Monday, February 25, 2013

Where we r going

ఎటు పోతున్నాము?
రాష్త్రములో పరిస్థితులు దిగజారుతున్నట్లు అనిపించినా,
 లేదా ప్రభుత్వములో ఉన్న నాయకులు ప్రజా సమస్యలకు
సరిగ స్పందిస్తలేరనుకున్నా,‘ఎటు పొతున్నాం మనము’,
అంటు అవేదన ప్రదర్శిస్తారు ఆ నాయకుడు.  ఆ నాయకుడికి
చక్కని పరిపాలన దక్షుడనె పేరు కూడా వుంది.  2014 ఎన్నికల్లో
గెలిచె అవకాశము మెండుగ వుందని భావిస్తున్నావాళ్ళు ఎక్కువె.
అందుకోసం అ నాయకుడు కూడ చాలా రోజుల నుండి పాద
యాత్ర చేస్తు చాలా చాలా చాలా.....కష్టపడుతున్నాడు కూడ.
ఆతని వయస్సులో అది ఎంత కష్టమో నేను బాగానె అర్థం
చేసుకోగలను.  కాని, మహానాయకుడు, ప్రజాస్వామ్యవాది
ఎట్టి పరిస్థితిలో హింసను ప్రేరెపించ గూడదని, అట్ల చేయటము
నేరమని నా విశ్వాసము.  శారీరక మానసిక వత్తిడిలొ వున్న్ద
నాయకుడు ఎట్లా పడితె అట్ల మాట్లాడటము ఎంత మాత్రము
తగదు.  ప్రజలకు తప్పుడు సూచనలు చేయటము ఎంత
మాత్రము మంచిది కాదు.  ఇతరుల గురించి వారు చేసిన
సూచనలు రేపు తమ పట్ల కూడ అనుసరించ వచ్చని
మరిచి పొవొద్దు.  అతను చేసినవ్యాఖ్య మరే పార్టి
(కాంగ్రెసెతర), నాయకులు చేసిన ఈ పాటికి టివిల్లో చర్చొపచర్చలు
జరిగేవి.  సంచలన వ్యాఖ్యలు, లేద బ్రెకింగ్ న్యూస్ పేరిట
జనాలను అదరగొట్టె వాళ్ళు.  ఏదొ సందర్భంలో ఓ తెలంగాణ
సభలో "తెలంగాణ వాలె జాగొ, ఆంధ్ర వాలె భాగో", అని ఓ
నాయకుడు అంటె అప్పుడె ఆంధ్రావాళ్ళను భగాయించినట్టు
ఎందరో నానా యాగి చేసారు.  ఇప్పుడు కూడ
 తెలంగాణా ఇస్తె మమ్మల్ని ఎట్లా చూస్తారో అని
ఆ వ్యాఖ్యను బూతద్దంలో చూపిస్తారు.
మరి ఇప్పుడు "మిమ్మల్ని ఈ స్థితి తీసుకొచ్చిన కాంగ్రెసును చంపాలి.
రైతులు కత్తులు కొడవళ్లతో...గీత కార్మికులు మోకుతో రోడెక్కి
తిరగబడాలి".  ఈ పిలుపుతో నాయకుడు ఎలాంటి ప్రబోధమిస్తున్నాడు? 
ఓట్లతో కాకుండ కత్తులు కొడవల్లతో తిరగబడమని చెప్పటము
సీమ సంస్కృతి అనుకుంటా. 
చంద్రబాబు నాయుడుగారు, కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుంటె నొప్పులన్ని
తగ్గి, శారీరకంగ, మానసికంగ పూర్తిగ కోలుకున్న తరువాత మళ్ళీ పట్టు
వదలని విక్రమార్కుడిలా యాత్ర కొనసాగిస్తె యిలాంటి తప్పులు జరగవనుకుంట.

No comments:

Post a Comment