Tuesday, July 30, 2013

Konda Surekha

రాజకీయ చదరంగము
రాజకీయాలు అంటె నాకు కాస్త అసక్తి.  ఎవరెవరు ఏమి మాట్లాడు
తున్నారు, ఎట్లా వ్యవహరిస్తున్నారు అన్నదానిని ఫాలో
అవుతుంటాను.  రాజకీయాల్లో వున్న స్త్రీలంటె నాకు ప్రత్యేక
అభిమానము.  రాజకీయాలు ఎక్కువగ పురుషుల సామ్రాజ్యం
కిందే లెక్క.  ఇందులో స్త్రీలు నిలదొక్కుకోవటమన్నది గొప్ప
విషయమే.  అందులోను బిసి, ఎస్సి  స్త్రీలు వుండటమన్నది చెప్పుకో
దగ్గ విషయమె.  వరంగల్లు జిల్లాలో రాష్ట్రస్థాయి, మళ్ళి మాట్లాడితె
జగన్ కోసము మంత్రి పదవిని, ఆ తర్వాత ఎంఎల్ ఏ పదవిని
కూడా తృణప్రాయంగా త్యజించి, జగన్ మానుకోట ఓదార్పు యాత్రకు
తెలంగాణ ప్రజల వ్యతిరేకతను దాడిని తట్టుకొన్న నిఖార్సైన
రాజశేఖర్ రెడ్డి అభిమానిగా, జగన్ను ముఖ్యమంత్రిని చేసెందుకు తన
వ్యక్తిగత, రాజకీయ భవిష్యత్తును ఫణంగా పెట్టిన తెలంగాణ బిసి మహిళగా
జాతీయ ఖ్యాతిని పొందిన మహిళ శ్రీమతి కొండ సురేఖ.
తెలంగాణ బిసి మహిళగ  రాజకీయల్లో సమర్థవంతంగా నిలదొక్కుకొని
స్థానికంగా ప్రజల మధ్య వుంటు వారి అభిమానానికి పాత్రురాలౌతు
మంత్రి పదవి పొందిన ఆమె అంటె నాకు చాలానే గౌరవము,
అభిమానము.  ఆమె తెలంగాణకు వ్యతిరేకత వున్న YSR తో
వుండటము రాజ కీయాల్లో వున్నఅనివార్యతగా అనుకునేదానిని.
కాని ఆమె తన మంత్రి పదవికి రాజీనామా చేయటము చాలానే
బాధించింది.  ఆ రాజీనామా చేసి అమె ఎన్నుకున్న ప్రజలకు
ద్రోహము చేయటమే కాదు, వరంగల్లు జిల్లా ప్రజలకు కూడా
అన్యాయము చేసింది.  పేరు చివర తోకలున్న ఏ మంత్రి కూడా
రాజశేఖర్ రెడ్డి కోసము గాని, జగన్ CM కావలని కాని రాజీనామా
చేయలేదు.  ఒక బిసి మహిళ మాత్రము పావుగా మారింది.
రాజీనామా చేసి స్వంత ప్రజలకు, ప్రాంతానికి దూరము కావటమే
కాకుండ, ఘనమైన భవిష్యత్తును,రాజకీయ భవిష్యత్తును కోల్పోయింది.
రాజకీయ చదరంగములో కేవలము జెండాలు మోసెవారుగానె బిసిలు
మిగిలిపోతున్నారు.  ఎవరో ఒకరిద్దరు కాస్తా ఎదిగినా తోకల పాములు
ఎదో రకంగా వారిని మింగేస్తుంటాయి.  అది తట్టుకొని ఎదిగె
వారు కొద్దిమందె.  వారిలో శ్రీమతి కొండా సురేఖ ఒక్కరు కావాలని నేను
మనసారా కోరుకుంటున్నాను.  ఇప్పటి వరకు నేర్చుకున్న రాజకీయ
పాఠాలతో జాతీయ స్థాయిలో ఆమె ముందడుగు వేస్తుందని ఆశిస్తున్నాను.

No comments:

Post a Comment