చలో అసెంబ్లీ
‘చలో అసెంబ్లీ’ రేపే. ఆంధ్ర ప్రభుత్వము చేపడుతున్న కార్య
క్రమాలు చూస్తుంటే ‘చలో అసెంబ్లీ’ అల్రెడి సక్సెస్ అయిందనే అనాలి.
గడపగడపకు ఆంక్షలు, వాడవాడల నిర్బంధాలు, ఊరూరుకీ
చెక్ పోస్టులు, సైకిలు మీద పోయెవాడినుండి, రైళ్ళలో ఎక్కిదిగే
వాళ్ళందరిని ఆరాలు తీసుడు, ద్విచక్ర, త్రిచక్ర చతుష్‍చక్ర వాహనా
లన్ని సోదాలు, నాయకుల బైండొవర్లు, గృహ నిర్బంధాలు,
కార్యకర్తల అరెస్టులు, సామాన్య ప్రజలకు హెచ్చరింపులు,
ఉద్యోగులు, విధ్యార్థులకు బెదిరింపులు, నిర్బంధాలు - ఎమర్జెన్సి
తలంపించె పరిస్థితులు. ఇంత నిరంకుశంగా ప్రభుత్వము వ్యవహ
రిస్తున్నా ఉద్యమకారుల్లో ఎంతో మంది ధైర్యసాహాసలు, నిబద్ధత
వున్నవాళ్ళు అన్నింటికి తెగించి, చలో అసెంబ్లీలో పాల్గోంటారు.
ఒక్క ఉద్యమకారుడు వచ్చాడంటే వెయ్యి మంది వచ్చినట్లె.
చలో అసెంబ్లలో భాగస్వాములు కావలని వున్నా, పోలీసుల
భయానికి రాలేని వాళ్ళకు మనస్సులో ఎంతో బాధ వుంటుంది.
ఆంధ్ర ప్రభుత్వము పట్ల వున్న వ్యతిరేకత పదింతలై తెలంగాణ
పార్టీని తప్పనిసరిగ గెలుపించుకోవాలనే పట్టుదల మరింత బల
పడుతుంది.
ఈ ఆంధ్ర ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలవల్ల ఆ ప్రభుత్వము
పట్ల తెలంగాణ ప్రజలకు మరింత వ్యతిరేకత పెరుగుతుంది,
తెలంగాణ సాధించుకోవాలనె భావన మరింత బలపడుతుంది.
రవాణా సౌకర్యాలు బంద్ చేసి, కర్ఫూ విధించి, చలో అసెంబ్లీకి
ఎవరు రాలేదని మురిసిపోవటము పిల్లి కళ్ళు మూసుకొని పాలు
తాగటమే. అణిచివేత తీవ్రత ఎంత ఎక్కువ వుంటె దానికి పదింతలు
ఉద్యమ స్ఫూర్తి పెరుగుతుంది.
తెలంగాణ ప్రజలు తెలంగాణ పార్టీని గెలిపించుకొని తమ అస్తిత్వాన్ని
చాటుకునే రోజులు దగ్గరలోనే వున్నాయి.
జై తెలంగాణ, జయహో తెలంగాణ!

No comments:
Post a Comment