తెలంగాణ వచ్చేస్తుందా!?!????!!!!!
వస్తుంది, వస్తుంది, వచ్చేస్తుందని అంటున్నారు. ఇట్లా వినబట్టి
పదేళ్ళు కావస్తుంది. రోజుల గడువు పెట్టారు. వారాలన్నారు,
పండగలన్నారు, ఓ పండగ కాకపోతే మరో పండగకు గడువు
పెంచారు, ప్రతి పండగ మళ్ళీ యేడు తెలంగాణలోనే నన్నారు,
జనవరి ఫస్టన్నారు, పార్లమెంట్ సమావేశాలు - శీతాకాలము
కాకపోతే ఎండని, వానని అన్నారు, ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల
కాని అన్నారు, ఉద్యమముంటె చల్లబడాలన్నారు, నెలంటె
నెలకాదన్నారు, చర్చలు, చర్చోపచర్చలన్నారు, రాష్ట్రమివ్వట
మంటే ఇన్‍స్టంట్ కాఫి కాదు, అట్టు పోసినట్టు కాదు, బీడి
ఇచ్చినట్టు కాదు, ఇడ్లి తిన్నట్టు కాదు, యాభై ఏళ్ల సమస్య
అంత తేలికది కాదన్నారు. పార్టీల్లో ఏకాభిప్రాయం కావాలన్నారు.
అధిష్టానల ఇష్టమన్నారు, ప్రజలే మా అధిష్టానమన్నారు. రాజీ
నామాల డ్రామాలాడారు. రాజీనామాలు చేసి గెలిచినా సెంటిమెంట్
అని పక్కన పెట్టారు. పూటాకో మాట, రోజుకో దాటవేత, నెలకో
లీకులతో ఆశ నిరాశల మధ్య ఎన్ని యువ ప్రాణాలు గాలిలో కలి
శాయో! రాజకీయ నాయకులు పరస్పర విరుద్ధ స్టేట్‍మేంటులిస్తు
ఉద్వేగాల వేడిలో రాజకీయ పునాదులను పటిష్టము చేసుకుంటు
పదవుల పొందుతు, ఆస్తులు పెంచుకున్నారు.
ఇప్పుడిక రాష్ట్రములో అన్నిస్థాయిల్లో ఎన్నికలు దగ్గరపడ్డాయి.
మరి ఓట్లు దండుకోవాలి కదా! సో, కొత్త ప్రణాళికలు మొదలైనట్టున్నాయి.
చర్చలన్ని అయిపోయినాయట! తెలంగాణ ప్రకటించటమే తరువా
యంటున్నారు. ఇప్పుడు మాట తప్పితే కాంగ్రేసుకు ఓట్లగతులుండవు.
తెలంగాణ ప్రజల దృష్టిలో ఎప్పటికి దిగజారి పోతుంది. పాతాళానికి
జారుతుంది. భవిష్యత్తులో కోలుకునే ప్రశ్నె వుండదు. ఇప్పుడు
ఆ పార్టీ నాయకులు చేస్తున్న ఆర్భాటమంత పేలని లక్ష్మి ఆటంబాంబులా
తుస్సు మంటుందా లేక ఖచ్చితమైన నిర్ణయముంటుందా కాలమే
చెప్పాలి. ఇది తెలంగాణలో కాంగ్రేసు 'make or break' stage.
Nobody is excited. Though hoping best to happen,
Telangaanites have just kept there fingers crossed.
జై తెలంగాణ, జై జయహో తెలంగాణా !

No comments:
Post a Comment