వార్తలు - విశ్లేషలు
ఒడువని ముచ్చట
"తెలంగాన వస్తుందంటవా?"
"వస్తదొస్తది."
"ఏమో. రోజుకో కొత్త కత పెడుతుండ్రు ఈ ఆంద్రోల్లు."
"ఎన్ని కతలు పెట్టినా తెలంగాన రాక తప్పదు."
"పదమూడేండ్ల బట్టి ఉద్యమం నడుస్తుంది. పిల్లల చదువులు
చెడిపోతున్నయి. జరిగే అన్యాయం ఇంక ఎక్కువనే అయి
తుంది. మొన్నటిదాక తెలంగానకు వ్యతిరేకము కాదన్న్లొల్లు
ఇప్పుడు కేంద్రము తెలంగాన ఇస్తె మేమొద్దంటమా అన్నరు.
కాంగ్రేసోల్లు అధిష్టానం నిర్నయానికి కట్టుబడి వుంటమన్నరు.
అందరొప్పుకున్నరు కదాని కాంగ్రేసు ఒప్పుకొని తెలంగాన
ఇస్తనంటే అంతా అట్లేట్ల ఇస్తరని ఒకటె ఎగురుతున్నరు."
"ఎవలేమన్నా తెలంగాన రాక తప్పదు. గీ అలర్లు చూసి
కాంగ్రేసు తెలంగానా ఇయ్యకుంటె రేపు బిజేపి ఇస్తది."
"అప్పుడు మాత్రం గీ సీమాంధ్రోల్లు మళ్ళి గాయి చేయకుంటరా?
రాజ్యసభల ఆ వెంకయ్యనాయుడు సీమాంధ్ర ఎంపిలకు ఎంత
సపోర్టుగ మాట్లాడినడనుకున్నవ్. తెలంగాన విషయ మొచ్చేసరికి
మోకమెంత మాడ్చుకూచన్నడో నువు చూడలేదు."
"గవన్ని చూసి నన్ను పరెషాన్ చేయ్యకు. ప్రజలు తెలంగాన
మర్చిపోయె ముచ్చటే లేదు. టిఆరెస్స్ పార్టి వున్నంత వరకు
అది తెలంగానను మర్చిపోనియ్యదు. అది కాకపోతె ఇంకో
రాజకీయ పార్టీ వస్తది. అధికారం కోసమె కదా ప్రతి పార్టీ
తెలంగానకు జై కొట్టింది."
"కరక్టె. కాని సీమాంధ్రోల్ల్లు మాటలు చూస్తుంటె నాకైతె టెన్షన్
పెరుగుతుంది. ముందేమొ అధిష్టానమన్న్రరు. ఇప్పుడామెను
ఇష్టమొచ్చినట్టు తిడుతున్నరు. అన్నదమ్ములంటున్నరు.
మనోల్లను ఆంధ్రలో తన్నవట్టిరి. కడుపుతోటి వున్నామే అవస్థతోటి
ఆస్పటల్కు పోతే, ఆమేమి డాక్టరమ్మో "తెలంగాన అంటేనె అసహ్యము
నీ తెలంగానలోనె చుపెట్టుకో పో" అని ఎళ్ళగొట్టిందట. ఇక్కడ మనోల్లు
కూడ అట్ల చేస్తె ఎట్లుంటది?"
"వాల్లు ఏదో చెసినరని మనము చేస్తమా? వాళ్లలాగ మనము కుళ్ళు
కుయుక్తులతో వుండుంటె మన పరిస్థితి ఇప్పుడు ఇట్లా వుండేదా?"
"మన మంత్రులంత చేతగానోళ్ళ లెక్కున్నరు. అధిష్టానమేమి చెప్తే
గంతే నని ఊకుంటరు. ‘బాంచెను కాల్మొక్తా’ని గమ్మునుంటరు. గా
వాల్లు చూడు అధెష్టానాన్ని ఎన్నెన్ని మాటలంటుండ్రు, ఎన్నెన్ని
శాపనార్థాలు పెడుతుండ్రు. గిదంత చూస్తుంటే కాంగ్రేసోల్లు మళ్ళి
ఎన్కకు పోతరేమోన్పిస్తుంది."
"వాల్లు మళ్ళి మళ్ళి చెపుతుండ్రు కద, తెలంగాన ఇచ్చుడు తప్పదని.
నువ్వు ఇంక మాట్లాడకు. గా ఆంధ్ర పేపరు చదివి, టివిలు చూసి
నువ్వు పరేషానై నన్ను పరేషాని జెయ్యకు. ఆ కేబల్ టివి కట్ చేయిస్త.
ఆంధ్రోల్ల తెలుగు పేపరు కూడ బందువెట్టిస్తా. గా తెలంగాన పేపరు
ఒక్కటి చదివు. లేకపోతె నువ్వు రంది పడి నన్ను పరేషాని జేసి
హార్ట్ అట్టాక్ తెప్పిచ్చేటట్టునవ్."

No comments:
Post a Comment