Sunday, March 31, 2013

Jesus Christ


ఏసు క్రిస్తు
ఏసయ్యా, ఓ ఏసయ్యా!
ఏసయ్యా, మా ఏసయ్యా!
మా దండాలయ్యా నీకు,
శతకోటి దండాలు నీకు. //ఏసయ్య//

దేవుని కొడుకువు నీవు
మాపై దయ తలచి వచ్చావు,
దీనులకు దిక్కైన నీవు
మా దెవుడ వైనావయ్యా!  //ఏసయ్య//

ప్రేమ పంచగ వచ్చిన
ఓ ప్రేమ మూర్తి,
మా రారాజువు నీవేనయ్య
ముళ్ళ కీరీటమె ధరించి
మాలో కరుణనే పెంచిన
కారుణ్యధాముడివి నీవెనయ్యా.  //ఏసయ్య//

కష్టాలె గట్టెక్కించి,కన్నీళ్ళె తుడిచిన
ఓ కారుణ్యమూర్తి!
శిలువను మోసి, దానిపై నీ రక్తన్నెచిందించి
మా గుండెల్లొ దయనే ప్రసరించిన
దయామూర్తివి నీవయ్య!  //ఏసయ్య//

మాకై జన్మించిన మహితాత్ముడా!
మాకై మరణించిన మరియ తనయ
మా జీవన జ్యొతివి నీవు,
ఆ పరమాత్మ స్వరూపుడవే నీవు!  //ఏసయ్య//

Wednesday, March 20, 2013

My poetry

 ఙ్ఞాపకాలు
చిన్నప్పటి నుండి పుస్తకాలు చదవటము నాకు అలవాటు.
రెండొ తరగతి వరకు స్కూల్లో మామూలు మార్కులు
వచ్చెవి.  క్లాసులో ఫర్స్ట్, సెకెండ్ వచ్చిన అమ్మాయి ప్రొగ్రెస్
 కార్డ్ తీసుకునెటప్పుడు అందరిని చప్పట్లు కొట్టమనె వారు
టీచర్.  నేను నా రిపోర్ట్ తీసుకునెటప్పుడు అందరు చప్పట్లు
ఎందుకు కొట్టట్లెదొ నాకు తెల్వక చిన్నబుచ్చుకునె దాన్ని. 
మూడో తరగతి నుండి అ కిటుకు నాకు తెల్సినంక ఇక స్కూల్లో
నేను ఎప్పుడు చప్పట్ల మధ్యనె నా రిపోర్ట్ సగర్వంగా తీసుకునె
దాన్ని.
అప్పటి నుండే నాకు చదువు పట్ల ఆసక్తి పెరిగింది.  అప్పట్లొ
ఎవరికైన చదవటం ఇష్టం వుండదంటే చాల విచిత్రమనిపించేది.
నేనైతె ఏ పుస్తకము దొరికితె అది చదివేదాన్ని.  పరిస్థితుల
ప్రభావమువల్ల నేను నాల్గో తరగతి చదవకుండ ఇంట్లోనె వుండాల్సి
వచ్చింది.  మా ఇంట్లో రామాయణ భారతాలు, పతివ్రత కథలు కాశి
మజిలి కథలు వంటి పుస్తకాలు వుండేవి.  ఆ సమయంలో అవి అన్ని
చదివాను.  చందమామ, బాలమిత్ర చదవటానికి మా అక్కచెల్లెల్లు, అన్న
దమ్ముల్ల్ల మధ్య పోటి, కొట్లాట వుండేది.  ఇంట్లొ అంత తెలుగు చదవటము
వల్ల, ఇంగ్లిషు మీడియం స్కూలైన నాకు తెలుగులో చదవటమే బాగ అలవాటు
అయింది.  నా మొదటి నాలుగేళ్ళు కాన్వెంట్ చదువైన, తర్వాత సర్కారు ఇంగ్లిష్
మీడియం కావటముతో ఆ భాషా మామూలుగానె వచ్చు. 
కాలేజిలొ సైన్స్ గ్రూప్ కావడంతో భాషా ఙ్ఞానముకు ప్రాధాన్యత తక్కువె. 
మెడిసెన్లో చేరాక, ఆ చదువు, హాస్టల్ జీవితములో పుస్తక పఠనం నిల్
అయింది.  ఇప్పుడిప్పుడె మళ్ళి చదవటము మొదలు పెట్టాను.
కథలు, నవలలు, కవితలు చదివినప్పుడు నేను మాత్రం అల ఎందుకు
రాయలేలనిపించెది. మా చిన్నన్న ఓ కవిత రాయటము చూసి నేను స్ఫూర్తి
పొంది రాసే యత్నం చేసాను.  ఇంటర్మిడియట్లో నేను కొన్ని కవితలు, ఓ రెండు
కథలు, నాటికలు రాసాను.  పత్రికలకు పంపిన కథలు, ఆకాశవాణికి పంపిన
నాటికలు, బాగానే వున్నాయి కాని, వారు స్వీకరించలేరని, నన్నె దాచుకొమ్మని
పంపించారు.  ఓక మూడు కవితలు మాత్రం ‘యువ వాణి’, హైద్రబాదు
ఆకాశవాణిలొ ప్రసారమైనవి.  అప్పుడు (1976) నాకు ముప్పై రూపాయల
పారితోషికము కూడ ఇచ్చారు.  ఆ మూడు కవితల్లో రెండు ఎటు పోయాయో
తెలియదు.  ఒక్కటి మాత్రం నా దగ్గర వుంది.  1999 నుండి మార్చి 21ని
ఐక్యరాజ్య సమితి ప్రపంచ కవిత్వ దినోత్సవముగ గుర్తింపు ఇచ్చినదని తెలుసు
కున్నాను.  నా చిన్ననాటి రోజులు, ఆ రాయలనె ఉత్సాహము గుర్తుకువచ్చాయి.
అందుకె నా దగ్గర వున్న ఈ కవితను మళ్ళి మీ అందరి ముందు పెడుతున్నాను.
            
