అందమైన గులాబీలంటె అందరికి ఇష్టమె. వాటిని సొంతం చేసుకోవాలంటె ముళ్ళు గుచ్చుకోకుండా జాగ్రత్త తీసుకోవాలి. జీవితంలో కూడా ఏదైన కావలనుకుంటె కొన్ని కష్టాలు ఓర్చుకోక తప్పదు.
Tuesday, December 31, 2019
Saturday, December 7, 2019
ఆటవిక న్యాయం
జనారణ్యంలో
మృగాలకు
ఆటవిక న్యాయం
సరి! సరి!
బలవంతుల
చేతిలో
బలహీనులు
బలి! బలి!
*******
అడిగిందె అయింది
అనుకున్నట్లే అయింది
అయినా
అంతరాంతరాలలో
భయం, భయం
న్యాయం వికటాట్టహాసం!
ధర్మం ఆక్రోశం!
*********
మండే గుండెలపై
చిటికెడు
నీళ్ళు చిల్కరించారు
ఆ జ్వాలలు చల్లారేనా?
వేరు పురుగుకు
వైద్యం చేయక
వాడిన కొమ్మను నరికితె
చెట్టు చిగురించేనా?
*********
హృదయం
చిధ్రమైంది
దానిని అతికించె
మలామేది?
మానవత్వమే మందైతె
అది
అందని పండైంది!
********
కళ్ళెం లేని
కోరికలు
జీవితాలు
దహిస్తుంటే
ఆలోచన లేని
ఆవేశాలకు
రాజ్యం
లొంగిపోయింది!
*********
నిరంతర
నిఘాలో
ఆడ బతుకు!
మగవాడి
కౄరత్వానికి
లేదా అదుపు?
**********
ప్రజాస్వామ్యంలో
రాజకీయ మృగాలకు
కోర్టులో
జీవితాంతం వాయిదాలు?
సామాన్యుని
నేరానికి
ప్రజాకోర్టులో
ఇన్స్టంట్ శిక్షలు!
**********
మాటల తుటాలతో
జీవితాలు
అంతం చేసిన
నాయకులకేది శిక్ష?
ప్రజాస్వామ్యంలో
ప్రభుత్వాన్ని
నిలదీసే సామాన్యునికి
కావాలి
ఎన్కౌంటర్ నుండి రక్ష!
Thursday, August 29, 2019
ధనిక రాష్ట్రం
నా రాష్ట్రం
ధనిక రాష్ట్రం!
నాలుగు కోట్ల జనాభా
కోటి కుటుంబాలు
సగుటున నలుగురు
నా రాష్ట్రం
ధనిక రాష్ట్రం!
కోటి కుటుంబాలు
సగుటున నలుగురు
కుటుంబానికి
ధనిక రాష్ట్రం!
కోటి కుటుంబాలు
నా రాష్ట్రం!
కోటి తెల్ల కార్డులు!
సంక్షేమానికి
మారు పేరునా రాష్ట్రం!
నా రాష్ట్రం
రైతన్నకు నేస్తం
ధనిక పేద
తేడా లేదు
ఎకరం వున్న రైతుకైనా
వందల ఎకరాలున్న
భూస్వామికైనా
అందరికి
రైతు బంధు పథకం!
ప్రపంచానికే
ఆదర్శం
నా రాష్ట్రం
సంక్షేమ రాష్ట్రం!
వందల ఎకరాలున్న
భూస్వామికైనా
అందరికి
రైతు బంధు పథకం!
ప్రపంచానికే
ఆదర్శం
నా రాష్ట్రం
సంక్షేమ రాష్ట్రం!
Saturday, August 10, 2019
అర్థం కానిది
స్వచ్ఛ మైన నీళ్ళివలేం
కుంట నీళ్ళలో ఓ తులసి దళం
అయితుందా పవిత్ర జలం
పోయే ప్రాణానికి ఆధారం
*************
స్వచ్ఛ భారత్ లో
వైద్యం కలగాపులగం
హద్దులు తెలియని వైనం
********************
ఆకలి మంటకు
కారం మెతుకులు ఆసరా
కలిగె కష్టం నష్టం
పట్టించుకునేదెవరురా?
