు పోస్టు రెండు మూడు రోజులకొకసారి,
వారి వీలుని బట్టి పట్టుకొచ్చి ఇస్తారు.  కొన్ని కొన్ని
సార్లు నెలకోసారి తెచ్చిన ఘటనలు కూడ వున్నయి. 
మా వృత్తిరిత్య, ఇతర పత్రికల చందాదారులుగ మా ఇంటికి
రెండు మూడు రోజుల కొకసారైన పోస్ట్ వస్తుంది.  నెలైన ఒక్క పోస్ట్
 రాకపోతె పోస్టాఫీసుకు వెళ్ళి అసలు సంగతేందొ
తెలుసుకుందామని వెళ్ళము.  వచ్చిన పోస్టంత
 ఓ రూములో కుప్పలా వుంది.
 "ఇదేంటని", అడిగతె
"పోస్ట్ మాన్లేడ"ని చెప్పారు. 
"మరి మాకు ముఖ్యమైన పోస్ట్ వస్తె ఎట్లా", అంటె
"మాకు తెలుస్తుంది.  అప్పుడు పట్టుకొచ్చి యిస్తాంలె",
 "అదెట్లా కుదురుతుంది, మా పోస్ట్ ఏది ముఖ్యమో మీకెలా తెలుస్తుంది",
అని అడిగితె
"అది అంతే, మీరేం చేసిన ఇక్కడ మారేదెముండదన్న"
అర్థంలో మాట్లాడారు.
 దాని తరువాత వారానికి ఒకసారైన పోస్ట్ట్ పట్టుకొస్తున్నారు.
 చందా కట్టిన కొన్నిపత్రికలు కవర్లు తీసి చదివినట్లుంటాయి. 
లేదా ఒకేసారి, ఆ నెలలో వచ్చె వారపత్రికలు నాలుగు
ఒకేసారి పట్టుకొస్తారు.  అదేంటంటె, అలాగె వచ్చాయంటారు. 
కొన్నిసార్లు, కవర్లు కూడ చింపి తీసుకువచ్చి అది అట్లాగె
 వుందని చెపుతారు.మరోసారి ఏదో పార్సెల్ వచ్చిందని,
 పోస్టాఫీసుకు వచ్చి డబ్బులు కట్టి తీసుకొమంటే
అలాంటి పార్సెలు ఏది మాకు వచ్చేది
లేదని చెప్పాక, కొద్ది రోజుల తరువాత ఓ పార్సెల్
 పట్టుకొచ్చి ఇచ్చారు. ఏ పోస్ట్ మీద అది అక్కడకు వచ్చిన ముద్ర కాని
 వారు ఇస్తున్నరోజు తారీఖు ముద్ర కాని వుండదు. 
ఇక్కడ ఇంకొ విషయము చెప్పాలి.  మా పోస్ట్ మాస్టరు ఓ అబ్బాయికి
తన పోస్ట్ బట్వాడా పని అప్పగించాడు.  ఈ అబ్బాయి
చదువుకునె అబ్బాయి.  ఆ అబ్బాయి తన సైకిలు బాగుంటె,
 తన వీలును బట్టి పొద్దున ఏడు గంటలనుండి రాత్రి ఏడు
గంటల వరకు ఎప్పుడైన పోస్ట్ పడేసి పోతాడు.  పోస్ట్ బట్వాడ చేసిన రోజు
 ఓ ఇరవై లేద ముప్పై రూపాయలు ఇస్తాడని విన్నాను.
ఈ పద్ధతిని మార్చలేక మేమె ఏదైన ముఖ్యమైన పోస్ట్ వచ్చెదుంటే
 పోస్టఫీసుకు వెళ్ళి తెలుసుకుంటాము.
ఈ కారణంగా కొన్నిసార్లు మాకు కష్టమైంది.
 ఇంక ఎవరెవరికి ఏం కష్టాలో?  

 

Sunday, February 10, 2013

Prema

 
ప్రేమ
ప్రేమ, ప్రేమ, ప్రేమంటాడు
ప్రేమిస్తున్నానంటు వెంటబడతాడు
పెళ్ళి చెసుకుందామంటె
పెద్దలను అడగాలంటాడు
శ్రీ రాముడైతె
    పెళ్ళి తరువాతె ప్రేమనె
శ్రీ కృష్ణుడైతె
   నీ నంబరెంతొ తెలుసుకోవే.