కౌమారము - లైంగికారోగ్యము
ఈ మధ్యె ఒకమ్మాయి నా దగ్గరకు వచ్చింది, నెల మీద వారం
రోజులు దాటింది, ముట్టు రాలేదని. "సరే. మూత్ర పరీక్ష చేసుకో",
మన్నాను. అది కాస్త పాజిటివ్ వచ్చింది. గర్భవతివని చెప్పాను.
"పీరియడ్ వచ్చెట్టు మందులివ్వండి", వెంట వచ్చిన మగవాడడిగాడు.
ఆమెను పరీక్ష చేసాక చెపుతానన్నాను. అతన్ని బైటకు పంపి
అమ్మాయిని పరీక్ష చేస్తు మరిన్ని ప్రశ్నలడిగాను.
అమ్మాయి వయస్సు పదిహేడు, ఇంటర్ రెండో సంవత్సరంలోకి
వచ్చింది, తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు, ఆ వచ్చినతను
ఆమెకు బావ(?) కావాలి, అతను వడ్రంగి పని చేస్తుంటడు, పెళ్ళి
మరో రెండెళ్ళకని తెలుసుకున్నాను. ఆమెకు రక్తం తక్కువ వుందని,
నెల తప్పిన లక్షణాలు వున్నట్లు నిర్ధారించుకున్నాను.
అతన్ని పిలిచి, "అమ్మాయి గర్భవతి, గర్భస్రావము చేసుకోవడానికి మందులు
వాడడానికి ముందు రక్త పరీక్షలు చేసుకోవాల", ని చెప్పాను.
ఇంకా రెండెళ్ళవరకు పెళ్ళి చేసుకోనప్పుడు కొద్ది జాగ్రత్త తీసుకోవాలి కదా",
ఓ మాట అన్నాను. "అందుకే తీసుకొచ్చాను", ఒక క్షణం ఆగి, "నా భార్యకు
టి బి వుంది, అమెతో కల్సివుంటే నాక్కుడ వస్తుందా?" అడిగాడు. ఒక
లిప్త కాలం నాకు చాలా కోపం వచ్చింది. ఆ అమ్మాయికి ఈ విషయం తెలుసా
అన్నట్టు చూసాను. "నీకు ముందు జీవతము చాలా వుంది. జాగ్రత్తగా వుండాలని"
నేనన్నాను. వాళ్ళు వెళ్ళి పోయి మరునాడు రక్త పరీక్ష రిపోర్టులతో వచ్చారు.
ఆమె రక్తములో హిమోగ్లోబిన్ శాతము 7గ్రా%. వుండాల్సిందానికి 50%
కంటే తక్కువె. అంటె అమే ఆరోగ్యమ్ కాస్తైన బాగుండాలంటె వెంటనె రక్తము
ఎక్కించుకోవల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలొ అబార్షన్ చేయటము
ప్రాణాపాయమె. ఆమెను నేను బోధనాసుపత్రికి వెళ్లమని చెప్పాను.
ఈ సందర్భములో సమస్యలు ఎన్నివున్నా ఆరోగ్య విషయము గురించి
ప్రస్తుతము చెప్పుకుందాము. ఓ ఇరవై ఏళ్ళ కింద పెళ్ళి కాని అమ్మాయి
గర్భవతని వస్తె వైద్యంతోపాటు నీతి పాఠాలు చెప్పటము కూడ జరిగెది.
అబార్షను చేసెటప్పుడు తల్లిదండ్రులు తప్పనిసారిగ వుండలని నిక్కచ్చిగ
చెప్పేదానిని. కాని ఇప్పుడు కాలానుగుణంగా మారాల్సి వచ్చింది. ఇప్పుడు
18 సం. లోపు వాళ్ళైతేనె తల్లిదండ్రులు వుండాలని అడుగుతున్నాము. అలాగే
ఇదివరకు పెళ్లికాని పిల్లలకు గర్భనిరొధక పద్ధతుల గురించి చెప్పటము అన్నది
నీతిమాలిన పని. ఇప్పుడు అమ్మాయిలు వచ్చి అడిగితె గర్భనిరోధక పద్ధతులు
చెప్పి అలాగె లైంగిక ఆరోగ్యము గురించి కూడా వివరించి చెప్పటము జరుగుతుంది.
