ప్రజాస్వామ్య గెలుపు
నాకు ఇంకా గుర్తు, డిసెంబర్ 9, 2009 నాడు మధ్యహ్న
ప్రసారాలలో KCR స్థితి - అతను restlessగా వుండి
IV లైన్ పీకేసుకునే ప్రయత్నము చేయటము, అతను
షాక్ (బి.పి ప్రమాదకర స్థితికి పడిపోవటము) లోవున్నాడని
అర్థమవుతుంది. ఆ స్థితిలో అతను మరిన్ని గంటలు బతికి
తెలంగాణ సానుకూల ప్రకటన సాధించటము KCR పట్టుదలే
కాదు, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ప్రార్థనలు, వారి తెలంగాణ
ఆకాంక్షతో పాటు దైవానుగ్రహమె. KCR దీక్షతో, విద్యార్థుల
ఉద్యమశక్తితో, తెలంగాణ ప్రజల సంపూర్ణ మద్దత్తుతో జరిగిన
ఉద్యమము, అన్నిపార్టీలు తెలంగాణకు జై కొట్టక తప్పని
పరిస్థితి ఏర్పడింది. అందుకే అఖిల పక్షములో తెలంగాణ
బిల్లు అసెంబ్లిలో పెట్టితే మద్దతిస్తామని దాదాపు అన్ని పార్టీలు
తెలిపినవి. వీరిని నమ్మి, ఎన్నికలు అప్పుడు ఇచ్చిన మాట
నెరవెర్చుకోవటము కోసము, కేసీఆర్ స్థ్తితి అతిప్రమాదకరంగా
వుండటము, అతనికి ఏదైనా అయితే తెలంగాణ
అగ్నిగుండమౌతుందని నాటి కేంద్రహోమ్ మంత్రి, రాత్రి 11.35
నిమిషాలకు "తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలవు
తుంద"ని ప్రకటించటము జరిగింది. కాని ఆ వచ్చిన ప్రకటనకు
తెలంగాణ ప్రజలు కొద్ది గంటలు కూడ ఆనందాన్ని
అనుభవించకుండా ఆంధ్రోల్లు, రాయలసీమోల్లంతా కలిసి,
పార్టీలకతీతంగా కలసిపోయి, ‘U' టర్న్ తో అదరగొట్టి,
విధ్వంసాలతో వైషమ్యాలు సృష్టించి, రాజీనామాల డ్రామాలతో
గవర్నమెంటును పడగొడతామని బెదిరించి, కేంద్ర ప్రకటన
అమలులోకి రాకుండా ఆపినరు. అప్పటినుండి మూడున్నర
ఏళ్ళు తెలంగాణ ప్ర్జజలు తీరేన్ని రకాలుగా ఉద్యమము చేయని
రోజు లేదు.
జయశంకర్ సార్ తెచ్చిన ప్రజాచైతన్యముతో ప్ర్జజలంతా ఏకమై,
కేసీఆర్ రాజకీయ శక్తితో, ప్రజా ఐకాసల అండతో ఆగకుండా
ఉద్యమము సాగింది. కులమతవర్గ భేదము మరిచి ప్రజలందరు
ఉద్యమములో ఎవరికి తోచిన విధంగా, చేతనైన విధంగా ముందుకు
సాగినరు. ఈ సుదీర్ఘ ఉద్యమములో అటుపోట్లకు తట్టుకోలేక,
ఉద్వేగముతో కొందరు, నిరాశా నిస్పృహలో కొందరు తెలంగాణ
తల్లి చెర విడిపించ, కేంద్రానికి బలమైన ఆకాంక్ష తెలిపే ఉద్దెశముతో
మరెందరో యువకులు ప్రాణాలు అర్పించినరు. వారి త్యాగఫలముతో,
ప్రజోద్యమాల బలముతో యెట్టకేలకు కాంగ్రేసు అధిపత్యములో వున్న
UPA ప్రభుత్వము తెలంగాణ ఏర్పాటు దిశగా సానుకూల నిర్ణయము
జులై 30న రాత్రి 7.25 నిమిషాలకు ప్రకటించినది. అది తెలంగాణ అంతా
సంతోషములో మునిగి పోవలసిన సమయమైనా, తెలంగాణ ప్రజలు
సంబురాన్ని ఆపుకోలేక కొద్ది సందడి చేసినా అందరి మనసుల్లో
అనుమానాలే. ఆంధ్రోల్లు మళ్లి ఏం తుంపులు పెడతారోనని. అందుకే
పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టటమే కాదు అది పాసైతేనే తెలంగాణ
రాష్ట్రమంతట మిన్నంటే సంబురాలు చేసుకోవలనె నిర్ణయము.
