ఏసయ్యా, ఓ ఏసయ్యా!
ఏసయ్యా, మా ఏసయ్యా!
మా దండాలయ్యా నీకు,
శతకోటి దండాలు నీకు. //ఏసయ్య//
దేవుని కొడుకువు నీవు
మాపై దయ తలచి వచ్చావు,
దీనులకు దిక్కైన నీవు
మా దెవుడ వైనావయ్యా! //ఏసయ్య//
ప్రేమ పంచగ వచ్చిన
ఓ ప్రేమ మూర్తి,
మా రారాజువు నీవేనయ్య
ముళ్ళ కీరీటమె ధరించి
మాలో కరుణనే పెంచిన
కారుణ్యధాముడివి నీవెనయ్యా. //ఏసయ్య//
కష్టాలె గట్టెక్కించి,కన్నీళ్ళె తుడిచిన
ఓ కారుణ్యమూర్తి!
శిలువను మోసి, దానిపై నీ రక్తన్నెచిందించి
మా గుండెల్లొ దయనే ప్రసరించిన
దయామూర్తివి నీవయ్య! //ఏసయ్య//
మాకై జన్మించిన మహితాత్ముడా!
మాకై మరణించిన మరియ తనయ
మా జీవన జ్యొతివి నీవు,
ఆ పరమాత్మ స్వరూపుడవే నీవు! //ఏసయ్య//

No comments:
Post a Comment