ఎలక్షన్ల పండగ - 2014
ఎలక్షన్ల పండగ వస్తుంది. ముహుర్తాలు ఖరారైనయి. రాష్ట్రములో,దేశములో పార్టీలు పండగకు తయారవటము మొదలైంది. ప్రజలను
మాటలతో మాయజేసి ఓట్లు దండుకునే వ్యూహాలకు పార్టీల సింగారింపు
మొదలైంది.
పార్లమెంటు ఎన్నికలకు జాతీయ, ప్రాంతీయ పార్టీలు సన్నద్ధమౌతున్నయి.
జాతీయ పార్టీలైన కాంగ్రేసు, భాజపాలకు స్వంతంగా ప్రభుత్వమేర్పాటు
చేయలేమని ప్రాంతీయ పార్టీలతో పొత్తుకు రకరకాల ఎత్తులు వేస్తున్నయి.
కామ్రేడుల గురించి చెప్పె పనేలేదు. వాళ్ళు దేశంలో జాతీయ స్థాయిలో
ఎప్పుడు పొత్తులేకుండ ముందుకు పోలేదు. కొలకత్తాలో తృణమూల్
వచ్చాక వారి అస్థిత్వము ముప్పులో వుందనే చెప్పాలి. ఇప్పుడంతా
పార్లమెంటులో ప్రాంతీయ పార్టీలదే హవా అని అన్ని ప్రాంతీయ పార్టీలు
రకరకాల ఎత్తుగడలతో, పొత్తులతో అధికారంలోకి రావడానికి అడుగు
లేస్తున్నయి.
ప్రస్తుత ఆం.ప్ర. పరిస్థితి మరీ గందరగోళంగా వుంది. అర్జంటుగా కొత్త
కొత్త పార్టీలు పెట్టేస్తున్నరు. అంతా అధికారము ఎంత తొందరగా అయితె
అంత తొందరగా పొందాలనే. ఇప్పుడు అరచేతిలో చెందమామను చూపించే
వాళ్లు రేపు అధికారంలోకి వస్తె అద్దంలో చూపిస్తారు. ప్రజలు అమాయకులు
కాకున్నా వారికి ఎవరిని నమ్మాలో అర్థం కాని పరిస్థితి. ప్రతి నాయకుడు,
పార్టీ, వేరే పార్టీ, నాయకుడిని తిట్టడమే. ఒకరి గుట్టు మరొకరు రట్టు చేయడమే.
ఎవరూ వద్దని కొందరు NOTA వత్తినా ఆయా పార్టీల వాళ్ళు వేసె ఓట్లతో ఎవరో
ఒకరు గెలవక తప్పదు. నూట్లో తొంభై మంది NOTA వత్తిన వచ్చె పది ఓట్లలో
ఎవరికి ఒక ఓటు ఎక్కువ వచ్చినా వాళ్ళు అధికారములోకి రావచ్చు కదా!
కిరణ్ కుమార్ రెడ్డికి అధికారమిచ్చి కాంగ్రేసుకు కొరివితో తలగోక్కున్నట్టైంది.
స్పీకర్‍గా వుండి చెల్లని రాజీనామాల విషయం దాచిపెట్టి ఏపీని అద్రగాణం
చేసిండు. సీఎమ్ అయ్యాక తెలంగాణ ఉద్యమము అణిచేయాలని తెలంగాణ
స్టూడెంట్సును నానా ఇబ్బందులు పెట్టాడమే కాదు, స్వంత పార్టీ ఎమ్మెల్యేలను,
ఎమ్పీలను అరెస్టు చెసిండు. చివరాఖరకు "నేను అధిష్టానానికి వ్యతిరేకము
కాదు, నిర్ణయానికి మాత్రం వ్యతిరేకమ"ని ధిల్లీలో దీక్ష చేసిండు. ఇప్పుడు
‘జై సమైక్యాంధ్ర’ అని పార్టీ పెట్టి విడిపోయిన రాష్ట్రాని కలుపుతానంటు బెర్లిన్
గోడ ముచ్చట చెపుతున్నడు. బెర్లిన్ గోడ ప్రజల కోరికవల్ల కూలగొట్టబడింది.
కాని ఇక్కడ తెలంగాణ ప్రజలు అరవై ఏళ్ళు పోరాటం చేసి సాధించుకున్నరు.