తెలంగాణ సాధనకు, ఉద్యమానికి ఎందరో మహానుభావులు తమ
జీవితాన్నిఅర్పించారు. జయశంకర్ సార్ తెలంగాణకు జరుగుతున్న
అన్యాయాల గురించి ప్రజలను చైతన్యవంతులని చేసి శాంతియుతంగా
తెలంగాణ సాధించె దిశగా వారిని నడిపించడానికి తన జీవితాన్ని
అర్పిస్తె కొండాలక్షమణ్ బాపుజి తెలంగాణ తొలి తీవ్ర ఉద్యమంలో
మంత్రిగా రాజీనామా చేసి, తెలంగాణ రాష్ట్రములో మాత్రమె తను
మళ్ళి రాజకీయ పదవి చేపడతానని్ శపథము చేసి దానికి
కట్టుబడి, తెలంగాణ మలి ఉద్యమములో కూడా క్రీయాశీలక
పాత్ర పోషిస్తూనే చివరి శ్వాస తీసుకున్నారు.
కేసిఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల ‘హీరో’. తెలంగాణ ప్రజల
నాయకుడిగా తెలంగాణ సాధకుడిగా ఇప్పుడతనికి ఎదురులేదు.
ఒక్క రక్తపుబొట్టు చిందకుండా, రాజకీయంగా ఉద్యమాలతోనే
తెలంగాణ సాధిద్దామని అన్నాడు.ఆ మాట నిలబెట్టుకున్నాడు.
జయశంకర్ సార్ గురుత్వములో తెలంగాణ గురించి అన్ని
అంశాలను ఆకళింపు చేసుకొని, కొండాలక్షమణ్ బాపుజి
ఇంట్లో, ‘జలదృశ్యం’లో, తెలంగాణ రాష్ట్రసమతికి పురుడు పోసి
తెలంగాణ రాష్ట్రసాధన దిశగా ప్రస్థానము మొదలు పెట్టాడు.
2001,ఎప్రిల్ 27 నుండి సాగిన ఈ పోరు పయనము ఎన్నో
ఒడిదొడుకులను తట్టుకొని చివరకు తన గమ్యాన్ని ముద్దాడే
రోజు రానే వచ్చింది. రాజకీయశక్తితో, మేధావుల యుక్తితో,
ప్రజాసంఘాల అండతో తెలంగాణ ప్రజల స్వపరిపాలన కల
అతి త్వరలో నెరవేరబోతుంది. కేసిఆర్, కోదండరాంల
నాయకత్వములో ఎలాంటి హింసా,విధ్వంసము లేకుండా
ప్రజాస్వామ్య బద్దంగా తెలంగాణ ప్రజలు తమ స్వరాష్ట్రాన్ని
తిరిగి సాధించుకున్నరు. నాయకులు ఎంత ధైర్యము
చెప్పినా, బ్రతికి సాధిద్దామన్నా కొంతమంది పోరాటములో
ప్రాణలర్పించి, పోరాటాన్ని తీవ్రతరము చేసినా వారి లోటు
వారి తల్లిదండ్రులతో పాటు తెలంగాణ తల్లికి కూడ తీర్చలేని
వేదనగ మిగిల్చారు.
తెలంగాణ ప్రజలు, డిసెంబర్ 10, 2009 నుండి ఎంత వేదన
అనుభవించినరు! ఎంత పోరాటము చేసినరు! ఆంధ్రా
ప్రభుత్వము వారిని శత్రువులును చూసినట్లు చూసినరు.
వేలమంది విద్యార్థులపై వందల కొద్ది కేసులు, అక్రమ
అరెస్టులు, రకరకాల నిర్భంధాలు, కొట్టి కొట్టి కాళ్ళు
చేతులు విరగ్గొట్టడాలు, తలలు పగలగొట్టడాలు, ముందు
జీవితము లేకుండా చేయడము, చివరకు అవకాశము
వుంటె ప్రాణాలు కూడ పోయెటట్టు చేయడము. ఉస్మానియా
యునివర్సిటిలో విచ్చుకున్న భాష్పవాయు గోళాలకు పేలిన
రబ్బరు తుటాలకు లెక్కెలేదు. లేడీస్ హాస్టల్లో రూముల్లో
వున్న విద్యార్థినులను చీకట్లో బైటకు లాగి పోలీసులు
చేసిన దుశ్చర్యలు బహుశ చరిత్రలో మొదటిసారి అనుకుంటాను.
