Tuesday, July 30, 2013

Konda Surekha

రాజకీయ చదరంగము
రాజకీయాలు అంటె నాకు కాస్త అసక్తి.  ఎవరెవరు ఏమి మాట్లాడు
తున్నారు, ఎట్లా వ్యవహరిస్తున్నారు అన్నదానిని ఫాలో
అవుతుంటాను.  రాజకీయాల్లో వున్న స్త్రీలంటె నాకు ప్రత్యేక
అభిమానము.  రాజకీయాలు ఎక్కువగ పురుషుల సామ్రాజ్యం
కిందే లెక్క.  ఇందులో స్త్రీలు నిలదొక్కుకోవటమన్నది గొప్ప
విషయమే.  అందులోను బిసి, ఎస్సి  స్త్రీలు వుండటమన్నది చెప్పుకో
దగ్గ విషయమె.  వరంగల్లు జిల్లాలో రాష్ట్రస్థాయి, మళ్ళి మాట్లాడితె
జగన్ కోసము మంత్రి పదవిని, ఆ తర్వాత ఎంఎల్ ఏ పదవిని
కూడా తృణప్రాయంగా త్యజించి, జగన్ మానుకోట ఓదార్పు యాత్రకు
తెలంగాణ ప్రజల వ్యతిరేకతను దాడిని తట్టుకొన్న నిఖార్సైన
రాజశేఖర్ రెడ్డి అభిమానిగా, జగన్ను ముఖ్యమంత్రిని చేసెందుకు తన
వ్యక్తిగత, రాజకీయ భవిష్యత్తును ఫణంగా పెట్టిన తెలంగాణ బిసి మహిళగా
జాతీయ ఖ్యాతిని పొందిన మహిళ శ్రీమతి కొండ సురేఖ.
తెలంగాణ బిసి మహిళగ  రాజకీయల్లో సమర్థవంతంగా నిలదొక్కుకొని
స్థానికంగా ప్రజల మధ్య వుంటు వారి అభిమానానికి పాత్రురాలౌతు
మంత్రి పదవి పొందిన ఆమె అంటె నాకు చాలానే గౌరవము,
అభిమానము.  ఆమె తెలంగాణకు వ్యతిరేకత వున్న YSR తో
వుండటము రాజ కీయాల్లో వున్నఅనివార్యతగా అనుకునేదానిని.
కాని ఆమె తన మంత్రి పదవికి రాజీనామా చేయటము చాలానే
బాధించింది.  ఆ రాజీనామా చేసి అమె ఎన్నుకున్న ప్రజలకు
ద్రోహము చేయటమే కాదు, వరంగల్లు జిల్లా ప్రజలకు కూడా
అన్యాయము చేసింది.  పేరు చివర తోకలున్న ఏ మంత్రి కూడా
రాజశేఖర్ రెడ్డి కోసము గాని, జగన్ CM కావలని కాని రాజీనామా
చేయలేదు.  ఒక బిసి మహిళ మాత్రము పావుగా మారింది.
రాజీనామా చేసి స్వంత ప్రజలకు, ప్రాంతానికి దూరము కావటమే
కాకుండ, ఘనమైన భవిష్యత్తును,రాజకీయ భవిష్యత్తును కోల్పోయింది.
రాజకీయ చదరంగములో కేవలము జెండాలు మోసెవారుగానె బిసిలు
మిగిలిపోతున్నారు.  ఎవరో ఒకరిద్దరు కాస్తా ఎదిగినా తోకల పాములు
ఎదో రకంగా వారిని మింగేస్తుంటాయి.  అది తట్టుకొని ఎదిగె
వారు కొద్దిమందె.  వారిలో శ్రీమతి కొండా సురేఖ ఒక్కరు కావాలని నేను
మనసారా కోరుకుంటున్నాను.  ఇప్పటి వరకు నేర్చుకున్న రాజకీయ
పాఠాలతో జాతీయ స్థాయిలో ఆమె ముందడుగు వేస్తుందని ఆశిస్తున్నాను.

