Thursday, February 14, 2013

Speed Post

తప్పాల శాఖ

అంతర్జాలము, సెల్ ఫోను వచ్చాక తపాల శాఖ వారి పని, ఉత్తరాల బట్వాడ,
చాలానె తగ్గిందనుకుంట.వాళ్ళు కూడ మరింత పని తగ్గించుకోడానికి
చూస్తున్నారనిపిస్తుంది. ముఖ్యమైన ఉత్తరాలు వారికి
రావని అనుకుంటారెమో.  ఢిల్లీ నుండి హోమ్ శాఖ వారి నుండి
రిజిస్ట్రర్డ్ స్పీడ్ పోస్ట్ పంపితె అది కశ్మిరు వెళ్ళడానికి నాల్గు రోజుల
టైము పట్టింది.  తప్పు ఎవరిదైన అఫ్జల్ గురు అఖరి చూపుకు
నొచుకోని ఆ కుటుంబ సభ్యుల బాధను ఈ జన్మలో
ఎవరూ తీర్చలేనిది. 
మా ఊళ్ళో, కార్పొరెషనే, పోస్టాఫీసుంది.  ఒకప్పుడు పట్టణ శివారు,
ఇప్పుడు పట్టణము మధ్యలో వున్నది. పక్కనె వున్న ఊరికి ఓ పాతికెళ్ల
క్రితం ఇదే పొస్టాఫీసు.  ఇప్పుడా ఊరు కూడ పట్టణములొ
 కలిసి పోయింది.  ఓ ఇరవై యేళ్ల నుండి ఈ పోస్టాఫీసు
పరిధిలో వుంటున్నము.  వీళ్లు పోస్టు రెండు మూడు రోజులకొకసారి,
వారి వీలుని బట్టి పట్టుకొచ్చి ఇస్తారు.  కొన్ని కొన్ని
సార్లు నెలకోసారి తెచ్చిన ఘటనలు కూడ వున్నయి. 
మా వృత్తిరిత్య, ఇతర పత్రికల చందాదారులుగ మా ఇంటికి
రెండు మూడు రోజుల కొకసారైన పోస్ట్ వస్తుంది.  నెలైన ఒక్క పోస్ట్
 రాకపోతె పోస్టాఫీసుకు వెళ్ళి అసలు సంగతేందొ
తెలుసుకుందామని వెళ్ళము.  వచ్చిన పోస్టంత
 ఓ రూములో కుప్పలా వుంది.
 "ఇదేంటని", అడిగతె
"పోస్ట్ మాన్లేడ"ని చెప్పారు. 
"మరి మాకు ముఖ్యమైన పోస్ట్ వస్తె ఎట్లా", అంటె
"మాకు తెలుస్తుంది.  అప్పుడు పట్టుకొచ్చి యిస్తాంలె",
 "అదెట్లా కుదురుతుంది, మా పోస్ట్ ఏది ముఖ్యమో మీకెలా తెలుస్తుంది",
అని అడిగితె
"అది అంతే, మీరేం చేసిన ఇక్కడ మారేదెముండదన్న"
అర్థంలో మాట్లాడారు.
 దాని తరువాత వారానికి ఒకసారైన పోస్ట్ట్ పట్టుకొస్తున్నారు.
 చందా కట్టిన కొన్నిపత్రికలు కవర్లు తీసి చదివినట్లుంటాయి. 
లేదా ఒకేసారి, ఆ నెలలో వచ్చె వారపత్రికలు నాలుగు
ఒకేసారి పట్టుకొస్తారు.  అదేంటంటె, అలాగె వచ్చాయంటారు. 
కొన్నిసార్లు, కవర్లు కూడ చింపి తీసుకువచ్చి అది అట్లాగె
 వుందని చెపుతారు.మరోసారి ఏదో పార్సెల్ వచ్చిందని,
 పోస్టాఫీసుకు వచ్చి డబ్బులు కట్టి తీసుకొమంటే
అలాంటి పార్సెలు ఏది మాకు వచ్చేది
లేదని చెప్పాక, కొద్ది రోజుల తరువాత ఓ పార్సెల్
 పట్టుకొచ్చి ఇచ్చారు. ఏ పోస్ట్ మీద అది అక్కడకు వచ్చిన ముద్ర కాని
 వారు ఇస్తున్నరోజు తారీఖు ముద్ర కాని వుండదు. 
ఇక్కడ ఇంకొ విషయము చెప్పాలి.  మా పోస్ట్ మాస్టరు ఓ అబ్బాయికి
తన పోస్ట్ బట్వాడా పని అప్పగించాడు.  ఈ అబ్బాయి
చదువుకునె అబ్బాయి.  ఆ అబ్బాయి తన సైకిలు బాగుంటె,
 తన వీలును బట్టి పొద్దున ఏడు గంటలనుండి రాత్రి ఏడు
గంటల వరకు ఎప్పుడైన పోస్ట్ పడేసి పోతాడు.  పోస్ట్ బట్వాడ చేసిన రోజు
 ఓ ఇరవై లేద ముప్పై రూపాయలు ఇస్తాడని విన్నాను.
ఈ పద్ధతిని మార్చలేక మేమె ఏదైన ముఖ్యమైన పోస్ట్ వచ్చెదుంటే
 పోస్టఫీసుకు వెళ్ళి తెలుసుకుంటాము.
ఈ కారణంగా కొన్నిసార్లు మాకు కష్టమైంది.
 ఇంక ఎవరెవరికి ఏం కష్టాలో?  

 

No comments:

Post a Comment