Thursday, October 11, 2018

సాయినాథ హారతి


హారతి సాయిబాబ
జయ మంగళ హారతి మహదేవా
హారతి సాయిబాబ
జయ జయ హారతి దేవాధిదేవా
//హారతి //

కలియుగ దేవా రాజాధిరాజా
సద్గురు దేవా సాయినాథా  //హారతి//

ద్వారకమయి సర్వాంతర్యమి
నిర్గుణ దేవా సగుణస్వరూపా  //హారతి//

నీ దాసులకు దాసుడవు
సర్వ జీవులలో నీవె కలవు  //హారతి//

గంగా యమునలు నీ కాలిగోట కలవు
కోరుకున్నవారికి కోరిన దర్శనమిచ్చేవు //హారతి//

నీ భక్తుల భవభయ హరుడవు
ముక్తికి మార్గము నీ చరణమే శరణం //హారతి//

//హారతి//

ఫకీరుబాబా బ్రహ్మాండనాయక 
సచ్చిదానందా  యోగిరాజా  //హారతి//

హారతి సాయిబాబ
జయ మంగళ హారతి మహదేవా
హారతి సాయిబాబ
                                                       జయ జయ హారతి దేవాధిదేవా





No comments:

Post a Comment