**************
ఆ కాలంలోనె వారు
కత్తులు పట్టారు, కాన్ఫులు చేసారు
చేద్దాం వాళ్ళని
సర్జన్లు, అబ్స్టెట్రిషన్లు!
************
కోట్లు పెట్టి సీట్లు కొంటె
కన్సుమర్ కోర్టు వుంది
డిగ్రీ గ్యారెంటి
ప్రాణాలకే లేదు వారంటి!
******************
మూగజీవులకు వైద్యం చేసె మహానుభావులు
తోటి మానవులకు ఎందుకు వైద్యం చేయకూడదు?
Saturday, August 3, 2019
స్పందన
ఈ మధ్య కాలంలో నా చుట్టు చాలా చాలా మార్పులు వచ్చాయి. నేనెమి రాయలేక పోయాను.
ఇవాల నా భావాలు బైట పెట్టాలనిపించింది.
ఇవాల నా భావాలు బైట పెట్టాలనిపించింది.
*******
అడవులు కొట్టేసి ఇండ్లు కట్టిండ్రు
కోతులు ఇంట్లకు వస్తుంటె గొడవ పెడుతున్రు
కోతులు ఇంట్లకు వస్తుంటె గొడవ పెడుతున్రు
*******
ప్రజాస్వామ్యంలో కుటుంబ వారసత్వం
వాడవాడల గుండా రాజకీయం
*******
ప్రజాపన్నుల ఆదాయం
సంక్షేమ పథకాలలో మాయం
అభివృద్ధి ఆమడ దూరం
******
సంక్షేమంలో సోమరులకు
చద్దన్నమే మహాప్రసాదం
ఓట్లతో గెలిచిన నాయకులకు
కలకాలం రాజవైభోగం
చద్దన్నమే మహాప్రసాదం
ఓట్లతో గెలిచిన నాయకులకు
కలకాలం రాజవైభోగం
*****
ఒక్క నిర్దోషిని గుర్తించక
తొమ్మిది దోషుల విడుదల
అచ్చోసిన ఆంబోతులు
జర జాగ్రత్త
తొమ్మిది దోషుల విడుదల
అచ్చోసిన ఆంబోతులు
జర జాగ్రత్త
******
హంతకులను ఆదరిస్తె
రాజ్యాలేలుతారు
దోపిడి దొంగలు
దేశమునుండి పరార్
రాజ్యాలేలుతారు
దోపిడి దొంగలు
దేశమునుండి పరార్
******
కాపికొట్టి పాసు
పైసలతో సీటు ఖరార్
దోపిడికి తయార్
పైసలతో సీటు ఖరార్
దోపిడికి తయార్
*******
ఆ మె రి కా లో
ఆధునిక వైద్యం నాకు
అన్ని వేళలా
ఆధునిక వైద్యం నాకు
అన్ని వేళలా
RMP వైద్యం నీకు
xxxxxxxx
Sunday, June 16, 2019
Saturday, January 5, 2019
నిద్ర సుఖమెరుగదు
నిద్ర సుఖమెరుగదంటరు. మంచి నిద్ర వస్తె ఏ హంసతూలిక తల్పాలు అవసరం లేదు. కటిక నేలె పూల పాన్పు, చెయ్యె తలకింద మెత్తగ వుంటది.
![]() |
| చుట్టు పక్కల ఎంత మంది వున్నా ముంచుకొచ్చె నిద్రకు ఏవి అడ్డు కాదు |
రైలు ప్లాటుఫాం మీద ఖాలి నీళ్ళ బాటల్ తలగడగా కూడ పనికి వస్తుంది
అలసిసొలసిన మనిషికి చిన్న టోపినె ఎండనుండ రక్షణ
అలసిసొలసిన మనిషికి చిన్న టోపినె ఎండనుండ రక్షణ
రాత్రంతా భజన చేసి అలిసినట్టుంది
అలసిసొలసిన మనిషికి చిన్న టోపినె ఎండనుండ రక్షణ
Subscribe to:
Comments (Atom)







