Wednesday, May 1, 2024

నేటి రాజకీయాలు

 


భిన్నత్వములో ఏకత్వం

అన్నీ పార్టీల సిద్ధాంతం

చందమామను చూపి

ముక్క ఇచ్చి, చుక్క తాపి

కొంత రొక్కమూ ఇచ్చి

ఓట్లు వేయించుకోవటం

ఆధికారం చేజిక్కించుకోవటం

అదీ రాజకీయం.

 ***********

శత్రుత్వంలేదు, మిత్రత్వం లేదు

అంటరానితనం అసలే పనికిరాదు

శత్రువుతో సోపతి, ప్రాణమిత్రున్నైనా

నట్టేట ముంచటము

తేడా వస్తే వండి వడ్డించిన

చేతినే విరిచేయటము

అంతా ప్రజాభిష్టమే, కార్యకర్తల ప్రోద్బలమే

ఇదీ రాజకీయం - నేటి రాచరికం

No comments:

Post a Comment