29th Indian State

వచ్చేస్తుందా?
రాష్ట్రములో ఏదో అయితుందనే అనిపిస్తుంది.
కాని ఖచ్చితంగాఎలా వుంటుందో చెప్పలేం.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, కొత్త రాష్ట్ర ఏర్పాటు
కానేకాదు.  ఆంధ్ర వాళ్ళమాయాజాలములో,
మోసాల ఊబిలో చిక్కుకు పోయిన హైదరాబాదు
రాష్ట్రము తిరిగి స్వంత అస్తిత్వాన్ని సంతరించు
కుంటుంది. అంతే.  దీనికి ఆంధ్రవాళ్ళుబాధపడాల్సింది
ఏమి వుండదు.  ఆంధ్ర యువత, వాళ్ళు ఏమైనా
కోల్పోయారనుకుంటే, దానికి కారణము వారి పెద్దలె
అని తెలుసుకోవాలి.  వారి పెద్దల మోసకారితనము,
దుర్నితి, దురాశ, ద్రోహబుద్ధి, దురహంకారమే కారణమని
తెలుసుకోవాలి. తెలుగు వారు రెండు లేదా మూడు రాష్ట్రాలలో
వుంటె, అది వారి ఘనతగా తెలుసుకొని సుహృద్భావముతో
మెలిగితె, దక్షిణభారతములో తెలుగువారు ఒక దృడమైన
శక్తిగా ఎదుగుతారు. తెలుగువారు ఆంధ్రప్రదేశ్ లోనె
కాక కర్ణాటక, మహారాష్ట్ర, చెన్నై, ఒరిస్సా రాష్ట్రాల్లో కూడా
వున్నారు.  తెదేపా నాయకుడు ఏ మాత్రము రాజకీయ
చతురతతోపాటు దూరదృష్టి వున్నా, అప్పుడె తెలంగాణకు
అడ్డుపడక సహకరించి వుండివుంటే దక్షిణ భారతములో
తెలుగు వారి పార్టీగా ఎంతో చక్కగ ఎదిగే అవకాశము
వుండేది.  కాని ఇప్పుడు అతడు ఒక వెన్నుపోటు
నాయకుడిగ మాత్రమె చరిత్రలో మిగిలిపోతాడు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి రాజీనామా చేసె వుద్దేశము
వుందంట. మునిగి పోయెదేమి లేదు.  ఉపముఖ్యమంత్రి
తాత్కాలికి ముఖ్యమంత్రి కావచ్చనుకుంటా.  కేసిఆర్
అన్నట్టు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి దళితుడు అన్న
వాక్కు కూడ నిజమౌతుంది.

జై తెలంగాణ ! జయహో తెలంగాణ !!

Friday, July 26, 2013

Telangana

సశేషం
ఏదో జరుగుతున్నట్టె వుంది. హస్తినాలో హడావుడి, కాంగ్రేసు
నాయకుల అలజడి, వైకాపాలో విచిత్ర డ్రామాలు, అంతా రాష్ట్రములో
ఏదో జరుగుతుందనే అనిపిస్తుంది.  అది ఏమిటి, ఏలా వుంటుంది -
అంతా ఊహాగానాలే.  తెలంగాణ ఇచ్చెస్తుందేమో, వచ్చెస్తుందేమో అని
కోస్తాంధ్ర నాయకులు వారి కుళ్ళు, కుతంత్రాలను బైట పెట్టుకుంటున్నారు.
ప్రభుత్వస్కూలు పిల్లలను, రాజకీయ కార్యకర్తలను పెట్టుకొని సమైక్య
ఉద్యమము చేస్తున్నరు, చేయిస్తన్నరు.  ఆంధ్రలో ఆంధ్రోళ్ళు చేసె
ఉద్యమము ఆంధ్ర ఉద్యమము అవుంతుందే కాని సమైక్య ఉద్యమము
ఎట్ల అయితుంది?  తెలంగాణ వాళ్ళు "మా బతుకు మమ్మల్ని
బతకనీయండి", అని ఎంత మోత్తుకుంటున్నా, "లేదు మాతో కల్సి
వుండాల"ని అనే ఆంధ్రోళ్ళను ఏమనుకోవాలి.  వాళ్ల పెత్తనము
తెలంగాణ ప్రజలు ఎన్నాళ్ళు భరించాలి?  ఇకనైనా వాళ్ళు వాళ్ల
బతుకులు బతకని తెలంగాణ వారిని వాళ్ళ తిప్పలు వాళ్ళు పడని.
ఈ కృత్రిమ, బలవంతపు ఉద్యమాలు మాని ఆంధ్రోళ్ళు రాబోయె
రాష్ట్రములో వాళ్ళ రాజధాని నిర్మాణాని గురించి ఆలోచనలు మొదలు
పెడితె బాగుంటుందనుకుంటా.
అరవై ఏండ్ల బట్టి జరుగుతున్న ఈ తెలంగాణ పోరు ఇకనైన ఓ కొలిక్కి
వస్తుందని ఆశించొచ్చా?  ఏమో?  నిర్ణయము రావటమే కాదు, అది
అమలు అయ్యెవరకు నమ్మటము కష్టమె.  వేఏఏఏఏఏఏఏఏఏఏఏచి
చూఊఊఊఊఊఊఊఊఊఊఊఊద్దాం.
జై తెలంగాణ!  జయహో తెలంగాణ!