కౌమారదశలో అమ్మాయిలు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. ఈ దశలో పున
రుత్పత్తి అంగాలు పరిపక్వత చెందనందువలన ఇన్ఫెక్షన్ వచ్చె అవకాశాలు ఎక్కువ
వుంటాయి. దాని ప్రభావము ముందు జీవతములో వుండొచ్చు. మరో ముఖ్యమైన
అంశము - గర్భము రావటము. అబార్షన్ కొన్నిసార్లు విపత్కర పరిస్థితులకు దారి తీసి
మున్ముందు పునరుత్పత్తిపై ప్రభావము చూపిస్తుంది. అంతే కాకుండ అబార్షన్ చేసెటప్పుడు
ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడవచ్చు. ఈ సమస్యలన్ని రక్తహీనత, అనారోగ్యంగా వుండె
అమ్మాయిల్లో ఎక్కువ.
విశృంఖల శృంగార/సెక్స్ జీవితము గడిపినందువల్ల స్త్రీలకు వచ్చె సమస్యలు ఎక్కువ.
సామాజిక పరమైన విషయాలు పక్కన పెట్టెద్దాం. ఆరోగ్యసంబంధ సమస్యల గురించె
నేను చెప్పేది.
- సుఖవ్యాధులు స్త్రీలకు తొందరగ అంటుకుంటాయి. వాటి తీవ్రత కూడ ఎక్కువె.
గర్భాశయము పైన ప్రభావము పడితె ముందుముందు సంతానము కావడములో
ఇబ్బందులు వస్తాయి. కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు కాన్సెర్ ప్రేరకాలు కావచ్చు.
- గర్భము వస్తె గర్భస్రావము, దాని వలన కలిగె దుష్పలితాలు.
అమ్మాయిలు/స్త్రీలు లైంగిక/శృంగార జీవితము ప్రారంభించెముందు వారి ఆరోగ్య స్థితి
తెలుసుకోవాలి. గర్భము, సుఖవ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. నేను పైన
చెప్పినలాంటి కేసులు డాక్టర్ లందరికి అనుభవమే. ఆ స్థితిలో అమ్మాయి జీవితము
అద్రగానమే. ఆరోగ్యము బాగుంటె ఆ సారికి అబార్షను చేసుకొని పరిస్థితి గట్టెక్కవచ్చు.
ఆమ్మాయిలందరు వారు పెద్దమనిషి/రజస్వల తరువాత ఒకసారి రక్త పరీక్ష చేసుకొని
వారి రక్తము గ్రూప్, హిమోగ్లోబిన్ శాతము తెలుసుకోవాలి. హిమోగ్లోబిన్ శాతము
తప్పనిసరిగ 12 గ్రా% వుండెటట్లు చూసుకోవాలి. అందుకు అవసరమైన పౌష్టికాహారము,
మందులు తీసుకోవాలి.
అబ్బాయిలు కూడా వారు జత గూడె అమ్మాయి పట్ల ప్రేమాభిమానాలు వుంటె, వారి
బాంధవ్యములో నిజాయితి వుండాలి. అమ్మాయి ఏ రకంగా అనారోగ్యము పాలు
కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
ప్రస్తుత వాస్తవ పరిస్థితులను అవగాహన చేసుకున్న సామాజిక బాధ్యతగల వ్యక్తిగా
ఇది రాసాను. ఇది వైవహికేతర శృంగారానికి మద్ద్తతు కాదు. దానిలో వుండె ఆరోగ్య
ప్రమాదాలు స్త్రీలకు తెలియచేయటమే నా ఉద్దేశము.
No comments:
Post a Comment