                  ఆకలి
ఆకలి! ఆకలి? ఆకలి!
అమ్మా ఆకలి! అమ్మో ఆకలి!
అంతటా ఆకలి, లోకమంతటా ఆకలి!
లోకులందరికి ఆకలి.                 //ఆకలి//
బాణాలకు ఆకలి, అస్త్రాలకు ఆకలి!
కత్తీ కాటారులకు ఆకలి
అన్నీ కురిసాయ్, కొన్ని కరిచాయ్
ఎన్నో పొడిచాయ్
ఎందరినో అంతమోందించాయి,
కొందరినే మిగిల్చాయి
చివరకు
అన్ని మరుగున పడ్డాయి.    //అకలి//

విఙ్ఞానవంతులకు ఆకలి,
విప్లవాలకు ఆకలి
అందుకే
ఎన్నో కనుగొనబడ్డాయి,
కనొగొనబడుతున్నాయి
కొన్ని మారణహోమానికి దారి తీస్తె
మరెన్నో మానవకళ్యాణానికి
       తోడ్పడుతున్నాయి.   //ఆకలి//

పేదోళ్ళ ఆకలి ‘పేద్దోళ్ల’ మీదికి దండెత్తింది
కాలె కడుపులు కొన్నైన నిండినవి
కాని,
ఎన్నొ పెరిగిన బొజ్జలు
ఇంకా, ఇంకా పెరిగినవి,
ఆకలి మంటలు యింకా పెరుగుతునెవున్నయి
ఎర్రని అగ్నిశిఖలై జ్వలిస్తున్నవి!
పెరుగుట విరుగుట కొరకే!?
 

