తెలంగాణలో ఇవ్వాళ సార్వత్రిక ఎన్నికలు. ప్రజలందరు ఉత్సాహంగా ఓట్లు వేస్తున్నరు. పల్లెలో ఓటు వుండి పట్టణాల్లో నివసిస్తున్న జనాలు నిన్నటి నుండే ఊర్లకు వెళ్ళటము మొదలు పెట్టారు. సామాన్యంగా పట్టణాల్లో వుండే చదువుకున్న వాళ్ళు ఎందుకో మరి ఓటు వేయటములో శ్రద్ధ చూపరనిపిస్తుంది. ఎప్పుడు కూడా పల్లెల్లో ఓటింగ్ శాతము
ఎక్కువగా, పట్టణాల్లో తక్కువగా వుంటుంది. పట్టణ ప్రజలకు, ముఖ్యంగా హైదరాబాద్లో
ఓటింగా చాలా తక్కువగా వుంటుంది. అక్కడ వలస
వచ్చినవారు ఎక్కువ కాబట్టి వారికి శ్రద్ధ వుండదనుకుంట. లేకపోతే ఎవరు గెలిచినా వారి జీవితములో పెద్ద మార్పు
ఏమి వుండదనే నిరాశనా?
పల్లెల్లో ఓట్ల పండగ అంటే సంబరమే. ప్రచారములో పాలుగొనటము, దానివల్ల కొంత ఆదాయము పొందటము, ఓటుకు ఎంతో కొంత డబ్బు
లేదా మరేదైనా లాభము పొందటము సామాన్యంగా జరుగుతుంది. పల్లెలో వుండేది ఎక్కువగా రైతులు, కులవృత్తులపై ఆధారపడి జీవిస్తున్నవారు.
పేదరికము ఎక్కువే. అందువల్ల ప్రభుత్వ
పాలసీల వల్ల కలిగే లబ్ది అక్కడ ప్రత్యక్షంగా కనబడుతుంది. పల్లె ప్రజల్లో పైకి కనిపించక పోయిన రాజకీయ చైతన్యము
ఎక్కువ అని నాకనిపిస్తది. పట్టణాల్లో ఓటింగి సరళికి భిన్నంగా పల్లె ఓటింగ్ వుంటుంది.
నెట్ అందరికీ అందుబాటులో వుంటుంది. సామాజిక మాధ్యమాల్లో వచ్చే అన్నీ- అసలు, ఫెకు వార్తులు, వీడియోలు అందరు చూస్తున్నరు. వాస్తవ పరిస్థితులు, సామాజిక
మాధ్యమాల్లో వచ్చే విషయలలో వాస్తవస్తావాలు, కనిపించేదానికి చూపేవాటికి
వ్యత్యాసాలు ప్రజలు తెలుసుకొని ఓటు ఎవరికి వేస్తారో, ఎవరిని గెలిపిస్తారో మరో మూడు వారాలకు తెలిసిపోతుంది.
వ్యక్తిని చూసి ఓట్లు వేస్తారా లేక పార్టీ పాలసీలకు ఓట్లు పడతాయ
వేచి చూడాలి.

No comments:
Post a Comment