స్వరాష్త్రములో స్థానిక ప్రజలపై పోలీసులు ఇలాంటి దౌర్జన్యము
చేయటము కేవలము ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రజలపైనె
సాధ్యము. అహింసాయుతంగా ఎలాంటి విధ్వంసాలకు
పాలుపడకున్నా శాంతియుతంగా నిరసన తెలిపే హక్కుకాని
సభలు పెట్టుకునె హక్కుకాని ఆంధ్ర ప్రభుత్వములో తెలంగాణ
ప్రజలకు లేదు. అదే సమయములో2009 డెసెంబర్ రెండవ
వారములో సీమాంధ్రలో జరిగిన విధ్వంసానికి ప్రజల మనోభావాలు
దెబ్బతిన్నాయంటు ఎపి ప్రభుత్వము, సీమాంధ్ర ప్రజాప్రతినిధులు,
పోలీసులు వత్తాసుగా నిలిచారు. తెలంగాణ ప్రజల మనోభావలకు
మాత్రము ఎలాంటి విలువ లేదు! తెరాసా నాయకులు తప్ప
మిగిలిన ప్రజాప్రతినిధులకు వారి పదవులు తప్ప ప్రజల తిప్పలు
పట్టింపు లేదు. భావస్వేచ్చ ప్రకటనలకు కూడ కోర్ట్ నుండి పర్మిషను
తెచ్చుకోవల్సిన పరిస్థితి. కోర్ట్ పర్మిషను ఇచ్చినా సభలకు వెళ్ళాలంటె
ఎన్నెన్ని అడ్డంకులో! రవాణా సౌకర్యాలు ఒక రోజు ముందునుండె
బంద్. ఎట్లో అట్ల కష్టపడి పోయినా దారిలో ఎన్ని ముళ్ళకంచెలో,
ఎన్ని అడ్దంకులో, ఎన్ని చెకింగ్ లో. ఎన్ని పోలీసు ఔట్ పోస్ట్ లు,
ఎన్నిన్ని నిబంధనలు!
ఆంధ్రోళ్ళు వారం రోజులు ఆడిన డ్రామాలతో, కుతంత్రాలతో,
దౌర్జన్యముతో అడ్డంబడి ఆపిన తెలంగాణ ప్రక్రియ తిరిగి మొదలు
పెట్టించడానికి మూడున్నరేళ్ళుగా తెలంగాణ ఉద్యమము సాగింది.
ప్ర్జజలను చైతన్యపరుస్తు, ఉత్సాహపరుస్తు, ఎలాంటి హింసా,
విధ్వంసము లేకుండా ఉద్యమము ఇన్నేళ్లు నడపటము అన్నది
కెసిఆర్, కోదండరాం ఘనతని చెప్పక తప్పదు.
ఈ మూడున్నరేళ్ళలో పలు రకాలుగా ప్రజాభిప్రాయ సేకరణ,
పార్టీల, పార్టీనాయకుల అభిప్రాయాల సేకరణ జరిగినది. క్రిష్ణా కమిటి
ఊరూరు తిరిగి ప్రజల మనోభావలను తెలుసుకుంది.
పార్టిల అభిప్రాయాలూ తెలుసుకుంది . తెలంగాణ
ప్రజల కోరిక ధర్మబద్దమైనదని, అది అణచిపెట్టి వుంచటము
అప్రజాస్వామిక పద్దతుల వలనె సాధ్యమని చెప్పింది.
ఆంధ్ర ప్రభుత్వము అప్రజాస్వామిక పద్ధతుల వలన అణచాలని
చూసింది. కాని ప్రజాస్వామ్యములో ఎన్నికలు తప్పవుకదా!
తిరుగులేని తెలంగాణ శక్తిగా, రాజకీయ అస్థిత్వము
సాధించుకుంటున్న తెరాసావల్ల ఎపిలో కాంగ్రేసు కోట
బీటలువారుతుంటె, యుపియెలో వున్న కాంగ్రేసుకు తెలంగాణ
రాష్ట్ర ప్రక్రియ ముందుకు తీసుకు పోక తప్పలేదు.
అరవై ఏళ్ళుగా పోరాటము చేస్తుంటె మొత్తానికి మరో ఆరు
నెలల్లో తెలంగాణ రాష్ట్రము భారత పటములో 29వ రాష్ట్ర ముగా
రూపు దిద్దుకోబోతుంది. తెలంగాణ రాష్ట్ర సాకారము ప్రజాస్వామ్య
విజయము. అహింసా, ప్రజాచైతన్యము. మెధాశక్తి, రాజకీయయుక్తి
ముందు కుతంత్రము, మోసము దౌర్జన్యము ఎప్పటికైన ఓడిపోక
తప్పదని ఋజువైనది.
ఇకనైన సీమాంధ్రాలు దురాశ మానుకొని వారి రాజధాని వారు
నిర్మించుకొని వారి స్థానములో వారి ప్రజల మేలుకొరకు పాటుపడాలి.
అంతె కాదు. వారి కృత్రిమ ఉద్యమములో భాగస్వాములను చేసు
కున్నా ఉత్తరాంధ్రులకు, రాయలసీమావారి హక్కులకు, అధికారాలకు
భంగము కలగకుండా ప్రవర్తించాలి. ఇప్పటి ఈ తెలంగాణ ఉద్యమము
వల్ల వచ్చిన అనుభవముతో ఉత్తరాంధ్రులు, సీమ వారు కోస్తాంధ్రులతో
ముందునుండె జాగరూకతతో మెదలాలి. లేకపోతే మరో ఇరవయ్యొ,అరవై
ఏళ్ళ తరువాత మరో ఒకటో, రెండో తెలుగు రాష్ట్రాలు ఏర్పడె పరిస్థితి
వస్తుంది.
బతుకు - బతుకనివ్వు అనే సూత్రానికి కట్టుబడి అందరు వుంటె
ఈ ప్రపంచములో గొడవలుండవు కదా!
జై తెలంగాణ! జయహో తెలంగాణ!!

No comments:
Post a Comment