వార్తలు - విశ్లేషలు
సమన్యాయం
"అంతా సమన్యాయం, సమన్యాయం అంటుండ్రు.
సమన్యాయం అంటె ఏంది?"
"అందరిని సమానంగ చూసుకునుడు, ఒక్క తీరుగ
మంచిగ చూసుకునుడన్నట్టు."
"మరి ఈ మధ్య గీ విజయమ్మ సమన్యాయం అని
ఒక్క తీరుగ పాట పాడుతుంది. గదేంది?"
"గదేందంటే...తెలంగాన వస్తుంది కదా, అందుకని
ఆంధ్రొల్లకు తను సపోర్టని ఏదో చేస్తుంది."
"అసలు ఆ ఆంధ్రోల్లు మనల్ను అన్యాయం చేస్తుండ్రనే
‘మా తెలంగాన మాగ్గావల’నే గొడవ మోదలైంది. మన
కన్యాయము జరుగుతుందని అని రకాల కమీటీలు
కమీషన్లు చెప్పినవి కద. ఆ క్రిష్న కమీషను కూడ
వీల్లు పెద్దమనుషుల ఒప్పందం కాన్నుంచి అన్ని హామీలు
అటకెక్కించండ్రని అందుకే తెలంగాన బాధలన్ని అని చెప్పి
తెలంగాన విడగొట్టుడుతో ఆంధ్రోల్లతొ గొడవ వచ్చిన ఎట్లైనా
ముందు వడి చేయమని ఇన్ డైరక్ట్ గా చెప్పింది. మన
కన్యాయము జరిగింది మొర్రో అని మనము మొత్తుకుంటుంటే
ఈ సమన్యాయమేందంటా?"
"అసలే ఆడోళ్ల మాటాలకు అర్థాలే వేరంటారు. ఓట్ల కోస-"
"ఇగో. ఆడాళ్ళో గురించి మాత్రము అట్లా మాట్లాడకు. కావాలంటే
రాజకీయ పార్టీల మాటలకు అర్థాలే వేరను. తెలంగానను ఆంధ్రోల్ల
పాలననుంచి విడిపించినట్టు జగన్ను చెంచల్ గూడ జైలు నుండి
విడిపించమంటుందేమో!"
"ఏమో కొత్త అర్థాలు చెపుతున్నవ్. నీకు ఈ మధ్య రాజకీయ తెలివి
బాగనే పెరిగినట్టుంది!"

No comments:
Post a Comment