Sunday, June 9, 2013

Babble

ఆ జాదు మాటలు

ఆజాదు మాటలకు అర్థాలే వేరులే
నెలంటె ఎన్ని రోజులో చెప్పలేములే
వారమంటె ఏడు రోజులు మాత్రమే కాదులె
జూనంటె ఏ ఏడు జూనో తెలుసుకోవాలిలె
చర్చలంటె బెరసారలని అర్థము చేసుకొవలెలే
బంగారు గుడ్డు పెట్టే బాతును చంపె
తెలివితక్కువ వాడు ఇప్పుడెవ్వడున్నాడులే!

           *********
పేక పట్టుకున్నంత మాత్రాన
పేకాడినట్టు కాదులే
మాజిక్కులో
ఓ ట్రిక్కు నేర్చుకునేందుకులే

తాటి చెట్టుకిందా కూచున్నా
ముంతలో తెల్లని ద్రవమున్నా
అది కల్లు కాదులే
పాపాయి తాగే పాలైనా కావచ్చులే

సాని కొంపకెళ్ళినా
సరసాలకు కాదులే
సత్సంగము అక్కడైన
కుదురుతుందని ఆశలే.

No comments:

Post a Comment