ఏ మాత్రం బుద్ధున్నోడు మళ్ళి సమైక్యమని ఎట్లంటడు? కిరణ్ కుమార్ రెడ్డి
సుప్రీం కోర్టుకు వెళ్ళి తిరిగి రాష్ట్రాన్ని సమైక్యం చేస్తనని సీమాంధ్రులకు
చెప్పటం ఆ ప్ర్జజల చెవుల్లో కాలిఫ్లవర్ పెట్టడమే. నాకైతె అన్పిస్తుంది, కిరణ్
చుట్టువున్నవాళ్ళు కిరణ్ణు ఎక్కించి, ఎలక్షన్ల తరువాత ఆయన్ను
ముంచేస్తారని. రెణ్ణెళ్లలో అంతా బైట పడుతుంది.
చంద్రబాబు నాయుడు హైద్రాబాదు నేనె కట్టానంటాడు. నిజాం తరువాత అంత
గొప్పవాడిని నేనెంటాడు. తెలంగాణ చరిత్రలో తన పేరు వుంటుందని చెప్పు
కుంటాడు. భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో గాంధి పేరు, మౌంట్‍బాటన్ పేరుతో
పాటు జనరల్ డయ్యరును ఎవరు మరిచిపోరు కదా. ఎన్డియే హయాంలో
తెలంగాణ ఆపింది నేనెని ఘనంగ చెప్పుకున్నబాబు, 2009లో తెలంగాణకు
అడ్డుపడి 1200ల తెలంగాణ పిల్లల ఉసురు పోసుకోవడానికి కారణమైన
విషయాన్ని చరిత్ర ఎలా మర్చిపోతుంది్? మామను వెన్నుపోటు పొడిచి
గద్దేనెక్కిన బాబు, తరువాత భాజపా హవాతో మళ్ళి అధికారంలోకి వచ్చాడు.
సొంతంగా ఏభై సీట్లు కూడా గెలవలేక పోయిన బాబు తెరాసాతో పొత్తు పెట్టుకొని
2009లో ఎక్కువ సీట్లు కొట్టాడు. ఇక ఇప్పుడు మళ్ళి భాజపాతో పొత్తు
పెట్టుకొని అధికారంలోకి రావాలని చూస్తున్నడు. సీమాంధ్రను సింగపూర్
చేస్తడట! ఈ వెన్నుపోటు వీరుడిని సీమాంధ్రులు పసుపు కుంకుమలతో
ఎలా ఆదరిస్తరో చూడాలి.
పసుపు పార్టీ ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ మధ్య అండర్ గ్రౌండ్ పోయినట్టున్నడు.
చంద్రబాబు తెలంగాణకు వ్యతిరేకంగా ఏం చేసినా దాని పరమార్థం విప్పిచెప్పుతు
బాబును వెనుకేసుకొచ్చేటోడు.తెలంగాణలో ఎన్ని విమర్శలు ఎదురైనా
దులుపెసుకుంటు KCRను విమర్శించె పని పెట్టుకొన్నమోత్కుపల్లి కూడ
ప్రస్తుతం సైలెంట్ అయిపోయిండు. తెలంగాణ వస్తె నేనె ముఖ్యమంత్రినని ఆశ
పెట్టుకున్న ఎర్రబెల్లి, రాజ్యసభ ఎన్నికల్లొ మొండి చెయ్యి అందుకున్న మోత్కుపల్లికి
చంద్రబాబు తెలంగాణలో BCని ముఖ్యమంత్రిని చేస్తాననడం అస్సలే మింగుడు
పడలేదనుకుంట. ఇన్నాళ్లు వీళ్ళిద్దరు బాబును వెనుకెసుకొచ్చినందుకు దక్కిన
ఫలితానికి విచారములో మునిగిపోయారనుకుంటా. మరి ఎప్పుడు పైకి తెలుతారో,
ఎట్లా తేలుతారో ఏ పార్టీలో తేలుతారో చూడాలి. ఇంతకు తెలంగాణలో తెదేపాకు
ఎన్ని ఓట్లు పడతాయి?
ఇక వైకాపా కొస్తె ముందు తెలంగాణ ఇవ్వటం కేంద్ర నిర్ణయానికి వదిలేసినా
తరువాత సమైక్య జెండా పట్టుకొని తెలంగాణలో పార్టీని పాతరేసిండు.
