దారి దరి చేర్చేనా?
మళ్ళీ తెలంగాణ వేడి సెగలు కక్కుతునట్టుంది. తెలంగాణ వచ్చుడె
ప్పుడో తెలియదు కాని, పిల్లల ప్రాణాలైతె పోతున్నయి. ఓట్ల రాజ
కీయాలు ప్రజల బ్ర్తతుకులను ఛిద్రము చేస్తున్నయి. పదవులకోసం
పవరు కోసము విషయాన్ని తెల్చకుండా, తేలనివ్వకుండా పార్టీలన్ని
దొంగాట లాడుతున్నయి. తెలంగాణ కోసము కేసిఅర్ - తెరాస
పన్నెండళ్లనుండి ఉద్యమాన్నిచల్లారనివ్వకుండా, అప్పుడప్పుడు
కేంద్రానికి వేడి పుట్టిస్తు, ముందుకు నడుపుతున్నాడు. కెసిఆర్
అంటె ఇష్టమున్నా, లేకున్నా అతనికి మించిన చతురత కలిగి,
తెలంగాణ పట్ల ఆ మాత్రము చిత్తశుద్ధి వున్న నాయకులు
ప్రస్తుతానికి లేరనె చెప్పాలి. జెఎసి కూడ సంపూర్ణ శక్తితో
తెలంగాణ సాధన వ్యూహలు రచిస్తుంది. ఇతర అనుబంధిత
సంఘాలు కూడ చేతనైన కృషి చేస్తున్నాయి. రాజకీయ మనుగడ
కోసము తె.కా నాయకులు అప్పుడప్పుడు ఉద్యమల్లో ప్రత్యక్షంగా
పాల్గొనక పోయిన మద్దతు తెలుపుతునే వున్నారు. తెదెపా వారినె
ఎటు నమ్మలేకుండా వుంది. కాంగ్రేసు వారు ‘తెలంగాణ తెచ్చెది మేమె,
ఇచ్చేది మేమె’, అంటె, ‘మాదేమి లేదు, కాంగ్రేసే నిర్ణయించాలి’ అని
తె తెదెపా నాయకులు తప్పుకుంటున్నారు.
‘సీమాంధ్ర, తెలంగాణ నా రెండు కళ్ళ’నే చంద్రబాబు, ఓ కంటిలో లాఠీలు
పోడుస్తున్నా, తూటాలు దిగుతున్నా, కన్నీళ్లు కారి కాటీ పాలైతున్న
అసెంబ్లిలో ఆ విషయమై ఎప్పుడైనా నిలదీశాడా? తెలంగాణకు వ్యతిరేకము
కాదనే ప్రధాన ప్రతిపక్ష నేతైన చంద్రబాబు తెలంగాణాలో ఉద్యమాలౌతుంటె
రోడ్లు పట్టుకొని తిరిగాడే కాని కేంద్రముపైన ఎప్పుడైన ఈ సమస్య తొందరగా
తేల్చమని వత్తిడి చేసాడా? ఇపుడైనా తనను గెలిపిస్తె కేసులు ఎత్తివేస్తాను,
ఉద్యోగాలు ఇస్తానంటున్నాడె కాని తెలంగాణ ఎర్ఫాటుకు తన సహకారమంది
స్తానంటున్నాడా? వరంగల్లు వచ్చిన చంద్రబాబు అమరవీరులకు నివాళులు
అర్పించాడని అంటున్నారు కదా! సభాస్థలి దగ్గర ఓ అట్ట నమూనా స్థూపము
పక్కన నిలబడితె అతని చిత్తశుద్ధి తెలంగాణ వారికి అర్థం కాదా! బిషప్ బెరెట్టా
స్కూలుకు వచ్చిన బాబుకు అక్కడి నుండి 2 కి.మి. దగ్గరలో వున్నా స్థూపము
దగ్గరకు రాలేందంటే అతనికి అమర వీరుల పట్ల వున్న గౌరవము అర్థమౌతుంది.
ఈ రాజకీయనాయకులు ఇప్పటికైన ప్ర్జజల జీవము, జీవతాలపట్ల కాస్తైన
అభిమానము గౌరవము వుంటె తెలంగాణపై తేల్చివేయాలి.
కాంగ్రేసు తొందరలోనె తేలుస్తుందనుకుంటున్న సమయములో సీమాంధ్ర
నాయకులు మీటింగులు పెట్టి కేసిఅర్ ను, తెరాసను, జెఎసిని తిట్టుతు
వాళ్ళే తెలంగాణ సాధించుకుంట్టున్నారనే వాస్తవాన్ని ఒప్పేసుకుంటున్నారు.
తెలంగాణ వస్తె అది తెలంగాణ ఉద్యమ రాజకీయ పార్టీ, ప్రజా జెఎసిల
ఘనత. ఇప్పుడైనా, మరికొన్నాళ్ళకో, ఏళ్లకో తెలంగాణ రావలసిందె.
తెలంగాణ ప్రజలు అది సాధించుకుంటారు.
జై తెలంగాణ! జయహో తెలంగాణ!!

No comments:
Post a Comment