Thursday, October 11, 2018

సాయినాథ హారతి


హారతి సాయిబాబ
జయ మంగళ హారతి మహదేవా
హారతి సాయిబాబ
జయ జయ హారతి దేవాధిదేవా
//హారతి //

కలియుగ దేవా రాజాధిరాజా
సద్గురు దేవా సాయినాథా  //హారతి//

ద్వారకమయి సర్వాంతర్యమి
నిర్గుణ దేవా సగుణస్వరూపా  //హారతి//

నీ దాసులకు దాసుడవు
సర్వ జీవులలో నీవె కలవు  //హారతి//

గంగా యమునలు నీ కాలిగోట కలవు
కోరుకున్నవారికి కోరిన దర్శనమిచ్చేవు //హారతి//

నీ భక్తుల భవభయ హరుడవు
ముక్తికి మార్గము నీ చరణమే శరణం //హారతి//

//హారతి//

ఫకీరుబాబా బ్రహ్మాండనాయక 
సచ్చిదానందా  యోగిరాజా  //హారతి//

హారతి సాయిబాబ
జయ మంగళ హారతి మహదేవా
హారతి సాయిబాబ
                                                       జయ జయ హారతి దేవాధిదేవా





Saturday, April 14, 2018

దేవుడితో మాట



మీరేమైనా దేవుడితో మాట్లాడలనుకుంటున్నరా?  మొన్న సమ్మక్క జాతరకు పొయినప్పుడు ’దేవుడు’ సెల్ నెంబరు ఒక బండి మీద చూసిన. నేనైతె ట్రై చెయ్యలేదు.  మీరు చేస్తరా?



Saturday, February 3, 2018

సమ్మక్క జాతర



ఇదేమి వింత! ఇదేమి వింత!
పల్లె పట్నమాయె, అడవే జనసంద్రమాయే
ఇదేమి వింతా? ఇదేమి వింతా?
వింతా కాదులే
ఇది తల్లుల మహిమలే!
సమ్మక్క జాతరంటె అంతెలె.

అమ్మల జాతర
సమ్మక్క సారక్క జాతర
ఆదివాసుల జాతర
అయింది సర్వజనుల జాతర
అందరి జాతర
మేడారం జాతర! మేడారం జాతర!
మహిమల జాతర ! మహా జాతర!

అడవిలో అమ్మలు 
గద్దెలపై వెలిశారు
కోర్కెలు తీర్చను వారు కొలువైనారు
కొంగు బంగారమౌనులె
పసుపుకుంకుమలు 
కలకాలం నిలుచునులే
మొక్కులు చెల్లించుకోను
మళ్ళిమళ్ళి రావాలె, మేడారం రావాలే
అమ్మలనె కొల్వాలె.