కోర్టు కేసుల్లో ఆస్తుల attachment అయితుంటే ఆ నష్టం పూడ్చు
కోవడానికి టికెట్లు అమ్ముకుంటున్నడు. దానితో పార్టీ కాస్తా ఖాళి అయితుంది.
ఉన్నోళ్లు పదుల కోట్లు పెట్టి టికెట్టు తీసుకున్నంక గెలిస్తే ప్రజల సొమ్ము ఎన్ని
వేల కోట్లుదోచుకుంటరో? వైకాపా వాళ్ళను ఎన్నుకునేటప్పుడు వాళ్ళు
ప్రజల ధనాన్ని కొల్లగొట్టడములో వాళ్ల నాయకునికే పాఠాలు నేర్పుతరని మరవద్దు.
తెరాసా తెలంగాణ ఇంటి పార్టీగా గుర్తింపు పొందింది. తెలంగాణ వాదులంతా
ఇంటి పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నరు. అట్లైతేనె కేంద్రములో
కోట్లాడి విభజన సమయములో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని కొంతవరకైనా
సరిదిద్దుకొవచ్చని, రాష్ట్రములో అధికారములో వుంటె ఉమ్మడి రాజధాని వల్ల
పదేళ్లలో ఆంధ్రోళ్ల వల్ల అన్యాయాలు కాస్తైనా తగ్గుతాయని సామాన్య జనం ఆశ.
కాని KCR వ్యూహాలేంటో? తెలంగాణ తొలి CM దళితుడెనన్న KCR
ఆ విషయాన్ని ప్రజలు యాది మరిచింన్రని అనుకుంటున్నడా? తన
పార్టీలోల్ల్లందరితోను తెలంగాణ పునర్మిణము కావాలంటె KCR తెలంగాణ
రాష్ట్ర CM కావాలని ఇంటా బైటా మీడియా ముందు కూయిస్తున్నడు.
ఇప్పటి పరిస్థితుల్లో తెలంగాణకు vision వున్న గట్టి నాయకుడు కావలిసిందె.
కాని ఎలక్షన్లో గెలిచాక కాంగ్రేసుతో విలీనమై కొడుక్కో బిడ్డాకో ముఖ్యమంత్రి
పదవి అప్పగించి జాతీయస్థాయిలో పదవి పొందడని గారెంటి ఏంటి? ఈ
మధ్యే ఒక ఉత్తరాది నాయకుడు రాజకీయాల్లో సిద్ధాంతాలు ఉండవు.
అధికారములోకి రావటమే ఏకైక సిద్దాంతమని సెలవిచ్చాడు. తెలంగాణ
ఉద్యమాన్ని పద్నాలుగేళ్ళు నడిపి, ఓట్లు, సీట్ల ద్వారనె రాష్ట్రాన్ని సాధించు
కుందామని చెప్పి ఆ విధంగా రాష్ట్రాని సాధించిన KCRను తెలంగాణ ప్రజలు
దేవుడని పూజిస్తరు. రాజకీయ ఉద్యమ పార్టీని ఫక్తు రాజకీయ పార్టీగా మార్చి
దానిని కలకాలం తెలంగాణ పార్టీగ బ్రతకనిచ్చి, తెలంగాణ రాష్ట్ర ప్రగతికి బాట
వేస్తె KCRకు తెలంగాణలో గుళ్ళు కట్టడం ఖాయం. మరి KCR ఏం చేస్తాడో
వేచి చూడాలి.
మొత్తానికి ఈసారి రాష్ట్ర ఎన్నికలు ఎంతో ఉత్కంఠను రేపుతున్నాయి. క్రితం
ఐదేళ్ళలో జరిగిన ఏ విషయాన్ని ప్రజలు మర్చిపోలేదు. సీమాంధ్రలోనైన,
తెలంగాణలోనైనా ప్రజల తీర్పు రాజకీయ నాయకులను ఆలోచింప
జేసిదిగా వుంటుందని, ప్రజల బాగోగులు పట్టించుకోక మభ్య పెట్టే నాయకులు
సన్యసించ వల్సిందేనని తెలియజేస్తుందని అనుకుంట.
No comments:
Post a Comment