Wednesday, March 20, 2013

My poetry

 ఙ్ఞాపకాలు
చిన్నప్పటి నుండి పుస్తకాలు చదవటము నాకు అలవాటు.
రెండొ తరగతి వరకు స్కూల్లో మామూలు మార్కులు
వచ్చెవి.  క్లాసులో ఫర్స్ట్, సెకెండ్ వచ్చిన అమ్మాయి ప్రొగ్రెస్
 కార్డ్ తీసుకునెటప్పుడు అందరిని చప్పట్లు కొట్టమనె వారు
టీచర్.  నేను నా రిపోర్ట్ తీసుకునెటప్పుడు అందరు చప్పట్లు
ఎందుకు కొట్టట్లెదొ నాకు తెల్వక చిన్నబుచ్చుకునె దాన్ని. 
మూడో తరగతి నుండి అ కిటుకు నాకు తెల్సినంక ఇక స్కూల్లో
నేను ఎప్పుడు చప్పట్ల మధ్యనె నా రిపోర్ట్ సగర్వంగా తీసుకునె
దాన్ని.
అప్పటి నుండే నాకు చదువు పట్ల ఆసక్తి పెరిగింది.  అప్పట్లొ
ఎవరికైన చదవటం ఇష్టం వుండదంటే చాల విచిత్రమనిపించేది.
నేనైతె ఏ పుస్తకము దొరికితె అది చదివేదాన్ని.  పరిస్థితుల
ప్రభావమువల్ల నేను నాల్గో తరగతి చదవకుండ ఇంట్లోనె వుండాల్సి
వచ్చింది.  మా ఇంట్లో రామాయణ భారతాలు, పతివ్రత కథలు కాశి
మజిలి కథలు వంటి పుస్తకాలు వుండేవి.  ఆ సమయంలో అవి అన్ని
చదివాను.  చందమామ, బాలమిత్ర చదవటానికి మా అక్కచెల్లెల్లు, అన్న
దమ్ముల్ల్ల మధ్య పోటి, కొట్లాట వుండేది.  ఇంట్లొ అంత తెలుగు చదవటము
వల్ల, ఇంగ్లిషు మీడియం స్కూలైన నాకు తెలుగులో చదవటమే బాగ అలవాటు
అయింది.  నా మొదటి నాలుగేళ్ళు కాన్వెంట్ చదువైన, తర్వాత సర్కారు ఇంగ్లిష్
మీడియం కావటముతో ఆ భాషా మామూలుగానె వచ్చు. 
కాలేజిలొ సైన్స్ గ్రూప్ కావడంతో భాషా ఙ్ఞానముకు ప్రాధాన్యత తక్కువె. 
మెడిసెన్లో చేరాక, ఆ చదువు, హాస్టల్ జీవితములో పుస్తక పఠనం నిల్
అయింది.  ఇప్పుడిప్పుడె మళ్ళి చదవటము మొదలు పెట్టాను.
కథలు, నవలలు, కవితలు చదివినప్పుడు నేను మాత్రం అల ఎందుకు
రాయలేలనిపించెది. మా చిన్నన్న ఓ కవిత రాయటము చూసి నేను స్ఫూర్తి
పొంది రాసే యత్నం చేసాను.  ఇంటర్మిడియట్లో నేను కొన్ని కవితలు, ఓ రెండు
కథలు, నాటికలు రాసాను.  పత్రికలకు పంపిన కథలు, ఆకాశవాణికి పంపిన
నాటికలు, బాగానే వున్నాయి కాని, వారు స్వీకరించలేరని, నన్నె దాచుకొమ్మని
పంపించారు.  ఓక మూడు కవితలు మాత్రం ‘యువ వాణి’, హైద్రబాదు
ఆకాశవాణిలొ ప్రసారమైనవి.  అప్పుడు (1976) నాకు ముప్పై రూపాయల
పారితోషికము కూడ ఇచ్చారు.  ఆ మూడు కవితల్లో రెండు ఎటు పోయాయో
తెలియదు.  ఒక్కటి మాత్రం నా దగ్గర వుంది.  1999 నుండి మార్చి 21ని
ఐక్యరాజ్య సమితి ప్రపంచ కవిత్వ దినోత్సవముగ గుర్తింపు ఇచ్చినదని తెలుసు
కున్నాను.  నా చిన్ననాటి రోజులు, ఆ రాయలనె ఉత్సాహము గుర్తుకువచ్చాయి.
అందుకె నా దగ్గర వున్న ఈ కవితను మళ్ళి మీ అందరి ముందు పెడుతున్నాను.
            
                  ఆకలి
ఆకలి! ఆకలి? ఆకలి!
అమ్మా ఆకలి! అమ్మో ఆకలి!
అంతటా ఆకలి, లోకమంతటా ఆకలి!
లోకులందరికి ఆకలి.                 //ఆకలి//
బాణాలకు ఆకలి, అస్త్రాలకు ఆకలి!
కత్తీ కాటారులకు ఆకలి
అన్నీ కురిసాయ్, కొన్ని కరిచాయ్
ఎన్నో పొడిచాయ్
ఎందరినో అంతమోందించాయి,
కొందరినే మిగిల్చాయి
చివరకు
అన్ని మరుగున పడ్డాయి.    //అకలి//

విఙ్ఞానవంతులకు ఆకలి,
విప్లవాలకు ఆకలి
అందుకే
ఎన్నో కనుగొనబడ్డాయి,
కనొగొనబడుతున్నాయి
కొన్ని మారణహోమానికి దారి తీస్తె
మరెన్నో మానవకళ్యాణానికి
       తోడ్పడుతున్నాయి.   //ఆకలి//

పేదోళ్ళ ఆకలి ‘పేద్దోళ్ల’ మీదికి దండెత్తింది
కాలె కడుపులు కొన్నైన నిండినవి
కాని,
ఎన్నొ పెరిగిన బొజ్జలు
ఇంకా, ఇంకా పెరిగినవి,
ఆకలి మంటలు యింకా పెరుగుతునెవున్నయి
ఎర్రని అగ్నిశిఖలై జ్వలిస్తున్నవి!
పెరుగుట విరుగుట కొరకే!?
 

No comments:

Post a Comment