Sunday, March 17, 2013

Ruling Opposition Leader

రెడ్డి నాయుడి గెలుపు
చంద్రబాబు నాయుడు మొత్తానికి కిరణ్ కుమార్ రెడ్డి
ఋణం తీర్చుకున్నడనె చెప్పాలి.  తెలంగాణాలో 2000 వేల
మంది పోలీసులతో రక్షణ కల్పించి, పాదయాత్ర సజావుగ
సాగెటందుకు సాయం చేసాడు కిరణ్ రెడ్డి.  ఇప్పటికి
ఆంధ్రలో యాత్ర సాగే అందుకు సహకరిస్తున్నాడు.
అందుకు ప్రతిఫలంగా అవిశ్వాస తీర్మానాన్ని సరిగ్గ
చర్చకు కూడా రాకుండ తుస్సుమనిపించి కిరణ్ రెడ్డికి
మరింత అత్మవిశ్వాసాన్ని పెంచాడు చంద్రబాబు నాయుడు. 
ఎంతైనా ఆంధ్రులిద్దరు ఒక జిల్లా వారె కద!  తెలంగాణా
విషయము వస్తె ఏ పార్టి వారైన సీమాంధ్రులంతా
ఒకటైపోతారు. ఈ తెలంగాణ నాయకులకు బుద్ద్ధి
ఎప్పుడు వస్తుందో?   
           *************
కె.సి.ఆర్ అవిశ్వాసము పెడతానన్నప్పుడె అందరికి
తెలుసు అది చర్చకు రావడము కూడ డౌటెనని.
అయిన ఎందుకు పెట్టారూ?  తెలంగాణా పదమె ఉచ్చరించ
నివ్వని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తెలంగాణా గురించి మాట్లాడక
తప్పని పరిస్థితి కలిపించటము, అసెంబ్లి సాక్షిగా తెలంగాణకు
జరుగుతున్న అన్యాయాల గురించి ప్రజలకు తెలియచేయటము
సాధించారు.  ఇది TRS MLAలు అసెంబ్లిలో వుండటము
వల్లనె సాధ్యమైంది.  17 మంది ఇట్లా నిలదీయగల్లిగినప్పుడు
వంద మంది TRS MLAలు వుంటె పరిస్థితి ఎలా వుంటుంది?
KCR వ్యవహారాల పట్ల ఎంత అయిష్టత, అసహనము వున్నా
TRS తెలంగాణ పార్టిగా తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు.
              ****************
TRSతో పొత్తు పెట్టుకొని 2009లో తెలంగాణాలో సీట్లు
గెలుచుకున్న చంద్రబాబు దాన్ని‘ తోక పార్టి’ అని ఈసడించటం
తెలంగాణ ప్రజలను ఈసడించటమె.  ఈ మాట అన్న బాబుగారు
పాము తోకను తొక్కారని మర్చిపోవద్దు.  అప్పుడెప్పుడో
CM-YSR, తెలంగాణ మంత్రులు రాజీనామ ఇచ్చారంటె,
‘ఐతె ఏంటటా’ అని నవ్వారు.  మొన్నటికి మొన్న‘ తెలంగాణాకు
ఒక్క రూపాయి కూడ ఇవ్వం.  ఏం చేసుకుంటావో చేసుకోపో’, అని
అసెంబ్లి సాక్షిగ AP CM అన్నారు.  ఈ మాటలు, అట్లా
అంటున్నప్పుడు వారి హావభావాలను కూడ ప్రజలు మర్చిపోరు.
            *******************
భాష రాని వారితో ఎంత బాధనో!  తెలంగాణాలో నిలదీసి అడగటాన్నీ
‘గల్లా(కాలర్) పట్టుకొని’ అడగటమని అంటారు.  దానిని literalగ
తీసుకుని తెలంగాణ పట్ల లోపల వున్నఅయిష్టతని, వ్యతిరేకతని
ప్రజల ముందు ప్రదర్శించాడు, ఆంధ్ర సి.ఎమ్.  తెలంగాణ ప్రజలు
తెలంగాణ ఉద్యమము ద్వార చైతన్యవంతులై వాళ్ళ హక్కుల
కొరకు పోరాడుతున్నారు.  అదె విషయము హరీశ్ నోటి వెంట వచ్చింది.
అది ఒక సాకుగ తీసుకొని కిరణ్ రెచ్చిపోయి మనసులొ తెలంగాణ
పట్ల వున్న అక్కసును బైట పెట్టాడు.
              ********************
చంద్రబాబు నాయుడికి వెన్నుపోటు నాయడుగ పేరున్న సంగతి
లోకమంతా తెలుసు.  ఇప్పుడు కొత్తగ జీవతాంతము వెన్నాడె
మరో గుర్తింపు తెచ్చుకుంటున్నాడు.  రోడ్ల మీద ప్రభుత్వాన్ని దుయ్య
బడుతాడు, కాని అసెంబ్లిలో మాత్రము నిలదియ్యడు.  ఒక ప్రాంత
ప్రజల కష్టాల గురించి   ఏ మాత్రము పట్టింపు ఉండదు.  ప్రధాన ప్రతి
పక్ష నేతగ వుండి అసెంబ్లిలో ప్ర్జజల పక్షాన పోరాడక,యాత్రల మీద
యాత్రలు చేస్తున్నాడు.  ఉన్న ప్రభుత్వము తప్పులు ఇంక ఇంకా
చేయాలని, తరువాత ప్రజలు తనను తప్పక ఎన్నుకుంటారని
ఆయన నమ్మకము.  చూడబోతె బాబు మళ్ళి ఎలక్షనులు వచ్చె
వరకు పాదయాత్రలోనె వుండేట్లువుంది.  ‘పాదయాత్రల ప్రభుత్వప్రతిపక్ష
నేతగా’ చరిత్రలో నిలిచిపోతాడు.  బాబు CM కావలనె
 మనాదితో ఏమైతడో ఏమో?

