ప్రజాస్వామ్యం
"ఇది విన్నవా?"
"ఏంటిది?"
"కిరణ్‍కుమార్ రెడ్డి నిన్న ఓ మీటింగలో అధిష్టానానికే వార్నింగ్
ఇస్తున్నట్టు మాట్లాడిండు."
"ప్రజాస్వామ్యములో ప్రజలే నిర్ణయిస్తరు, పార్టీలు కాదన్నడు."
"అంతేనా. లేకపోతె ప్రజలు ప్రభుత్వానికి సెలవిస్తరన్నడు."
"అవును మరి. కరక్టె కదా. తెలంగాన రాష్ట్రము కోసము
60 ఏండ్ల బట్టి ఇక్కడి ప్రజలు పోరాడవట్టిరి. ప్రజల కనుకూలమైన
నిర్ణయము తీసుకోక పోతె గెలువలేమనే కదా ఆ నాడు రాజశెఖర్
రెడ్డి తెలంగాన ఎమ్మెల్యేలతో సంతకము పెట్టిచ్చి విన్నపాన్ని సోనియా
గాంధికిచ్చిండు. తెలంగాన అన్నడనేకదా అప్పుడు కాంగ్రేసు గెలిచింది.
ఆ తర్వాత తెలుగు దేశం కూడ తెలంగాన ఎత్తుకున్నందుకు ఆ పార్టికి
సీట్లెక్కువ రాలేదా? ప్రజారాజ్యం బెట్టి చిరంజీవి సామాజిక తెలంగాన అని
సీట్లు కొట్టలేదు. అసలు పిఆర్పి లేకుంటే టిడీపేనె గెలిచేదనుకుంటా .
బిజేపి కూడ ఇప్పుడు తెలంగానకు సరెనంటుంది. అసలు
వాళ్ళ హయాంలో ఇవ్వలేక పోయినందుకు అడ్వాని బాధపడుతు అనలేదా-
చంద్రబాబు వల్లె మేము తెలంగాన ఇవ్వలేదు. ఇప్పుడు అనవసరంగా
కాంగ్రేసు ఆ క్రెడిట్ కొడుతుందని బిజేపోల్ల బాధ కూడ వుంది."
"అట్లంటే, జగన్‍కు సపోర్ట్ గా ఆంధ్రాలో ఎమ్మెల్యేలు రిజైన్ చేసి మళ్లి
ఎలక్షన్లో నిలుచున్నప్పుడు టిజి వెంకటేషు ఒక్కటె మొత్తుకోలేదా,
జగనుకు ఓటెస్తె రాష్ట్రము విడిపోతదని, సమైక్యంగ వుండాలంటే
కాంగ్రేసుకే ఓటెయ్యాలని. అయినా కట్టగట్టుకొని అక్కడోళ్లు
జగన్నే గెలిపియ్యలేదా? అంటె రాష్ట్రము విడిపోయినా వాళ్లకేమి
బాధ లేదన్నట్ట్టేగద. అక్కడ ‘జై ఆంధ్రా’ అనేటోల్లు వున్నరు,
‘జై రాయలసీమ’నేటోల్లున్నరు, మన దగ్గర అంత ఒకటె మాట”
‘జై తెలంగాన, జై జై తెలంగాన.’"
"అవును. మనోళ్ళందరికీ, అక్కడ సామాన్య ప్రజలందరికి రాష్ట్రము వేరు
పడాలనేవుంది. ‘థూ, థూ’ అన్నా ఎన్ని రోజులు పడుకుంట వుండాలని
అక్కడ మామూలోళ్ళు అనుకుంటుండ్రు. వాళ్లకు రాజధాని వస్తె వాళ్లకు
కూడ మంచి అవకాశాలు వస్తయని. అక్కడ, ఇక్కడ కూడ వేరు పడితె
బడుగులకు రాజ్యాధికారము వచ్చే అవకాశముందని. ఈ బలిసినోళ్లు
చెయ్యబటికే ఈ గొడవంతా."
"ఎట్లైనా ఆంద్రాలో తెలంగాన ఇచ్చినా ఇయ్యకున్న జగని పార్టీ, తెలుగుదెశం
వస్తది. చంద్రబాబు తెలంగానకు ఓకే అన్నా మొన్న పంచాయితి ఎలక్షన్లో
బాగానే గెలిచిండు. అక్కడ చంద్రబాబు జెండా ఎగిరేశినా ఆశ్చర్యం లేదు.
తెలంగానలో మాత్రం తెలంగాన ఇస్తె ప్రజలు కాంగ్రేసును తప్పకుండా గెలిపిస్తరు.
లేకపోతె గుండు సున్ననే పెడ్తరు. టిఆరెస్‍నె గెలిపిస్తరు. ఇది ప్రజాస్వామ్యము కదా.
ప్రజలే నిర్ణయిస్తరు.కిరణ్ కుమార్ రెడ్డి సొంతూల్లో కూడ గెలుస్తడో లేక ప్రజలు
సెలువిస్తరో చూడాలె."

No comments:
Post a Comment