చార్ ధామ్
గంగమ్మ కట్లు తెంచుకుంది
గట్లు తెంచుకుంది
ఉరకలే వేసింది,
ఉగ్రరూపం దాల్చింది.
గట్లు తెంచుకుంది
ఉరకలే వేసింది,
ఉగ్రరూపం దాల్చింది.
ఎన్ని బాధలు ఓర్చుకుందో
ఎన్ని కన్నీళ్ళు దాచుకుందో
ఓపలేక పరుగులే తీసింది
పవరేంటో చూపింది.
పంచభూతాలేకమైన జీవాత్మా
ప్రకృతై విలసిల్లు పరమాత్మ
మానవుని పెత్తనానికి
ప్రళయమే సమాధానమాయె.
పాపమెవరిదైతెనేమి
జాతికి శాపమాయె
చార్ ధామ్ దర్శించబోయి
శివధామములో చేరిపోయె.

No comments:
Post a Comment