Monday, February 25, 2013

Fanatism

మతం-మానవత్వం
ఏమిటి దారుణం?  ఎందుకీ మారణ హోమం?
ఏ మతం చెప్పుతుంది అమాయకులని చంపమని?
ఏ ధర్మం చెపుతుంది మనుషులని ముక్కలు చేయమని?
ఏ యుధ్ద నీతది పసిపిల్లల ప్రాణాలు తీస్తుంది?
సర్వాంతర్యమి ప్రేమస్వరూపుడని, కారుణ్యధాముడని
ప్రవక్తల ప్రబొధము రక్తపుటేరులలో కొట్టుకపొయె!
మనుషులంత మమతతో మెలగాలనె
మతాల ఘోష కాలిన మాంసము ముద్దల్లొ
బూడిదై మట్టిలొ కలిసిపోయె.
ఏమి సాధించాలని ఈ దాష్టికం?
ఎవరిని భయపెట్టాలని ఈ మానవ హననం?
ముష్కరులకు రాజ్యలు భయపడితె
మిగిలేది శ్మశానాలె.
సూత్రధారులు ఎప్పుడైనా సెఫేలె,
పాత్రధారులకు చేటు తప్పదులే.
కాని,
అమాయకుల జీవితాలు చిధ్రమైతె
ఆ పాపము పాలకులదె.
చచ్చాక స్వర్గం వస్తుందని జీవితాలు నరకం చెస్తె
ఆ అమాయకుల ఆక్రందనల ప్రకంపనలతొ
స్వర్గమె పెకిలించుకుపోదా?
మనీషిగా ఎదగమని మేధనిస్తె
మృగముకన్నా హీనమై రక్తపుటేరులె పారిస్తె
అక్కున చేర్చుకునె ప్రేమస్వరూపుడు కారుణ్యధాముడెవరు?
‘పేర్లు ఎన్ని వున్నాసర్వాంతర్యామి ఒక్కడే,
రంగులెవైనా మానవజాతి ఒక్కటే’, అని
నమ్మిపాటించిననాడు
మానవ జాతి మాననీయ జాతి కాదా,
ఈ భువి పైకే స్వర్గము దిగి రాదా!

No comments:

Post a Comment