Saturday, March 2, 2013

Politishuns

రాజికీయ నాయకుల్లు
ఈ రాజకీయనాయకులు ప్రజలు చాలా తెలివి తక్కువ
వాళ్ళని అనుకుంటారు.  పదవుల్లో వుండేసరికి తమను
మించిన ఘనులు లేరని భావిస్తారు.  ప్రజల వల్లె వాళ్ళకు
పదవులు వచ్చాయని మర్చిపోతారు.  అధికారంలో వున్న
వాళ్ళకు మరీ నిర్లక్ష్యం.  వాళ్ళు ఏం చేసిన, మాట్లాడిన
ప్రజలు మర్చిపోతారని అనుకుంటే పొరపాటే.  మహామహులని
కూడా ఓట్లతో ప్రజలు మట్టి కరిపించిన సంగతి ఎవరు మర్చి
పోవద్దు. 
కొందరు నాయకులు ఓ నాయకుడిని అనుసరించబోయి,
ఆయనలా colloquial భాషా మాట్లాడె యత్నంలో
తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు.  ఆ నాయకుడు
ప్రజలు ఆకుట్టు కునే విధంగా వ్యవాహరిక భాష మాట్లాడి
ప్రజలను ఉత్తేజ పరిస్తే, వీరు మాత్రం ప్రజలను హింస
ప్రోత్సహిస్తున్నట్టు మాట్లాడి, అది కరెక్ట్ అని సమర్థించు
కుంటున్నారు.  ప్రభుత్వం వాళ్ళ వారిదె కాబట్టి అంతా
చెల్లిపోతుంది.  మరొకడు సాక్షాత్తు ప్రధాన మంత్రి పట్ల
‘లు*’ అంటు అసభ్య పదజాలం వాడాడు.  దీనిపై
కనీసము ఏ ఒక్క కాంగ్రెస్ నేత స్పందించక పోవటము
చాలా విచారకరము.
 రాజకీయాల్లో ఇంత దిగజారుడు
తనము సామాన్యులకు భరించటము కష్టమౌతుంది.
వీళ్ళ ఈ ప్రవర్తన కారణంగ వారిపట్ల సామాన్యులు గౌరవం
కోల్పొతుంటే, నీచుల దుశ్చర్యలకు పరిమితి లేకుండా
పోతుంది.  నాయకులు నీచులు, దుష్టులు ఐతె వారిని
అనుసరించేవారు ఇంకింత దిగజారటములో ఆశ్చర్యమే
ముంది?
యథా రాజా, తథా ప్రజ.

Friday, March 1, 2013

Budjet - 13

బడ్జెట్ - భారం
ప్రతి యేడు బడ్జెట్ ప్రవేశ పెట్టే వారం ముందు నుండి
తర్వాత మరో వారం వరకు బోలెడు చర్చలు వుంటాయి.
ఈ సారి ఈ చర్చలు తక్కువే వినిపిస్తున్నాయి.  స్వపక్షాలు
పొగడటం, విపక్షాలు చండాడటం మామూలే.  అంత
status quo వుండటము వలన ఉత్సాహ నిరుత్సాహాలు
పెద్ద ఎత్తున వెలువరించటము లేదెవరు.
ఈ బడ్జెటులో చెప్పుకోవలసిన దెమైన వుంటె, అది ‘నిర్భయ’
ఫండ్, స్త్రీల కోసం ప్రత్యేక బాంక్.  వీటిని ఆచరణలో స్త్రీల కొరకు
ఏ విధంగ సద్వినియోగ పరుస్తారో కాలమే చెపుతుంది.
సామాన్యుడి కష్టాలు మాత్రం అలాగె వుంటాయి.  నేటి పెట్రోలు
ధర పెంపు, కరెంటు కోతలు సామాన్యుడి జీవితాన్ని మరో
మెట్టు దిగజార్చింది.
బడ్జెటులో వివిధ ప్రణాళిక, ప్రణాళికేతేర వ్యయం ఎంత వున్నా
అందులో 50% శాతం కంటే ఎక్కువ రాజకీయనాయకుల
బొక్కసాల్లోకి, మరి కొంత బ్యూర్యోక్రాట్ల గల్లాల్ల్ల్లోకి వెళితె
అభివృద్దికై వెచ్చించెదెంతో?  ప్రజలకోసం వెచ్చించాల్సిన డబ్బు
కనీసము 50% అయిన సద్వినియోగం ఐతె ఈ దేశం
ఎప్పుడో అభివ్రుద్ధి చెందిన దేశము అయి వుండేది కాదా?