Wednesday, July 10, 2013

Road to Destination

దారి దరి చేర్చేనా?
మళ్ళీ తెలంగాణ వేడి సెగలు కక్కుతునట్టుంది.  తెలంగాణ వచ్చుడె
ప్పుడో తెలియదు కాని, పిల్లల ప్రాణాలైతె పోతున్నయి.  ఓట్ల రాజ
కీయాలు ప్రజల బ్ర్తతుకులను ఛిద్రము చేస్తున్నయి.  పదవులకోసం
పవరు కోసము విషయాన్ని తెల్చకుండా, తేలనివ్వకుండా పార్టీలన్ని
దొంగాట లాడుతున్నయి.  తెలంగాణ కోసము కేసిఅర్ - తెరాస
పన్నెండళ్లనుండి ఉద్యమాన్నిచల్లారనివ్వకుండా, అప్పుడప్పుడు
కేంద్రానికి వేడి పుట్టిస్తు, ముందుకు నడుపుతున్నాడు.  కెసిఆర్
అంటె ఇష్టమున్నా, లేకున్నా అతనికి మించిన చతురత కలిగి,
తెలంగాణ పట్ల ఆ మాత్రము చిత్తశుద్ధి వున్న నాయకులు
ప్రస్తుతానికి లేరనె చెప్పాలి.  జెఎసి కూడ సంపూర్ణ శక్తితో
తెలంగాణ సాధన వ్యూహలు రచిస్తుంది.  ఇతర అనుబంధిత
సంఘాలు కూడ చేతనైన కృషి చేస్తున్నాయి.  రాజకీయ మనుగడ
కోసము తె.కా నాయకులు అప్పుడప్పుడు ఉద్యమల్లో ప్రత్యక్షంగా
పాల్గొనక పోయిన మద్దతు తెలుపుతునే వున్నారు.  తెదెపా వారినె
ఎటు నమ్మలేకుండా వుంది.  కాంగ్రేసు వారు ‘తెలంగాణ తెచ్చెది మేమె,
ఇచ్చేది మేమె’, అంటె, ‘మాదేమి లేదు, కాంగ్రేసే నిర్ణయించాలి’ అని
తె తెదెపా నాయకులు తప్పుకుంటున్నారు.
‘సీమాంధ్ర, తెలంగాణ నా రెండు కళ్ళ’నే చంద్రబాబు, ఓ కంటిలో లాఠీలు
పోడుస్తున్నా, తూటాలు దిగుతున్నా, కన్నీళ్లు కారి కాటీ పాలైతున్న
అసెంబ్లిలో ఆ విషయమై ఎప్పుడైనా నిలదీశాడా?  తెలంగాణకు వ్యతిరేకము
కాదనే ప్రధాన ప్రతిపక్ష నేతైన చంద్రబాబు తెలంగాణాలో ఉద్యమాలౌతుంటె
రోడ్లు పట్టుకొని తిరిగాడే కాని కేంద్రముపైన ఎప్పుడైన ఈ సమస్య తొందరగా
తేల్చమని వత్తిడి చేసాడా?  ఇపుడైనా తనను గెలిపిస్తె కేసులు ఎత్తివేస్తాను,
ఉద్యోగాలు ఇస్తానంటున్నాడె కాని తెలంగాణ ఎర్ఫాటుకు తన సహకారమంది
స్తానంటున్నాడా?  వరంగల్లు వచ్చిన చంద్రబాబు అమరవీరులకు నివాళులు
అర్పించాడని అంటున్నారు కదా!  సభాస్థలి దగ్గర ఓ అట్ట నమూనా స్థూపము
పక్కన నిలబడితె అతని చిత్తశుద్ధి తెలంగాణ వారికి అర్థం కాదా!  బిషప్ బెరెట్టా
స్కూలుకు వచ్చిన బాబుకు అక్కడి నుండి 2 కి.మి. దగ్గరలో వున్నా స్థూపము
దగ్గరకు రాలేందంటే అతనికి అమర వీరుల పట్ల వున్న గౌరవము అర్థమౌతుంది.
ఈ రాజకీయనాయకులు ఇప్పటికైన ప్ర్జజల జీవము, జీవతాలపట్ల కాస్తైన
అభిమానము గౌరవము వుంటె తెలంగాణపై తేల్చివేయాలి.
కాంగ్రేసు తొందరలోనె తేలుస్తుందనుకుంటున్న సమయములో సీమాంధ్ర
 నాయకులు మీటింగులు పెట్టి కేసిఅర్ ను, తెరాసను, జెఎసిని తిట్టుతు
వాళ్ళే తెలంగాణ సాధించుకుంట్టున్నారనే వాస్తవాన్ని ఒప్పేసుకుంటున్నారు.
తెలంగాణ వస్తె అది తెలంగాణ ఉద్యమ రాజకీయ పార్టీ, ప్రజా జెఎసిల
ఘనత.  ఇప్పుడైనా, మరికొన్నాళ్ళకో, ఏళ్లకో తెలంగాణ రావలసిందె.
తెలంగాణ ప్రజలు అది సాధించుకుంటారు.

జై తెలంగాణ! జయహో తెలంగాణ!!