ఉప్పు - పప్పు
కిలో - కందిపప్పు, ఉప్పు,గోధుమలు,చింతపండు
లీటర్ పామాయిల్
అద్దకిలొ - శక్కర , కారం, గోధుమపిండి
పసుపు వంద గ్రాములు.
గోధుమలు, గోధుమ పిండి ఎందుకు?
మొత్తం గోధుమలో గోదుమపిండో ఇవ్వోచు కదా.
చింతపండు, ఉప్పు కిలో కిలో ఎందుకు?
కూరగాయలు కొనే పరిస్థితి లేదని, ఉప్పు పులుసు తినాలనా?
అసలే డాక్టర్లు ఉప్పు ఎక్కువ వాడోద్దో అని మొత్తుకుంటరు .
పావుకిలో ఉప్పు, కారం ఇచ్చి, కాస్త పప్పేక్కువ ఇస్తే
కొంచెం నయం కదా. శక్కర ధర బాగాపెరింగిందంటే
మంచిదే కదా, తక్కువ చక్కర తింటే షుగర్ బీమారి
రాకుండా వుంటదని ఓ పెద్దమనిషన్నాడు.
మరి ఇప్పుడున్న పరిస్థుతుల పెరిగే BP సరిపోదనా
కిలోల కొద్ది ఉప్పు ఇచ్చుడు?
సింపులుగ చెప్పాలంటే మనిషికి రోజుకి
200గ్రా గోధుమలు-పిండి /బియ్యము , వో చటాకు
(50గ్రా ) పప్పు, అద్ద చటాకు నునె, వో చెంచాడు ఉప్పు,
అంతకంటే తక్కువ కారం కావాలి.
వాళ్లు ఇచ్చేవి ఎన్ని రోజులకు సరిపోతాయి?
అయిన నా డౌటు, అవి తెచ్చుకోని వాళ్లు తింటారా
లేక ఏ హోటల్ వాళ్ళకో, పశువుల దానకో అమ్ముకుంటరా !
No comments:
Post a Comment